Portable Power Station: ప్రకృతి ఒడిలో గడపాలని.. అడవుల్లోనో, కొండల్లోనో క్యాంపింగ్ చేయాలని చాలామంది ఆరాటపడుతుంటారు. అయితే అక్కడికి వెళ్లాక ఎదురయ్యే అతిపెద్ద సమస్య ‘విద్యుత్’ (Power). ఆయా ప్రాంతాల్లో ఫోన్లు, కెమెరాలు, లైట్లు, ఇతర గాడ్జెట్లు ఛార్జింగ్ చేసుకోవడం పెద్ద సవాలుగా మారుతుంది. ఈ సమస్యకు ప్రముఖ బ్యాటరీ బ్రాండ్ బ్లూయెట్టి (Bluetti) చెక్ పెట్టింది. మార్కెట్లోకి సరికొత్త ‘ఎలైట్ 300’ (Bluetti Elite 300) అనే బుల్లి పవర్ స్టేషన్ ను తీసుకొచ్చింది. దాని ప్రత్యేకతలేంటో ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
సాధారణంగా 3 కిలోవాట్ అవర్ (3kWh) కెపాసిటీ ఉన్న పవర్ స్టేషన్లు చాలా పెద్దవిగా, బరువుగా ఉంటాయి. కార్లలో తీసుకెళ్లడం కూడా కష్టంగా మారుతుంది. కానీ ‘బ్లూయెట్టి ఎలైట్ 300’ మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచేలా చాలా చిన్న సైజులో రూపుదిద్దుకుంది. మార్కెట్లో అందుబాటులో ఉన్న అతి చిన్న, శక్తివంతమైన పవర్ స్టేషన్లలో ఇది ఒకటిగా నిలిచింది. సైజ్ చిన్నగా ఉన్నప్పటికీ అత్యధికంగా విద్యుత్ ను స్టోర్ చేయగల సామర్థ్యం దీనికి ఉందని కంపెనీ వర్గాలు తెలిపాయి.
ఈ పవర్ స్టేషన్ అసలైన సామర్థ్యాన్ని చెక్ చేసేందుకు కొందరు యూట్యూబర్లు దీన్ని పరీక్షించగా.. మెరుగైన ఫలితాలను అందించింది. క్యాంపింగ్‌లో ఉపయోగించే చిన్న చిన్న ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి మొదలుకొని, మైక్రోవేవ్ ఓవెన్లు, కాఫీ మేకర్లు, క్యాంప్‌సైట్ లైటింగ్, పోర్టబుల్ ఫ్రిజ్‌ల వరకు 10 రకాల పరికరాలను దీనికి అనుసంధానించగా.. ఇది సమర్థవంతంగా వాటికి ఛార్జింగ్ అందించింది. స్మార్ట్‌ఫోన్లు, కెమెరాలు, డ్రోన్‌లను ఏకకాలంలో పలుమార్లు ఫుల్ చార్జింగ్ చేసినప్పటికీ దీని బ్యాటరీ లెవెల్ గణనీయంగా తగ్గకపోవడం విశేషం.
రాత్రివేళల్లో క్యాంపింగ్ ప్రాంతాన్ని వెలిగించే హై-పవర్ లైట్లు, పోర్టబుల్ కూలర్లు, ఫ్రిజ్‌లు గంటల తరబడి ఎలాంటి అంతరాయం దీని ద్వారా పనిచేయనున్నాయి. అడవులు, కొండ ప్రాంతాల్లో ప్రయాణాలకు విద్యుత్ సమస్య లేకుండా చక్కటి పవర్ స్టేషన్ గా ఇది పనిచేయనుంది. సాంప్రదాయ గ్యాస్ జనరేటర్ల లాగా ఇవి పొగను, శబ్దాలు చేయదని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ప్రకృతిని ఆస్వాదించడంలో ఎలాంటి ఇబ్బంది ఇది కలిగించదని పేర్కొంటున్నారు.
Also Read: ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?
బ్లూయెట్టి ఎలైట్ 300 ధర భారత్ లో దాదాపు రూ.2,41,227గా ఉంది. డెజర్ట్ కార్ట్ ఇండియా సైట్ లో దీనిని కొనుగోలు చేయవచ్చు. అవుట్ డోర్ ప్రయాణాలు, లాంగ్ ట్రిప్ లకు ఎక్కువగా వెళ్లేవారికి ఈ పవర్ స్టేషన్ బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా టెక్నాలజీ ప్రియులకు, క్యాంపింగ్ ప్రేమికులకు ఇదొక అద్భుతమైన పరికరమని స్పష్టంచేస్తున్నారు.
Also Read: అయ్యబాబోయ్.. ‘సైకిల్ అంబులెన్స్’ అంట.. నెట్టింట మళ్లీ జోకర్ అయిన పాక్!