E-Paper
Advertisement

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?
Advertisement

Air Fryer: ఈ మధ్య కాలంలో ఎయిర్ ఫైయర్ల వినియోగం క్రమంగా పెరుగుతోంది. నూనెతో పెద్దగా అవసరం లేకుండా వంటలు క్షణాల్లో సిద్ధమైపోతుండటంతో మహిళలు వీటిపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎయిర్ ఫ్రైయర్లు ప్రతీ ఇంట్లో ఉండాల్సిందేనా? ఆరోగ్యపరంగా కలిగే బెనిఫిట్స్ ఏంటి? అదే సమయంలో ప్రతికూలతలు ఏమున్నాయి? ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

తక్కువ నూనెతో హెల్తీ వంటలు

వంటింట్లో సాధారణంగా చేసే డీప్ ఫ్రై వంటకాల్లో బోలెడంత నూనె పడుతుంది. కానీ ఎయిర్ ఫ్రైయర్ వేడి గాలి (Hot Air Mechanism) ఆధారంగా పనిచేస్తుంది. దీనివల్ల దాదాపు 70 నుండి 80 శాతం వరకు నూనె వినియోగాన్ని తగ్గించుకోవచ్చు. ఫలితంగా శరీరంలోకి చేరే క్యాలరీలు, కొవ్వు పదార్థాలు తగ్గుతాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి, గుండె ఆరోగ్యంపై శ్రద్ధ చూపేవారికి ఎయిర్ ఫ్రైయర్ బెస్ట్ ఆప్షన్ గా చెప్పవచ్చు.

హానికర రసాయనాలకు చెక్

Advertisement

సాధారణంగా నూనెను ఎక్కువగా మరిగించి ఫ్రై చేసినప్పుడు ‘అక్రిలమైడ్’ (Acrylamide) వంటి హానికర రసాయనాలు విడుదలవుతాయి. ఇవి క్యాన్సర్ ముప్పును పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు. అదే ఎయిర్ ఫ్రైయర్ ఉపయోగించడం వల్ల ఇటువంటి రసాయనాలు ఉత్పత్తయ్యే అవకాశం చాలావరకు తగ్గుతుంది. అంతేకాకుండా సమయం ఆదా అవ్వడం, శుభ్రం చేయడం తేలిక కావడం అడిషనల్ బెనిఫిట్స్ గా చెప్పవచ్చు.

మరి లోపాల సంగతేంటి?

ఎయిర్ ఫ్రైయర్ వల్ల లాభాలతో పాటు కొన్ని పరిమితులు సైతం ఉన్నాయి. సాధారణ డీప్ ఫ్రై ద్వారా వచ్చే అసలైన క్రిస్పీ రుచి, క్రిస్పీ టెక్స్చర్ ఎయిర్ ఫ్రైయర్ వంటల్లో మిస్ అవ్వొచ్చు. ఈ ఎయిర్ ఫ్రైయర్లు చిన్న పరిమాణంలో ఉండటం వల్ల పెద్ద ఫ్యామిలీలు ఒకేసారి ఎక్కువ పరిమాణంలో వంట చేయడం కష్టం అనిపిస్తుంది. రెండు మూడు సార్లు చేయాల్సి వస్తుంది. మరోవైపు పిండి పదార్థాలు, ఆకుకూరలు ఇందులో సరిగా వేగవన్న అభిప్రాయాలు ఉన్నాయి. మరోవైపు పరికరంలో అధిక ఉష్ణోగ్రత వద్ద వండటం వల్ల కొన్ని రకాల సున్నితమైన విటమిన్లు నశించే ఛాన్స్ ఉంది.

Advertisement

Also Read: అయ్యబాబోయ్.. ‘సైకిల్ అంబులెన్స్’ అంట.. నెట్టింట మళ్లీ జోకర్ అయిన పాక్!

ఇంతకి కొనొచ్చా? లేదా?

రోజువారీ ఆహారంలో వేపుళ్లు, ఫ్రైడ్ స్నాక్స్ ఎక్కువగా తింటూ.. నూనె వినియోగాన్ని తగ్గించుకోవాలని భావిస్తే ఎయిర్ ఫ్రైయర్ బెస్ట్ అని చెప్పవచ్చు. అయితే ఎయిర్ ఫ్రై చేసినంత మాత్రాన ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్స్ ఆరోగ్యకరంగా మారిపోవని నిపుణులు చెబుతున్నారు. అయితే అధిక నూనెతో చేసే సాధారణ వేపుళ్ల కంటే ఎయిర్ ఫ్రైయర్ లో వాడటం మంచిదని సూచిస్తున్నారు.

Also Read: ఏంది భయ్యా ఇది.. జియోలో రూ.350 లోపు.. ఇంత మంచి ప్లాన్స్ ఉన్నాయా!

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×