E-Paper
Advertisement

Beard Transplant: మ్యాన్లీ లుక్ కోసం బియర్డ్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంటున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

Beard Transplant: మ్యాన్లీ లుక్ కోసం బియర్డ్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంటున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
Advertisement

Beard Transplant: గడ్డం అందంగా ఉండాలనే ఆశ ప్రతి మగవారికి ఉంటుంది. కానీ కొందరికి జన్యుపరమైన కారణాల వల్ల లేదా ఇతర సమస్యల వల్ల గడ్డం సరిగ్గా పెరగదు. ఇలాంటి వారికి ‘బియర్డ్ ట్రాన్స్‌ప్లాంట్’ (గడ్డం మార్పిడి) ఒక అద్భుతమైన పరిష్కారం. అయితే.. ఈ చికిత్స చేయించుకునే ముందు దీని వల్ల కలిగే ఉపయోగాలు, కలిగే నష్టాలను గురించి పూర్తిగా తెలుసుకోవాలి.

Advertisement

గడ్డం ట్రాన్స్‌ప్లాంట్ అంటే ఏంటి ?

సాధారణంగా తల వెనక భాగం నుంచి వెంట్రుకల ఫోలికల్స్‌ను తీసి, గడ్డం లేని చోట లేదా పల్చగా ఉన్న చోట ఉంచడాన్ని ‘బియర్డ్ ట్రాన్స్‌ప్లాంట్’ అంటారు. ఇది ఎక్కువగా FUE (Follicular Unit Extraction) పద్ధతిలో జరుగుతుంది.

Advertisement

ఎదురయ్యే రిస్కులు, సైడ్ ఎఫెక్ట్స్ :

ఏ చికిత్సలోనైనా కొన్ని ఇబ్బందులు ఉన్నట్లే.. ఇందులో కూడా కొన్ని తాత్కాలిక సమస్యలు ఉంటాయి.

వాపు, ఎరుపు : సర్జరీ జరిగిన తర్వాత ముఖం, తల వెనుక వాపు, ఎరుపు కనిపిస్తుంది. ఇది సాధారణంగా 3 నుంచి 7 రోజుల్లో తగ్గిపోతుంది.

దురద : కొత్తగా ట్రాన్స్‌ప్లాంట్ చేసిన వెంట్రుకల దగ్గర ప్రారంభంలో దురద రావడం సహజం. అయితే గోళ్లతో ఈ భాగంలో తాకడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది.

చిన్నపాటి మచ్చలు: FUE పద్ధతిలో మచ్చలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ పూర్తిగా ఉండవు అని చెప్పలేం. అనుభవం లేని డాక్టర్ల దగ్గర చేయించుకుంటే మచ్చలు స్పష్టంగా కనిపించే ప్రమాదం కూడా ఉంటుంది.

ఇన్ఫెక్షన్ : పరిశుభ్రత పాటించకపోతే ట్రాన్స్‌ప్లాంట్ చేసిన చోట బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది.

జుట్టు రాలడం : సర్జరీ తర్వాత కొన్ని వారాలకు ట్రాన్స్‌ప్లాంట్ చేసిన జుట్టు రాలిపోతుంది. దీనిని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది సహజమైన ప్రక్రియ. ఆ తర్వాత మళ్లీ కొత్త జుట్టు వచ్చే అవకాశం కూడా ఉంటుంది.

సూచనలు:

సర్జరీ తర్వాత ముఖం సాధారణ స్థితికి రావడానికి కొంత సమయం పడుతుంది.

మొదటి 2-3 రోజులు: ముఖం మీద చిన్న చిన్న పింపుల్స్ లాగా ఏర్పడతాయి. ఇవి పడిపోయే వరకు వాటిని తాకకూడదు.

మొదటి వారం: ఈ సమయంలో కఠినమైన వ్యాయామాలు చేయకూడదు. చెమట పట్టడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది.

10 రోజుల తర్వాత: మీరు సాధారణంగా షేవింగ్ చేసుకోవచ్చు.

పూర్తి రిజల్ట్: గడ్డం పూర్తిగా పెరగడానికి, సహజంగా కనిపించడానికి 6 నుంచి 12 నెలల సమయం పడుతుంది.

జాగ్రత్తలు:

ఎండకు దూరం: సర్జరీ తర్వాత కొన్ని వారాల పాటు నేరుగా ఎండ తగలకుండా చూసుకోవాలి.

మద్యపానం, మద్యం: ఇవి రక్తం గడ్డకట్టే ప్రక్రియను, కోలుకునే వేగాన్ని తగ్గిస్తాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి.

సరైన డాక్టర్‌ను ఎంచుకోవడం: బీర్డ్ ట్రాన్స్‌ప్లాంట్ అనేది చాలా సున్నితమైన ప్రక్రియ. కేవలం తక్కువ ధరలో వస్తుందని కాకుండా.. అనుభవం ఉన్న డెర్మటాలజిస్ట్ లేదా ప్లాస్టిక్ సర్జన్‌ను మాత్రమే ఇందుకోసం సంప్రదించాలి.

బియర్డ్ ట్రాన్స్‌ప్లాంట్ అనేది గడ్డం లేని వారికి ఒక శాశ్వత పరిష్కారం. సరైన జాగ్రత్తలు తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువగా ఉంటాయి. మీరు ఈ సర్జరీ చేయించుకోవాలనుకుంటే ముందుగా మీ చర్మ తత్వాన్ని డాక్టర్ ద్వారా పరీక్షించుకోవడం మంచిది.

Related News

ఆటిజం ఉన్న పిల్లలకు ఏకాగ్రత మెరుగుపరిచే టెక్నిక్.. కొత్త అధ్యయనంలో ఆసక్తికర ఫలితాలు

ఆన్‌లైన్‌లో యువతితో ప్రేమ.. ప్రియురాలిని కలవడానికి 1900 కిమీ ప్రయాణం.. ఏఐ దెబ్బకు మైండ్ బ్లాక్

ఘాటు ఘాటుగా మష్రూమ్ పెప్పర్ ఫ్రై.. ఒక్కసారి ఇలా ట్రై చేస్తే టేస్ట్ అద్భుతం!

వంట రాని వాళ్లు కూడా నిమిషాల్లో చేసేయగల సూపర్ టేస్టీ పన్నీర్ భుర్జీ రెసిపీ!

థీమ్ పార్కుకు వెళుతున్నారా? జాగ్రత్త రోలర్ కోస్టర్ రైడ్స్‌తో మెదడుకు ప్రమాదం

పిల్లలు వద్దనుకోవడం స్వార్థమా? సమాజం చేసే విమర్శలకు సమాధానమిదే

భార్యా, తల్లా.. ఇద్దరి మధ్య నలిగిపోకుండా భర్త ఏం చేయాలి?

పిల్లల ఆరోగ్యంతో చెలగాటం వద్దు.. బేబీ ఫుడ్‌లో చక్కెరపై FSSAI కీలక ఆదేశాలు!

Big Stories

Advertisement
×