E-Paper
Advertisement

KCR: కేసీఆర్ ఇంటికి మంత్రులు సురేఖ, సీతక్క.. పసుపు, కుంకుమ, చీరలతో సత్కారం

KCR: కేసీఆర్ ఇంటికి మంత్రులు సురేఖ, సీతక్క.. పసుపు, కుంకుమ, చీరలతో సత్కారం
Advertisement

Sammakka Saralamma Jatara: తెలంగాణ రాజకీయాల్లో గురువారం ఒక ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. రాజకీయ వైషమ్యాలకు అతీతంగా, సంప్రదాయం, సంస్కృతికి పెద్దపీట వేస్తూ రాష్ట్ర మహిళా మంత్రులు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసానికి వెళ్లారు. రాష్ట్ర దేవదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) గురువారం ఎర్రవెల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ఖ్యాతిగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర ఈ నెల 28 నుంచి 31 వరకు వైభవంగా జరగనుంది. ఈ నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం తరఫున జాతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న మంత్రులు సురేఖ, సీతక్కలు.. ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న కేసీఆర్‌ను జాతరకు రావాల్సిందిగా కోరుతూ అధికారికంగా ఆహ్వానించారు. కేసీఆర్‌కు శాలువా కప్పి, ఆహ్వాన పత్రికను అందజేయడంతో పాటు, అమ్మవార్ల ప్రసాదాన్ని కూడా భక్తిపూర్వకంగా సమర్పించారు.

Advertisement

రాజకీయాల్లో ప్రత్యర్థులైనప్పటికీ, ఇంటికి వచ్చిన అతిథులను గౌరవించడంలో కేసీఆర్ తనదైన సంస్కారాన్ని చాటుకున్నారు. మంత్రులు ఇంటికి రాగానే “బాగున్నరా అమ్మ!” అంటూ కేసీఆర్ వారిని ఆత్మీయంగా పలకరించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి హోదాలో, ఒక ఇంటి పెద్దగా వారిని సాదరంగా లోపలికి ఆహ్వానించారు.

కేసీఆర్ సతీమణి శోభమ్మ కూడా మంత్రులను సాదరంగా ఆదరించారు. ఇంటికి వచ్చిన ఆడబిడ్డలను వట్టి చేతులతో పంపకూడదన్న తెలంగాణ సంప్రదాయాన్ని పాటిస్తూ.. మంత్రులు కొండా సురేఖ, సీతక్కలకు పసుపు, కుంకుమలు, చీర, తాంబూలం అందిించి ఘనంగా సత్కరించారు. కేసీఆర్ దంపతుల ఆతిథ్యం పట్ల మంత్రులు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన తేనీటి విందులో మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొద్దిసేపు వారి మధ్య పరస్పర యోగక్షేమాలు, ఇష్టాగోష్టి సంభాషణలు జరిగాయి.

Advertisement

అంతకుముందు, ఎర్రవెల్లిలోని నివాసానికి చేరుకున్న మహిళా మంత్రులకు మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ స్వాగతం పలికి లోపలికి తోడ్కొని వెళ్లారు. మేడారం జాతర వంటి రాష్ట్ర పండుగ సందర్భంలో అధికార, ప్రతిపక్షాల మధ్య ఇలాంటి సత్సంబంధాలు నెలకొనడం శుభపరిణామమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా సీతక్క ఈ జాతర విజయవంతానికి కృషి చేస్తున్నారు. జాతర ఏర్పాట్లలో భాగంగానే వారు మాజీ సీఎంను ఆహ్వానించినట్లు తెలిపారు.

Read Also:  రష్యా చమురు కొంటే అంతే.. భారత్ పై 500 శాతం సుంకాలు.. ఆంక్షల బిల్లుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్

Related News

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Big Stories

Advertisement
×