Dandruff Tips: చలికాలం వచ్చిందంటే చాలు చాలా మందికి చుండ్రు సమస్యలు వేధిస్తుంటాయి. ఇందుకు కారణం చల్లటి గాలులు కారణంగా చర్మం పొడిబారిపోతుంది. తద్వార చుండ్రు సమస్యలు వస్తుంటాయి. దీని కారణంగా దురద, మంటతో పాటు జుట్టుకూడా ఊడిపోతుంటుంది. ఇక చుండ్రును తొలగించేందుకు రకరకాల హెయిర్ ఆయిల్స్, షాంపులు వాడుతుంటారు. వీటివల్ల ఫలితం రాకపోగా జుట్టు రాలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన ఇంట్లోనే నాచురల్ పదార్ధాలతో హెయిర్ మాస్క్‌లు ట్రై చేశారంటే.. మంచి ఫలితం ఉంటుంది. జుట్టు ఆరోగ్యంగా కూడా ఉంటుంది. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పెరుగు, నిమ్మరసం హెయిర్ మాస్క్..
చుండ్రు సమస్యలు తొలగించేందుకు పెరుగు నిమ్మరసం బాగా ఉపయోగపడుతుంది. దీనికోసం ముందుగా ఒక బౌల్‌లో సరిపడినంత పెరుగు తీసుకుని అందులో మూడు, నాలుగు టేబుల్ స్పూన్ నిమ్మరసం కలపి జుట్టుకు అప్లై చేసి.. అరగంట తర్వాత గోరువెచ్చటి నీటితో.. సాధారణ షాంపూతో తలస్నానం చేయండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చుండ్రు తొలగిపోయి.. జుట్టు ఊడిపోకుండా ఉంటుంది.
బొప్పాయి, పెరుగు హెయిర్ మాస్క్..
చుండ్రును తొలగించేందుకు బొప్పాయి అద్బుతంగా పనిచేస్తుంది. దీనికోసం ఒక చిన్న గిన్నెలో ఐదు టేబుల్ స్పూన్ బొప్పాయి గుజ్జు తీసుకోవాలి. అందులో రెండు టేబుల్ స్పూన్ పెరుగు కలిపి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని తలకు, కుదుళ్లకు అప్లై చేయండి. ఆ తర్వాత తేలికపాటి షాంపుతో తలస్నానం చేయండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చుండ్రు సమస్యలు తొలగిపోతాయి.
కొబ్బరి నూనె, కర్పూరం హెయిర్ మాస్క్..
చుండ్రు సమస్యలను తొలగించేందుకు కొబ్బరినూనెతో పాటు పచ్చ కర్పూరం చక్కగా పనిచేస్తుంది. ఇందులో ఉండే పోషకాలు జుట్టుకు అందిస్తాయి. ఇందుకోసం ముందుగా కొబ్బరి నూనెను వేడి చేసి అందులో కర్పూరం వేసి కరగనివ్వాలి. చల్లారిన తర్వాత తలకు అప్లై చేయండి. గంట తర్వాత లేదా.. రాత్రి పడుకునే ముందు అప్లై చేసి ఉదయాన్నే తలస్నానం చెయ్యండి. ఇలా వారానికి ఒకసారి చేస్తే చుండ్రు సమస్యలు తొలగిపోతాయి. జుట్టు కూడా పొడవుగా.. సిల్కీగా ఉంటుంది.
Also Read: మేకప్ అవసరమే లేదు, ముఖానికి ఆవిరి పడితే చాలు.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్
అరటిపండు, ఆలవ్ ఆయిల్
అరటిపండు జుట్టును మెరిసేలా, తేమగా ఉండేలా చూస్తుంది. ఆలివ్ నూనె జుట్టు పొడిబారకుండా ఉండేలా చేస్తుంది. ఇందుకోసం ముందుగా బాగా పండిన అరటిపండు గుజ్జును తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ కలిపి జుట్టుకు అప్లై చేయండి. అరగంట తర్వాత సాధారణ షాంపూతో తలస్నానం చెయ్యండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చుండ్రు సమస్యలు తొలగిపోవడంతో పాటు.. జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.
అలోవెరా, టీ ట్రీ ఆయిల్..
కలబందలో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. టీ ట్రీ ఆయిల్ ఫంగస్‌లను నిరోధించే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ రెండింటిని ఉపయోగిస్తే చలి కాలంలో వచ్చే చుండ్రు సమస్యలను దూరం చేస్తాయి. ఇందు కోసం కలబంద గుజ్జులో రెండు చుక్కలు టీ ట్రీ ఈయిల్ కలపి జుట్టుకు అప్లై చేయండి. అరగంట తర్వాత తలస్నానం చెయ్యండి. మంచి ఫలితం ఉంటుంది.