BigTV English

OTT Movie : కంటికి కన్పించని శక్తి కవ్వింపు… సింగిల్ గా ఉంటే వదలకుండా అదే పని… ఒక్కో సీన్ కు వణిపోవాల్సిందే మావా

OTT Movie : కంటికి కన్పించని శక్తి కవ్వింపు… సింగిల్ గా ఉంటే వదలకుండా అదే పని… ఒక్కో సీన్ కు వణిపోవాల్సిందే మావా

OTT Movie : దెయ్యాల సినిమాలను థియేటర్లలో కంటే, ఓటీటీలో తెగ చూసేస్తున్నారు మూవీ లవర్స్. ఈ సినిమాలను చూస్తున్నప్పుడు వచ్చే కిక్ మాటల్లో చెప్పలేము. భయపెడుతూ ఇవి ఇచ్చే ఎంటర్టైన్మెంట్ మరో లెవెల్ అనే చెప్పుకోవాలి. అయితే ఈ కిక్ సినిమాలను బట్టి మారుతుంటుంది. కొన్ని కామెడీ జానర్లో ఎంటర్టైన్ చేస్తే, మరికొన్ని వెన్నులో వణుకు పుట్టించే హారర్ కంటెంట్ తో ఎంటర్టైన్ చేస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఒక బ్రిటిష్ హారర్ థ్రిల్లర్ సినిమా ఆడియన్స్ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఈ కథ సూడాన్ నుంచి బ్రిటన్ కి వచ్చిన ఒక వలస ఫ్యామిలీ చుట్టూ తిరుగుతుంది. వీళ్ళు ఒక పాడుబడిన ఇంట్లో స్టే చేయడంతో అసలు స్టోరీ మొదలవుతుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..


నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

‘హిస్ హౌస్’ 2020లో వచ్చిన బ్రిటిష్ హారర్ థ్రిల్లర్ సినిమా. ఈ సినిమాకి రెమీ వీక్స్ దర్శకత్వం వహించాడు. ఇందులో సోపే డిరిసు (బోల్), వున్మి మోసాకు (రియాల్), మ్యాట్ స్మిత్ (మార్క్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2020న అక్టోబర్ 30న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయింది. 1 గంట 33 నిమిషాల రన్‌ టైమ్ తో, IMDbలో 7.0/10 రేటింగ్ పొందింది.

కథలోకి వెళ్తే

బోల్, రియాల్ సౌత్ సుడాన్ నుంచి బ్రిటన్‌కి వలస వస్తారు. వాళ్ళ దేశంలో యుద్ధం జరుగుతుండటంతో ఒక బోట్‌లో పారిపోతారు. కానీ వాళ్ళ కూతురు న్యాగక్ బోట్ జర్నీలో చనిపోతుంది. బ్రిటన్‌లో వాళ్ళకి వలసదారుల గుర్తింపును ఇస్తారు. అధికారులు ఒక పాత డర్టీ హౌస్‌లో వీళ్ళను స్టే చేయమంటారు. ఇక బోల్, రియాల్ కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలని ట్రై చేస్తారు. బోల్ బ్రిటిష్ కల్చర్‌లో ఫిట్ అవ్వాలని అనుకుంటాడు. రియాల్ ఇంకా సుడాన్ మెమరీస్‌తో బాధపడుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు హౌస్‌లో వీరియర్డ్ థింగ్స్ స్టార్ట్ అవుతాయి. అక్కడ ఉండే గోడల్లో నుంచి సౌండ్స్ వస్తాయి. నీడలు భయంకరంగా తిరుగుతుంటాయి. రియాల్ ఇది ఒక నైట్ విచ్ అని అనుమానిస్తుంది. ఈ కథ ఇప్పుడు హారర్ వైబ్‌తో స్టార్ట్ అవుతుంది.


ఈ హౌస్‌లో స్కేరీ థింగ్స్ ఎక్కువ అవుతాయి. రాత్రుల్లో బోల్, రియాల్‌కి డర్టీ డ్రీమ్స్ వస్తాయి. బోల్ ఇవన్నీ మనసులో భ్రమలు అని అనుకుంటాడు. బ్రిటన్‌లో సెటిల్ అవ్వడానికి ట్రై చేస్తాడు. కానీ రియాల్ హౌస్‌ని లీవ్ చేయాలని చెబుతుంది. ఎందుకంటే అక్కడ దెయ్యం వాళ్ళను హాన్ట్ చేస్తోందని ఫీల్ అవుతుంది. హౌసింగ్ ఆఫీసర్ మార్క్ వాళ్ళను వాచ్ చేస్తుంటాడు. రూల్స్ ఫాలో అవ్వాలని, ఇంటిని ఖాళీ చేస్తే గుర్తింపు క్యాన్సిల్ అవుతుందని చెప్తాడు.

కథ నడుస్తున్న సమయంలో ఒక షాకింగ్ ట్విస్ట్ బయట పడుతుంది. బోల్, రియాల్ గతంలో సుడాన్‌ నుంచి వచ్చేటప్పుడు న్యాగక్‌ని కిడ్నాప్ చేసి, తమ వెంట తెస్తుంటారు. నిజానికి ఆమె వాళ్ళ కూతురు కాదు. బోట్ నుంచి ఎస్కేప్‌ అవ్వడానికి, తమకి ఒక చిన్న కూతురు ఉందని అక్కడి వాళ్ళకి చెప్తారు. అయితే అనుకోకుండా ఆమె చనిపోతుంది. దీంతో ఆమె దెయ్యంగా మారి వాళ్ళను హాన్ట్ చేస్తోందని అనుకుంటారు. ఇక క్లైమాక్స్ గుండె జలదరించే సన్నివేశాలతో ముగుస్తుంది. బోల్, రియాల్ ఇంట్లో సౌండ్స్ ఎందుకు వస్తున్నాయి ? న్యాగక్ వీళ్ళను వెంటాడుతోందా ? వీళ్ళు బ్రిటన్ లో కొత్త జీవితం స్టార్ట్ చేయగలుగుతారా ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Read Also : నాలుగడుగుల అంకుల్ తో ఆరడుగుల ఆంటీ డేటింగ్ …. వద్దంటూనే వదలకుండా ఆ పని … క్లైమాక్స్ వరకు అరుపులే

Related News

OTT Movie : డైవింగ్ కు వెళ్లి దిక్కుమాలిన చావు… ఒళ్ళు జలదరించే సీన్స్ ఉన్న సర్వైవల్ థ్రిల్లర్

OTT Movie : అలాంటి అమ్మాయిలను చూసి సొల్లుకార్చే ఆటగాడు… చివరికి లడ్డూలాంటి పాపతో ఆ పని… క్లైమాక్స్ ట్విస్ట్ అదుర్స్

OTT Movie : పెళ్లి కోసం అల్లాడే సాఫ్ట్వేర్… చక్కిలిగింతలు పెట్టే కన్నడ కామెడీ మూవీ

OTT Movie : భర్తపై అనుమానంతో భార్య అరాచకం… మంత్రి కూతురా మజాకా ? మస్ట్ వాచ్ మలయాళ మూవీ

OTT Movie : ట్రాన్స్ జెండర్ పై మోహం… ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే ఆపరు భయ్యా

OTT Movie : అర్దరాత్రి అపార్ట్మెంట్లో వింత సౌండ్స్… డోర్ తీస్తే గుండె జారిపోయే సీన్లు… ఈ హర్రర్ మూవీ అరాచకం సామీ

OTT Movie : 86 మంది సజీవ దహనం, 1.5 లక్షల ఎకరాలు ధ్వంసం… వణికించే ట్రూ వైల్డ్ ఫైర్ సర్వైవల్ డ్రామా

Big Stories

×