Assad Syria Rebels | ఇజ్రాయెల్ పొరుగు దేశం సిరియాలో ప్రభుత్వం ప్రమాదంలో పడింది. అధ్యక్షుడు బషర్ అల్ అస్సద్ సైన్యంపై ఆ దేశంలోని ఇస్లామిస్ట్ రెబెల్స్ పైచేయి సాధించారు. గత రెండు రోజులుగా క్రమంగా దేశంలోని ప్రధాన నగరమైన అలెప్పోని రెబెల్స్ ఆక్రమించుకున్నారని సమాచారం. రష్యా, ఇరాన్ దేశాల మద్దతు కలిగిన సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అస్సద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత నాలుగేళ్లుగా ఇస్లామిస్ట్ గ్రూప్ హయత్ తహ్రీర్ అల్ షామ్ (హెటిఎస్) మధ్య సాయుధ పోరాటం చేస్తున్నారు.
అయితే ఇటీవల ఈ హెటిఎస్ ఇస్లామిస్ట్ మిలిటెంట్ గ్రూప్ అనూహ్యంగా సిరియా సైన్యాన్ని ఇద్లిబ్ ప్రాంతంలో చిత్తుగా ఓడిస్తూ.. 50 పట్టణాలు, గ్రామాలను ఆక్రమించుకున్నారు. ఈ క్రమంలో తాజాగా పారిశ్రామిక నగరమైన అలెప్పోలో సగానికి పైగా ప్రాంతాలను కైవసం చేసుకున్నారు.
Also Read: ఇండియా సహా అన్ని బ్రిక్స్ దేశాలపై వంద శాతం పన్ను.. ట్రంప్ బెదిరింపులు
స్థానిక మీడియా కథనాల ప్రకారం.. హెటిఎస్ రెబెల్స్ అలెప్పో నగరంలో దూసుకురావడంతో వారిని ఎదుర్కోకోకుండా సిరియా సైన్యం వెనక్కు తగ్గింది. దీంతో పెద్దగా పోరాడకుండానే హెటిఎస్ రెబెల్స్ అలెప్పో నగరానని స్వాధీనం చేసుకున్నారు. సిరియా పొరుగు దేశం లెబనాన్ లో హిజ్బుల్లా, ఇజ్రాయెల్ మధ్య భీకరమైన యుద్దం జరుగుతుండడంతో సిరియా సైన్యానికి ఇరాన్ నుంచి సమయానికి సైనిక, ఆయుధ సాయం అందలేదని సమాచారం. అలెప్పో నగరాన్ని హెటిఎస్ రెబెల్స్ స్వాధీనం చేసుకోవడంతో ప్రస్తుతం అధ్యక్షుడు బషర్ అల్ అసద్ ప్రభుత్వానికి ప్రమాద ఘంటికలు మోగుతున్నట్లేనని జియోపాలిటిక్స్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
గతకొంతకాలంగా ఇస్లామిస్ట్ రెబెల్స్, సిరియా సైన్యం మధ్య జరుగుతున్న యుద్ధంలో రెబెల్స్ స్థావరాలపై సిరియా సైన్యం రష్యా క్షిపణులు ప్రయోగించింది. ఈ దాడుల్లో దాదాపు 280 మంది పౌరులు కూడా చనిపోయారని సమాచారం. ఈ హెటిఎస్ ఇస్లామిస్ట్ గ్రూప్ కు అమెరికా, ఇజ్రాయెల్ దేశాల నుంచి మద్దతు లభిస్తోందని ఇరాన్ ఆరోపణలు చేస్తోంది.
సిరియా దేశంలో 2011 నుంచి అంతర్యుద్ధం జరుగుతోంది. దీంతో దేశం పలు జోన్లుగా విడిపోయింది. ఈ వేర్వేరు జోన్లలో వివిధ ఫ్యాక్షన్ గ్రూపులు రాజ్యమేలుతున్నాయి. ముఖ్యంగా 60 శాతం భూభాగం అధ్యక్షుడు బషర్ అస్సద్ ప్రభుత్వం ఆధీనంలో ఉండగా.. కీలక ఇద్లిబ్, అలెప్పో నగరాలలో ప్రతిపక్ష పార్టీల నాయకుల చేతిలో ఉన్నాయి. ఆ సమయంలో పొరుగు దేశం టర్కీ కూడా రెబెల్స్ కు మద్దతు చేసింది. దీంతో 2011లో బషర్ ల్ అస్సద్ రెబెల్స్ ని ఎదుర్కోవడానికి ఇబ్బందులు పడ్డారు. కానీ రష్యా, ఇరాన్ నుంచి సమయానిక సాయం అందడంతో రెబెల్స్ ని విజయవంతంగా నియంత్రించారు.
గత రెండు నెలలుగా సిరియా సైన్యానికి ఆయుధాలు సరఫరా చేస్తన్న హిజ్బుల్లా మిలిటెంట్లపై ఇజ్రాయెల్ దాడి చేయడంతో సరఫరా ఆగిపోయింది. లెబనాన్ లో ఇజ్రాయెల్ బలగాల దెబ్బకు హిజ్బుల్లాకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో సిరియా సైన్యానికి తగిన సమయంలో సాయం అందలేదు. పైగా అదే సమయంలో హెబిఎస్ రెబెల్స్ వద్ద భారీగా ఆయుధాలు వచ్చాయి. దీంత రెబెల్స్ అలెప్పొ నగరాన్ని సాధించుకున్నారు. అలెప్పో ఎయిర్ పోర్ట్, మరాత్ అల్ నుమాన్ ఇద్లిబ్ నగరాన్ని రెబెల్స్ ఆక్రమించుకున్నారు.
ప్రస్తుతం సిరియా సైన్యం బలహీనంగా ఉండడంతో పరిస్థితి గురించి అధ్యక్షుడు బషర్ అల్ అస్సద్.. రష్యాకు సమాచారం చేరవేసి సాయం అడిగారు. దీంతో రష్యా నుంచి మరో 72 గంటల్లో సైనిక బలగాలు సిరియాకు చేరుకుంటాయని తెలుస్తోంది.
ఈ ప్రమాదకర పరిస్థితుల్లో బషర్ అల్ అస్సద్ ప్రభుత్వం ఎంత కాలం గడుస్తుందో చెప్పలేని పరిస్థితి.