Trump BRICS Tariff| ఇండియా, రష్యా, చైనా, ఇరాన్ సహా అన్ని బ్రిక్స్ దేశాలకు అమెరికా తదుపరి అధ్యక్సుడు డొనాల్డ్ ట్రంప్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఆయన జనవరి 2025లో అధ్యక్ష పదవి చేపట్టగానే అన్ని బ్రిక్స్ దేశాలపై వంద శాతం పన్నులు వేస్తానని చె్పారు. ప్రపపంచ దేశాల మధ్య వ్యాపార లావాదేవీలకు ఉపయోగించే అమెరికా డాలర్ కు బదులుగా బ్రిక్స్ దేశాలు మరో కరెన్సీని తీసుకువస్తే.. అన్ని దేశాలపై ఆంక్షలు, వంద శాతం పన్నులు మోపుతానని ట్రంప్ బెదిరించారు.
అక్టోబర్ 2024లో రష్యాలోని కజకస్తాన్ ప్రాంతంలో బ్రిక్స్ దేశాల సదస్సు జరిగింది. అన్ని దేశాలు డాలర్ కు బదులుగా అంతర్జాతీయ వాణిజ్య కోసం మరో కొత్త కరెన్సీ లేదా ఆయ దేశాల కరెన్సీలోనే లావాదేవీలు చేయాలని చర్చలు జరిపారు. బ్రిక్స్ సమూహంలో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణ ఆఫ్రికా, ఈజిప్ట్, ఇరాన్, యుఎఇ తదితర దేశాలున్నాయి. ఈ దేశాలు తమ ప్రయత్నాలు మానుకోకపోతే వారితో అమెరికా వ్యాపార సంబంధాలు తెంచేసుకుంటుందని ట్రంప్ హెచ్చరించారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఆయన ఒక పోస్ట్ చేశారు. బ్రిక్స్ దేశాలు డాలర్‌ని కాదని వెళితే తాను చూస్తూ ఊరుకోనని ఆ పోస్ట్ లో రాశారు.
Also Read: 3 నెలల్లో 35 లక్షలు సంపాదించిన పెళ్లికూతరు.. ఏజెన్సీతో కలిసి మోసం చేయడమే పని
“ఈ బ్రిక్స్ దేశాలు అమెరికా డాలర్‌ను కాదని వెళుతుంటే మేము నిలబడి చూస్తూ ఊరుకునే రోజులు పోయాయి. ఈ దేశాలు డాలర్ లోనే వ్యాపారం చేస్తాయని మాకు కమిట్‌మింట్ ఇవ్వాలి. వారంతా కొత్త బ్రిక్స్ కరెన్సీ క్రియేట్ చేయడం లేదని మాకు హామీ ఇవ్వాలి. వీరంతా డాలర్ కాకుండా మరే ఇతర దేశాల కరెన్సీని డాలర్ కు బదులు ఉపయోగించకూడు. అలా చేయకపోతే ఈ బ్రిక్స్ దేశాలన్నీ 100 శాతం పన్నులు చెల్లించాల్సి వస్తుంది. అంతేకాదు అమెరికా ఆర్థిక వ్యవస్థ నుంచి లాభాలు పొందే మార్గాలన్నీ వారికి మూసుకుపోతాయి.
ఈ దేశాలన్నీ వెళ్లి అమెరికాకు ప్రత్యామ్న దేశాన్ని వెతుక్కోలేరు. అని నేను ఛాలెంజ్ చేస్తున్నా. వాళ్లందరికీ అంతర్జాతీయ వ్యాపారాల కోసం డాలర్ స్థానంలో మరే ఇతర స్థిరమైన కరెన్సీ లభించదు. అమెరికాకు గుడ్ బై చెబితే ఆ స్థానంలో అమెరికా స్థానంలో అలాంటి దేశం వీళ్లకు లభిస్తుందా?” అని ట్రంప్ ఘాటుగా రాశారు.
డాలర్‌కు వ్యతిరేకంగా బ్రిక్స్
గత అక్టోబర్‌లో జరిగిన బ్రిక్స్ దేశాల సదస్సులో యుఎఇ, ఇరాన్, ఈజిప్ట్ లాంటి దేశాలు డాలర్ కు బదులుగా తమ లోకల్ కరెన్సీలలో వ్యాపారం చేసేందుకు అంగీకరించాయి. బ్రిక్స్ క్రాస్ బార్డర్ పేమెంట్స్ పేరుతో ఈ దేశాలన్నీ ఒక బ్యాంకింగ్ నెట్‌వర్కని స్థాపించి లోకల్ కరెన్సీలలో వాణిజ్యం కొనసాగిస్తాయని ఒక ప్రకటన జారీ చేశాయి.
అయితే బ్రిక్స్ దేశాల వద్ద అంతర్జాతీయ లావాదేవీల కోసం స్విఫ్ట్ ఫైనాన్షియల్ సిస్టమ్‌కు ప్రత్యామ్నంగా మరొక సిస్టమ్ అభివృద్ధి చెందలేదని రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలిపారు. భారతదేశం కూడా డాలర్ కు తాము పూర్తిగా వ్యతిరేకం కాదని తెలిపింది. అక్టోబర్ లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడుతూ. ఇండియా డాలర్ కు వ్యతిరేకం కాదు. కానీ కొన్ని దేశాలు డాలర్ వినియోగాన్ని వ్యతిరేకిస్తే.. ఆ దేశాలతో లావాదేవీల కోసం ప్రత్యామ్న మార్గాలు అన్వేషిస్తున్నాం అని అన్నారు.
ఇండియాపై ఎక్కువ పన్నులు వేస్తానన్న ట్రంప్
2025లో ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన తరువాత అమెరికా ఎగుమతులపై ఎక్కువ శాతం పన్ను విధించే బ్రెజిల్, చైనా, ఇండియా దేశాలపై తాను కూడా ఇకమై అధిక పన్నులు వేస్తానని హెచ్చరించారు. ఇలా చేయడం తప్పనిసరిగా మారిపోయిందని అమెరికా ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఇది అత్యవసరమని ఆయన ఎన్నికల ప్రచారంలో చెప్పారు. ముఖ్యంగా అమెరికా ఎగుమతులపై అత్యధికంగా ఇండియా పన్నులు వేస్తోందని అందువల్ల తాను కూడా ఇండియాపైనే ఎక్కువ పన్నులు వేస్తానని చెప్పాడు. మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చాలా గొప్ప వ్యక్తి అని ప్రశంసించారు.