E-Paper
Advertisement

Home Remedies For White Hair: ఇది ఒక్క సారి వాడితే.. జన్మలో తెల్ల జుట్టు రాదు

Home Remedies For White Hair: ఇది ఒక్క సారి వాడితే.. జన్మలో తెల్ల జుట్టు రాదు
Advertisement

Home Remedies For White Hair: ప్రస్తుతం తెల్ల జుట్టు సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. చిన్న వయస్సులోనే తెల్ల జుట్టు రావడం ప్రస్తుతం కామన్ అయిపోయింది. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. ఇలాంటి సమయంలో చాలా మంది రకరకాల హెయిర్ కలర్స్ వాడటంతో పాటు హోం రెమెడీస్ ట్రై చేస్తుంటారు. హెయిర్ కలర్స్ వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే హోం రెమెడీస్ వాడటం మంచిది ఇవి జుట్టుకు అనేక రకాలుగా మేలు చేస్తాయి. అంతే కాకుండా తెల్ల జుట్టును కూడా నల్లగా మారుస్తాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఉసిరి -సహజ రంగు బూస్టర్: ఉసిరిలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు జుట్టును లోపలి నుంచి పోషిస్తాయి. కొబ్బరి నూనెలో ఉసిరి పొడిని మరిగించి, చల్చార్చి,
రాత్రంతా తలకు పట్టించండి. ఇది మీ జుట్టును బలంగా, నల్లగా కనిపించేలా చేస్తుంది. అంతే కాకుండా జుట్టు సంబంధిత సమస్యలు కూడా రాకుండా చేస్తుంది. తరచుగా దీనిని వాడటం వల్ల కూడా జుట్టు సహజంగానే నల్లగా మారుతుంది. దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.

Advertisement

హోం రెమెడీస్:
మెంతి గింజలు, ఆమ్లా పేస్ట్: రాత్రంతా నానబెట్టిన మెంతి గింజలను మెత్తగా రుబ్బి, అందులో కాస్త ఉసిరి పౌడర్ కలపండి. ఈ పేస్ట్‌ను జుట్టుకు 30 నిమిషాలు అప్లై చేసి.. తర్వాత శుభ్రం చేసుకోండి. ఇలా తరచుగా చేయడం వల్ల జుట్టుకు అవసరం అయిన పోషణ కూడా లభిస్తుంది. అంతే కాకుండా ఉసిరి జుట్టును నల్లగా మార్చడంలో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది.

కరివేపాకు, కొబ్బరి నూనె:
కరివేపాకులో బీటా-కెరోటిన్, ఐరన్ వంటివి ఉంటాయి. ఇవి మెలనిన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. కొబ్బరి నూనెలో కరివేపాకులను మరిగించి, చల్చార్చి, వారానికి రెండుసార్లు అప్లై చేయండి. కరివేపాకులో ఉండే గుణాలు జుట్టును సహజంగా నల్లగా మార్చడంలో కూడా ఉపయోగపడతాయి. అంతే కాకుండా జుట్టు రాలడాన్ని కూడా చాలా వరకు తగ్గిస్తాయి.

Advertisement

ఇంట్లోనే సహజమైన హెయిర్ కలర్ తయారీ:
హెన్నా , కాఫీ పౌడర్ : రెండు కప్పుల హెన్నా పౌడర్‌ను ఒక కప్పు స్టీప్డ్ కాఫీ పౌడర్, ఒక టీస్పూన్ నిమ్మరసం, ఒక టీస్పూన్ కొబ్బరి నూనెతో కలపండి. ఈ పేస్ట్‌ను కవర్ చేసి రెండు గంటల పాటు అలాగే ఉంచి తర్వాత మీ జుట్టుకు అప్లై చేయండి. మూడు గంటల తర్వాత కడిగేస్తే మీ జుట్టు అందమైననలుపు రంగును పొందుతుంది.

ఇండిగో కలర్: మీరు ముదురు నలుపు రంగును కోరుకుంటే.. హెన్నా వేసిన మరుసటి రోజు ఇండిగో పౌడర్‌ను ఉపయోగించండి. ఇది మీ జుట్టుకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా 100% సహజమైన నల్లని రంగను అందిస్తుంది.

బ్లాక్ టీ లేదా కాఫీ: మూడు టీస్పూన్ల టీ పౌడర్ లో లేదా కాఫీ పౌడర్‌ని రెండు కప్పుల నీటిలో మరిగించి, చల్లబరచడానికి జుట్టుకు అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోండి. ఇది మీ జుట్టుకు మంచి రంగును, ప్రకాశవంతమైన మెరుపును ఇస్తుంది.

Also Read: కిడ్నీ డిటాక్స్ కోసం.. ఈ డ్రింక్స్ తాగాల్సిందే

ఇవే కాకుండా చిన్న వయస్సులోనే వచ్చే తెల్ల జుట్టు సమస్య సాధారణం కాదు. కానీ ఇది ఖచ్చితంగా లైఫ్ స్టైల్, ఆరోగ్యానికి సంకేతం. సరైన ఆహారం, క్రమం తప్పకుండా నిద్ర, ఒత్తిడి లేని జీవితంతో పాటు హోం రెమెడీస్ వల్ల ఈ సమస్యను చాలా వరకు నివారించవచ్చు. మీరు మార్కెట్ లో దొరికే హెయిర్ కలర్స్ వాడాలనుకుంటే తప్పకుండా ఉసిరి, కరివేపాకు, హెన్నా, ఇండిగోతో తయారు చేసిన సహజ రంగులను ఉపయోగించడానికి ప్రయత్నించండి. ఇవి మీ జుట్టును అందంగా మార్చడమే కాకుండా లోపలి నుంచి బలోపేతం చేస్తాయి.

Related News

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

ఐలైనర్ సరిగ్గా రావడం లేదా? పర్ఫెక్ట్ లుక్ కోసం ఈజీ మేకప్ ట్రిక్స్‌ ఇవిగో

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

భోజనం చేసినా, ఏదైనా తాగినా వెంటనే లిప్‌స్టిక్ పాడవుతోందా? రోజంతా పెదాలు కలర్‌ఫుల్‌గా ఉండేందుకు చిట్కాలు

Big Stories

Advertisement
×