E-Paper
Advertisement

Naa Anveshana : హైదరాబాద్ కు నా అన్వేష్..? పోలీసులు ఏం చెప్తున్నారంటే..?

Naa Anveshana : హైదరాబాద్ కు నా అన్వేష్..? పోలీసులు ఏం చెప్తున్నారంటే..?
Advertisement

Naa Anveshana : ప్రముఖ యూట్యూబ్ నా అన్వేషణ అన్వేష్ కు రోజురోజుకీ వ్యతిరేకత ఎక్కువవుతుంది. మహిళలు స్వేచ్ఛ గురించి మాట్లాడుతూ హిందూ దేవుళ్లను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశాడు. ఆయన వ్యాఖ్యలపై హిందూ సంఘాల సభ్యులు మండిపడుతూ పలు ప్రాంతాల్లో పోలీస్ కేసులు నమోదు చేశారు.. ఒకవైపు ఆయన వీడియోలకు విమర్శలు ఎదురవుతున్న సరే అతను మాత్రం అవేమీ పట్టించుకోకుండా తాను ఏది చెప్పాలనుకున్నాడో అది చెప్తూ వరుసగా వీడియోలను వదులుతున్నాడు. కొందరు యూట్యూబర్లు కూడా నా అన్వేష్ కి వ్యతిరేకంగా వీడియోలను పోస్ట్ చేస్తున్నారు.. మొత్తానికి నా అన్వేష్ మోస్ట్ వాంటెడ్ అయ్యాడు.. అతనిపై వరుసగా కేసులు నమోదు అవుతున్న వేళ అతని ఇంస్టాగ్రామ్ కు పంజాగుట్ట పోలీసులు లేఖ రాసినట్లు తెలుస్తుంది. దానికి రిప్లై వస్తే చర్యలు తీసుకోవడం పక్కా అని సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తుంది.. ఇప్పుడు మరో వార్త సంచలనంగా మారింది.. హైదరాబాద్ కు నా అన్వేష్ వస్తున్నాడుంటూ వార్తలు గుప్పుమన్నాయి. అందులో నిజమేంత ఉంది? పోలీసులు ఏమంటున్నారో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

హైదరాబాద్ కు యూట్యూబర్ అన్వేష్..?

యూట్యూబర్ అన్వేష్ వీడియోల పై జనాలు తీవ్ర అసంతృప్తి చెందుతున్నారు. ఒకవైపు అతని వ్యాఖ్యలు వివాదంగా మారిన కూడా అతను ఏ మాత్రం తగ్గలేదు. ఒకప్పుడు ట్రావెల్ వీడియోలతో లక్షలాది మంది ఫాలోవర్లను సంపాదించుకున్న అన్వేష్, ఇప్పుడు అదే స్థాయిలో వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాడు. హిందు దేవుళ్ళ పై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి.. బీజేపీ నాయకురాలు, సినీ నటి కరాటే కళ్యాణి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు పలు సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు.. అన్వేష్ కేసులో పంజాగుట్ట పోలీసులు దూకుడు పెంచారు. ఇందులో భాగంగా ‘ఆపరేషన్ అన్వేష్’ పేరుతో విచారణ వేగవంతం చేశారు.. అన్వేష్ వినియోగిస్తున్న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, ఐడీ హిస్టరీని అందజేయాలని కోరుతూ మెటా సంస్థకు పోలీసులు అధికారికంగా లేఖ రాశారు.. దాని గురించి పూర్తి వివరాలు గనక వస్తే అతను హైదరాబాద్ కు నా అన్వేష్ ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. మరి దీనిపై పోలీసులు ఏమంటున్నారంటే..

Advertisement

Also Read :భూషణ్ కు సారీ చెప్పిన మహా.. కన్నీళ్లు పెట్టుకున్న మహా.. పెళ్లి ఆగిపోతుందా..?

బిగ్ టీవీ తో మాట్లాడిన పంజాగుట్ట సీఐ.. 

నా అన్వేష్ పై నమోదైన కేసుల గురించి రోజుకో వార్త బయటకు వస్తుంది. పంజాగుట్ట పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనేది ఆసక్తిగా మారుతుంది. ఈ కేసు గురించి మా బిగ్ టీవీ ప్రతినిధి పంజాగుట్ట పోలీసులతో మాట్లాడారు. అంతేకాదు పంజాగుట్ట సీఐ రామకృష్ణ ఈ కేసు గురించి కీలక విషయాలను బిగ్ టీవీ తో పంచుకున్నారు.. ఆయన మాట్లాడుతూ.. ఆయనపై ఇప్పటివరకు నమోదు అయిన కేసుల గురించి సీఐ రామకృష్ణ వివరించారు. కంప్లైంట్ వచ్చిన తర్వాత ఎక్కడైతే ఆయన వీడియోలను పోస్ట్ చేశాడు ఇంస్టాగ్రామ్ ఫేస్బుక్ లకు పోలీసులు లేఖ రాసినట్లు తెలిపారు. వాటి నుంచి వెంటనే రిప్లై వస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో నా అన్వేష్ హైదరాబాద్ కు వస్తాడా..? లేదంటే విదేశాల్లోనే ఉంటాడా..? పోలీసులు అరెస్ట్ చేస్తే ఎన్ని రోజులు రిమాండ్ లో ఉంచుతారు? నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది మరి కొద్ది రోజుల్లో తెలిసే అవకాశాలు ఉన్నాయి..

Advertisement

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×