Examthon Run For Dreams: కావేరి విశ్వవిద్యాలయం కాలేజీ మెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో ఎగ్జామ్‌థాన్ – రన్ ఫర్ డ్రీమ్స్ అనే పేరుతో.. జనవరి 4న గచ్చిబౌలి స్టేడియంలో 3, 5, 10 కిలోమీటర్ల విభాగంలో ఈ పరుగు చేపట్టంది. ఈ సందర్భంగా పరుగులకు సంబంధించి లోగో టీ షర్టును బహీరాబాగ్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డా.వి ప్రవీణ్ రావ్, కాలేజీ మెంటర్ చైర్మన్ రాజశేఖర్ రెడ్డి ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ రన్‌ను పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో కలిసి, ఐటీశాఖా మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభిస్తారని వెల్లడించారు.
పరీక్షలకు సంబంధించిన విద్యార్ధుల ఒత్తిడిని తగ్గించడం , దృష్టిసారించి, సామాజిక ఉద్యమం చేపట్టినట్లు విశ్వవిద్యాలయం ఛాన్సలర్ తెలిపారు. దాదాపు 80 నుంచి 90 శాతం భారతీయ విద్యార్ధులు పరీక్షా సంబంధిత ఒత్తిడిని ఎదుర్కుంటున్నారని చెప్పారు. విద్యార్ధుల బాధ, డ్రాప్ఔట్‌లకు విద్య ఇది ప్రధానకారణమన్నారు. ఇలాంటి సమయంలో విద్యార్ధులకు పరీక్షా దశలలో సమిష్టి భరోసా, ఒత్తిడి లేని అభ్యాసం ప్రాముఖ్యతను ఇచ్చేందుకు ఈ పరుగును నిర్వహిస్తున్నామని తెలిపారు.
మేము మీతో ఉన్నాం(We are with you) అనే నినాదంతో ఈ పరుగు పందెం సాగనుండటం విశేషం. మారాథాన్‌ను మూడు విభాగాల్లో నిర్వహించనున్నారు. 3 కిలోమీటర్ల ఫన్ లేదా టైమ్డ్ రన్, 5 కిలోమీటర్ల టైమ్డ్ రన్, 10 కిలోమీటర్ల టైమ్డ్ రన్ విభాగాల్లో పోటీలు జరుగుతాయి. విద్యార్థులతో పాటు ఉద్యోగులు, క్రీడాకారులు, ఫిట్‌నెస్‌పై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఈ ఈవెంట్‌లో పాల్గొనవచ్చని నిర్వాహకులు తెలిపారు.
ఈ ఈవెంట్‌కు పాల్గొన్న విజేతలకు భారీ ప్రైజ్ మనీ దగ్గనుంది. మొత్తం రూ.10 లక్షల నగదు బహుమతులను వివిధ విభాగాల్లో గెలుపొందిన వారికి అందజేయనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ ప్రైజ్ మనీతో పాటు, విజేతలకు ప్రత్యేక గుర్తింపు సర్టిఫికెట్లు కూడా అందజేయనున్నారు.
కేవలం విజేతలకే కాకుండా, ఈ మారాథాన్‌లో పాల్గొనే ప్రతి ఒక్కరికీ ప్రోత్సాహకాలు అందించనుంది. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఈ-సర్టిఫికేట్, రిఫ్రెష్‌మెంట్స్, ప్రత్యేకంగా డిజైన్ చేసిన టీ-షర్ట్, మెడల్, గూడీ బ్యాగ్ వంటి బహుమతులు అందజేయనున్నారు.
ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. రన్ జరుగుతున్న మార్గంలో పూర్తి భద్రతా చర్యలు, వైద్య సదుపాయాలు, ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ ఎగ్జామ్‌థాన్ రన్‌లో పాల్గొనాలనుకునే వారు మరిన్ని వివరాల కోసం.. www.examthon.com వెబ్‌సైట్‌ను సందర్శించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు. ఈ ఈవెంట్‌కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లైతే 9281416210 హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించవచ్చని తెలిపారు.
Also Read: డిజిటల్ అరెస్ట్ పేరుతో వృద్ధుడికి టోకరా.. ఏకంగా రూ.7 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
కొత్త ఏడాది ఆరంభంలో ఆరోగ్యం, చదువు పట్ల అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో.. ఈ మారాథాన్‌ను నిర్వహిస్తున్నామని, విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాలేజ్ మెంటర్, కావేరి యూనివర్సిటీ నిర్వాహకులు కోరారు. గచ్చిబౌలిలో జరగనున్న ఈ ఎగ్జామ్‌థాన్ – రన్ ఫర్ డ్రీమ్స్, యువతకు ఒక స్ఫూర్తిదాయక అనుభవంగా నిలవనుందని వారు చెబుతున్నారు.
రిజిస్ట్రేషన్: www.examthon.com