E-Paper
Advertisement

వర్కవుట్ తర్వాత అలసటగా ఉందా? తక్షణ శక్తినిచ్చే పోస్ట్ వర్కవుట్ మీల్స్ ఇవే!

వర్కవుట్ తర్వాత అలసటగా ఉందా? తక్షణ శక్తినిచ్చే పోస్ట్ వర్కవుట్ మీల్స్ ఇవే!
Advertisement

Post workout food: ప్రస్తుతం శారీరక దృఢత్వం కోసం జిమ్‌కు వెళ్లడం కామన్ అయిపోయింది. అయితే.. కేవలం గంటల తరబడి చెమట చిందించడం వల్ల మాత్రమే ఆశించిన ఫలితాలు రావు. వ్యాయామం చేస్తున్నప్పుడు మన కండరాలు ఒత్తిడికి గురై, సూక్ష్మ స్థాయిలో దెబ్బతింటాయి. వాటిని పునరుద్ధరించడానికి, కండరాల పెరుగుదలకు సరైన పోషకాహారం చాలా అవసరం. వ్యాయామం తర్వాత మనం తీసుకునే ఆహారమే.. మన ఫిట్‌నెస్ ప్రయాణంలో 70% ఫలితాన్ని నిర్ణయిస్తుంది. వర్కవుట్ తర్వాత తీసుకోవాల్సిన  ఉత్తమ ఆహారాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

1. ప్రోటీన్ ప్రాముఖ్యత :
వర్కవుట్ చేసిన తర్వాత కండరాల కణజాలం మరమ్మత్తు కావడానికి ప్రోటీన్ అత్యంత కీలకం. వ్యాయామం ముగిసిన 30 నుంచి 45 నిమిషాల వ్యవధిని ‘అనాబాలిక్ విండో’ అంటారు. ఈ సమయంలో ప్రోటీన్ తీసుకోవడం వల్ల కండరాలు వేగంగా కోలుకుంటాయి.

Advertisement

ఏం తినాలి: ఉడికించిన గుడ్లు (ఎగ్ వైట్), చికెన్ బ్రెస్ట్, పనీర్, సోయా చంక్స్ లేదా వే ప్రోటీన్. వెజిటేరియన్స్ అయితే పెసలు, శనగలు వంటి పప్పు ధాన్యాలను తీసుకోవచ్చు.

2. కార్బోహైడ్రేట్లు ఎందుకు అవసరం? :
చాలా మంది బరువు తగ్గాలనే ఉద్దేశంతో వర్కవుట్ తర్వాత కార్బ్స్ తీసుకోరు, ఇది తప్పు. వ్యాయామం చేస్తున్నప్పుడు మన శరీరంలోని గ్లైకోజెన్ నిల్వలు ఖర్చవుతాయి. వీటిని తిరిగి నింపడానికి కార్బోహైడ్రేట్లు అవసరం.

Advertisement

ఏం తినాలి?: అరటిపండు, స్వీట్ పొటాటో (చిలగడదుంప), బ్రౌన్ రైస్ లేదా ఓట్స్. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.

3. కండరాల రికవరీకి ఆరోగ్యకరమైన కొవ్వులు:
మితమైన మోతాదులో ఆరోగ్యకరమైన కొవ్వులు తీసుకోవడం వల్ల కండరాల వాపు తగ్గుతుంది. బాదం, వాల్‌నట్స్, చియా సీడ్స్ లేదా అవకాడో వంటివి మీ పోస్ట్-వర్కవుట్ మీల్‌లో భాగంగా ఉండొచ్చు. అయితే.. ఇవి తక్కువ మోతాదులోనే ఉండాలి ఎందుకంటే అతిగా కొవ్వు తీసుకుంటే ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.

4. హైడ్రేషన్ – నీటి శాతం:
చెమట రూపంలో శరీరం కోల్పోయిన నీటిని, ఎలక్ట్రోలైట్లను తిరిగి భర్తీ చేయడం చాలా ముఖ్యం. వర్కవుట్ తర్వాత కేవలం నీరు మాత్రమే కాకుండా.. కొబ్బరి నీళ్లు లేదా నిమ్మరసం తాగడం వల్ల సోడియం, పొటాషియం వంటి ఖనిజాలు అందుతాయి. ఇది కండరాల తిమ్మిర్లను నివారిస్తుంది.

5. సమయపాలన :
వ్యాయామం ముగిసిన వెంటనే ఏమీ తినకుండా గంటల తరబడి ఖాళీ కడుపుతో ఉండకూడదు. దీని వల్ల శరీరం కండరాలనే శక్తి కోసం వాడుకోవడం మొదలుపెడుతుంది . కాబట్టి.. వర్కవుట్ ముగిసిన 60 నిమిషాల లోపు ప్రోటీన్ , కార్బ్స్ కలయికతో కూడిన ఆహారం తీసుకోవడం బెస్ట్.

6. నివారించాల్సిన ఆహారాలు:
వర్కవుట్ చేసిన కష్టమంతా వృథా కాకూడదంటే.. వ్యాయామం తర్వాత నూనెలో వేయించిన పదార్థాలు , స్వీట్లు, సోడాలు, అతిగా ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. ఇవి రక్తంలో చక్కెరను అకస్మాత్తుగా పెంచి.. ఇన్సులిన్ స్థాయిలను దెబ్బతీస్తాయి.

పోస్ట్-వర్కవుట్ మీల్ ఉదాహరణలు:

రెండు ఉడికించిన గుడ్లు + ఒక అరటిపండు.

వే ప్రోటీన్ షేక్ + కొన్ని నట్స్.

పెరుగులో ఓట్స్ ,పండ్ల ముక్కలు.

గ్రిల్డ్ చికెన్ లేదా పనీర్ సలాడ్.

Related News

పాత, చిరిగిన చీరలను పారేస్తున్నారా? వాటిని ఇలా ఉపయోగిస్తే ఎన్ని ప్రయోజనాలో

జీన్స్ ధరించగానే నడుము వద్ద లవ్ హ్యాండిల్స్ కనిపిస్తున్నాయా? సన్నని నడుము కోసం ఈ వ్యాయామం చేయండి

మన రక్తనాళాల్లో ప్లాస్టిక్.. గుండె పోటు వచ్చినవారిలో మరీ ఎక్కువ.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

బాత్‌రూమ్, వాష్‌రూమ్, రెస్ట్‌రూమ్.. ఈ మూడు ఒకటి కాదా? ఏ పదం ఎప్పుడు వాడాలి?

డెంగీ భయానికి ఎండ్ కార్డ్ పడింది.. భారత్‌లోకి వచ్చేసిన ఫస్ట్ వ్యాక్సిన్!

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

Big Stories

Advertisement
×