E-Paper
Advertisement

Trump on Iran War: ఇరాన్‌పై భీకర దాడులు.. యుద్దంలో గెలుస్తున్నాం, ట్రంప్ కీలక ప్రకటన

Trump on Iran War: ఇరాన్‌పై భీకర దాడులు.. యుద్దంలో గెలుస్తున్నాం, ట్రంప్ కీలక ప్రకటన

Trump on Iran War: ఇరాన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. మునుపెన్నడూ లేనంతగా  పెద్ద విజయాన్ని ఈ యుద్ధంలో తాము గెలుస్తున్నామని చెప్పకనే చెప్పారు.  ఇరాన్‌లో గత పాలకులు చేసిన తప్పులను సరిచేస్తున్నట్లు తెలిపారు. ఇరాన్ అణు కేంద్రాలపై బాంబులు వేశామని, దాదాపుగా మా లక్ష్యాలను చేరుకున్నట్లు తేల్చి చెప్పారు. ఇరాన్ అగ్ర నేతలను అంతం చేశారమన్నారు.

రాన్‌పై భీకర దాడులు.. యుద్దంలో గెలుస్తున్నాం-ట్రంప్

రాబోయే రెండు, మూడు వారాల్లో ఇరాన్‌పై తీవ్రమైన దాడులు చేయబోతున్నట్లు తేల్చి చెప్పారు ట్రంప్. ఇరాన్ నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ విభాగాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయని అన్నారు. ఈ యుద్ధం వల్ల ఇరాన్ భారీగా నష్టపోయిందని వెల్లడించారు. తన పాలనలో అమెరికా ఎన్నో విజయాలు సాధించిందని స్పష్టంచేశారు.  నాలుగు వారాల తర్వాత ఇరాన్ యుద్ధంపై అమెరికా ప్రజలను ఉద్దేశించి ట్రంప్ మాట్లాడారు.

వాషింగ్టన్ తన ప్రధాన యుద్ధ లక్ష్యాలను పూర్తి చేసే అంచున ఉందన్నారు. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ప్రారంభం నుంచి మా లక్ష్యాలు నెరవేరేలా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. ఈ విషయంలో అమెరికా సైనికులను ట్రంప్ ప్రశంసించారు మనం సరైన మార్గంలో ఉన్నామని ఈ రాత్రి తాను చెప్పగలనని అన్నారు. ఆ దేశాన్ని రాతియుగంలోకి తిరిగి తీసుకుని వెళ్లబోతున్నట్లు వివరించారు.

ఇరాన్ అతి పెద్ద అణుబాంబు తయారీ దిశగా దూసుకుపోయిందన్నారు. ఆదేశ వద్ద అణ్వాయుధాలు ఉండకూడదని చెబుతున్నామన్నారు. ఇరాన్ తో ఒబామా చేసుకున్న అణు ఒప్పందాన్ని రద్దు చేశామన్నారు. ఇరాన్ గౌరవం, విధేయత కొనుగోలుకు ఒబామా చేసిన యత్నం ఫలించలేదన్నారు. ఆయన్ని ఎగతాళి చేస్తూ అణుబాంబు తయారీ దిశగా సాగారని అన్నారు.

ఒబామా ఒప్పుందంలో ఇరాన్ కు భారీగా అణ్వాయుధాలు సమకూరేవన్నారు. నిపుణుల అభిప్రాయం మేరకు మధ్యప్రాచ్యం, ఇజ్రాయెల్ ఉండేవి కావన్నారు. ఇతర అధ్యక్షులు సాహసించని పనిని తాను చేశానన్నారు. చివరి ఇరాన్ యుద్ధం ఇప్పటికీ ముగియలేదని, రానున్న రోజుల్లో మరిన్ని భీకర దాడులు చేస్తామన్నారు.

ఇరాన్ యుద్ధం నెల తర్వాత ఆ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగం

ఎల్లప్పుడూ దౌత్యమార్గానికి తన మొదట ప్రయార్టీ ఉంటుందన్నారు. ఇరాన్ అణ్వాయుధాల కోసం అలుపెరగని అన్వేషణ చేసిందన్నారు. జూన్ లో ఆపరేషన్ మిడ్ నైట్ హామర్ లో భాగంగా ఆదేశ అణు కేంద్రాలపై దాడి చేశామన్నారు. వారి అణుకేంద్రాలపై బీ2 బాంబర్లు విరుచుకుపడ్డాయన్నారు. ఒక్కమాటలో చెప్పాలంఠఏ ఇరాన్ అణు స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేశామన్నారు.

హోర్ముజ్ జలసంధిలో నౌకా మార్గాన్ని సురక్షితం చేయాలని మిత్రదేశాలను కోరానని, ఆ విషయంలో అమెరికాకు దాని అవసరం లేదన్నారు. మధ్యప్రాచ్యంలో మిత్రుల నుంచి మద్దతు లేకపోవడంవల్ల నాటో నుండి అమెరికాను ఉపసంహరించుకునే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ తమ దేశంలోని 45 వేల మంది పౌరుల మృతికి కారణమైందన్నారు. అమెరికా అంతం కావాలని ఇరాన్ కోరుకుంటోందన్నారు.

దాదాపు 19 నిమిషాల పాటు అధినేత ప్రసంగం సాగింది. గతంలో యుద్ధాలు ఏళ్ల తరబడి జరిగాయని, ఈ సంక్షోభాన్ని తాము కేవలం 32 రోజుల్లో ముగించామన్నారు. ఇరాన్ క్షిపణి, డ్రోన్ సామర్థ్యం తగ్గిపోయిందన్నారు. అమెరికా సైనిక శక్తిని ఎవరూ అడ్డుకోలేరని, భవిష్యత్ తరాల కోసం చేసిన నిజమైన యుద్ధమని వ్యాఖ్యానించారు. తన తొలి పదవీకాలంలో ఇరాన్ సైనిక కమాండర్ ఖాసిం సులేమానీ హత మార్చిన విషయాన్ని గుర్తు చేశారు.

ALSO READ: అర్థరాత్రి భారీ భూకంపం.. చిగురుటాకులా వణికిన ఇండోనేషియా, 7.4గా నమోదు 

సులేమానీని రోడ్ ‌సైడ్ బాంబుల పితామహుడిగా ఆయన వర్ణించారు. సులేమానీ బతికుంటే ఇప్పుడు వేరే విషయం మాట్లాడుకునే వాళ్లమన్నారు. ట్రంప్ ప్రసంగానికి కొన్నిగంటల ముందు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ కాల్పుల విరమణ కోరారని ట్రంప్ ప్రస్తావించారు. ఈ హోర్ముజ్ జలసంధిని తెరిస్తేనే పోరాటంలో విరామం సాధ్యమవుతుందని తేల్చి చెప్పినట్టు వివరించారు. ఇరాన్‌లో అమెరికా కార్యకలాపాలు పూర్తయిన తర్వాత చముదు ధరలు తగ్గుతాయన్నారు ట్రంప్. యుద్ధం ముగిసినప్పటికీ వెంటనే ధరలు వెంటనే తగ్గకపోవచ్చని పలు నివేదికలు చెబుతున్నాయి.

 

Related News

Big Shock To Trump: ట్రంప్‌కు ఊహించని ఝలక్.. షాకిచ్చిన వార్ పవర్స్, ఆపరేషన్ ‘ఎపిక్ ఫ్యూరీ’ క్లోజ్

Kuwait Airport: ఇరాన్ మిస్సైళ్ల దాడులు.. కువైట్‌ ఎయిర్‌పోర్ట్ డ్యామేజ్, విమాన సర్వీసులు రద్దు

మరో బాంబ్‌ పేల్చిన అమెరికా.. భారత్‌పై అదనపు సుంకాలకు ప్రతిపాదన, ఏకంగా 12 శాతం

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. అమెరికా స్థావరాలపై ఇరాన్ వరుస దాడులు, ఖేష్మ్ ద్వీపంపై

ఇరాన్ షాకింగ్ నిర్ణయం.. ఇకపై మాటలు-చర్చల్లేవ్, హోర్మూజ్ జలసంధి మాటేంటి?

ఇరాన్‌లో ఇంటిపోరు మొదలైందా? అధ్యక్షుడు మసూద్‌ నిర్ణయం వెనుక, అసలేం జరుగుతోంది?

రూటు మార్చిన అమెరికా.. ఇరాన్‌పై మెరుపు దాడులు, రాడార్- డ్రోన్ వ్యవస్థలు డ్యామేజ్

హోర్ముజ్ జలసంధిలో హై టెన్షన్.. ఇరాన్ సైనిక క్యాంప్‌పై అమెరికా దాడి, కవ్వింపు చర్యలు డీల్ కోసమా?

Big Stories

×