E-Paper
Advertisement

చిన్న కిచెన్ ఉన్నవారికి గుడ్ న్యూస్.. టాప్ 5 స్పేస్-సేవింగ్ ఫ్రిజ్‌లు బడ్జెట్ ధరలోనే

చిన్న కిచెన్ ఉన్నవారికి గుడ్ న్యూస్.. టాప్ 5 స్పేస్-సేవింగ్ ఫ్రిజ్‌లు బడ్జెట్ ధరలోనే
Advertisement

Best Space Saving Refrigerators India: ఈ రోజుల్లో సిటీ లైఫ్ స్టైల్‌లో చాలా మంది ఫ్లాట్స్ లేదా చిన్న ఇళ్లలోనే ఉంటున్నారు. అయితే.. ఇల్లు చిన్నదైనా కిచెన్ మోడ్రన్‌గా, అన్నీ అమరినట్లు ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ముఖ్యంగా తక్కువ స్పేస్ ఉన్న కిచెన్స్‌లో.. పెద్ద సైజ్ ఫ్రిజ్ పెడితే నడవడానికి కూడా స్థలం ఉండదు. అందుకే.. మీ చిన్న కిచెన్‌కు పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యే, తక్కువ స్థలాన్ని ఆక్రమించే.. టాప్ 5 స్పేస్-సేవింగ్ రిఫ్రిజరేటర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

టాప్ 5 స్పేస్-సేవింగ్ ఫ్రిజ్‌లు :

1.LG 185 L 5 Star Refrigerator:

చిన్న ఫ్యామిలీస్ లేదా బ్యాచిలర్స్ కోసం ఎల్‌జీ (LG)తీసుకొచ్చిన ఈ మోడల్ ఒక సూపర్ హిట్. ఇది కేవలం 185 లీటర్ల కెపాసిటీతో ఉండి, కిచెన్ మూలలో చాలా తక్కువ స్పేస్ తీసుకుంటుంది. 5-స్టార్ రేటింగ్ ఉండడం వల్ల కరెంట్ బిల్లు అస్సలు రాదు. స్మార్ట్ ఇన్వర్టర్ కంప్రెసర్ వల్ల సౌండ్ కూడా రాకుండా స్మూత్‌గా రన్ అవుతుంది.

Advertisement

ప్రత్యేకత: బేస్ స్టాండ్‌తో పాటు డ్రయర్ వస్తుంది. ఇందులో.. ఆనియన్స్, పొటాటోస్ లాంటివి స్టోర్ చేసుకోవచ్చు.

ధర: సుమారు రూ.16,500 – రూ.18,000

2.Samsung 236 L3Star Double Door:

Advertisement

మీకు డబుల్ డోర్ ఫ్రిజ్ కావాలి, కానీ కిచెన్‌లో.. స్థలం తక్కువగా ఉందా? అయితే శామ్‌సంగ్ తీసుకొచ్చిన ఈ కాంపాక్ట్ డబుల్ డోర్ ఫ్రిజ్ బెస్ట్ ఆప్షన్. దీని విడ్త్ (వెడల్పు) తక్కువగా ఉండడం వల్ల చిన్న స్పేస్‌లో ఈజీగా సెట్ అవుతుంది. ఇందులో 5-in-1 కన్వర్టిబుల్ మోడ్ ఉంది. అంటే అవసరాన్ని బట్టి ఫ్రీజర్‌ను కూడా నార్మల్ ఫ్రిజ్‌గా మార్చుకోవచ్చు.

ప్రత్యేకత: డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీ, స్టైలిష్ కర్వ్డ్ డోర్ డిజైన్.

ధర: సుమారు రూ.24,000 – రూ.26,000

3. Godrej 99 L 2 Star Refrigerator:

మీ కిచెన్ మరీ చిన్నదా? లేదా బెడ్‌రూమ్, ఆఫీస్ రూమ్ కోసం చిన్న ఫ్రిజ్ కావాలా? గోద్రెజ్ 99 లీటర్ల మినీ రిఫ్రిజరేటర్ పర్ఫెక్ట్ ఛాయిస్. ఇది కేవలం ఒక చిన్న టేబుల్ అంత స్థలాన్ని మాత్రమే ఆక్రమిస్తుంది. చిన్నదైనా సరే ఇందులో వాటర్ బాటిల్స్, ఫ్రూట్స్, మిల్క్ ప్యాకెట్స్ ఈజీగా పెట్టేయొచ్చు.

ప్రత్యేకత: కాంపాక్ట్ స్లీక్ డిజైన్, వైర్ షెల్వ్స్, క్విక్ ఐస్ మేకింగ్.

ధర: సుమారు రూ.9,000 – రూ.10,500

4. Whirlpool 192 L3 Star frige:

వర్ల్‌పూల్ బ్రాండ్ నుంచి వచ్చిన ఈ మోడల్ లుక్ పరంగా చాలా ట్రెండీగా ఉంటుంది. దీని ఆటో-డిఫ్రాస్ట్ టెక్నాలజీ వల్ల ఫ్రీజర్‌లో ఎక్స్‌ట్రా ఐస్ గడ్డకట్టకుండా చూసుకుంటుంది. దీని డిజైన్ కిచెన్‌కు ప్రీమియం లుక్ ఇస్తుంది. తక్కువ వైడ్ స్పేస్‌లో అమరిపోతుంది. ఇందులోని విటామ్యాజిక్ టెక్నాలజీ కూరగాయలు ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండేలా చేస్తుంది.

ప్రత్యేకత: ఇన్సులేటెడ్ కాపిలరీ టెక్నాలజీ, బ్యూటిఫుల్ ఫ్లోరల్ డిజైన్స్.

ధర: సుమారు రూ.14,500 – రూ.16,000

5.Haier 240 L Refrigerator:

హైయర్ బ్రాండ్ కిచెన్ స్పేస్‌ను ఆప్టిమైజ్ చేయడంలో దిట్ట. ఈ 240 లీటర్ల ఫ్రిజ్ డబుల్ డోర్ అయినప్పటికీ స్లిమ్ డిజైన్‌తో వస్తుంది. ఇందులోని ట్విన్ ఇన్వర్టర్ టెక్నాలజీ ఫ్యాన్ , కంప్రెసర్‌ను ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేసి పవర్‌ను సేవ్ చేస్తుంది. ఎక్కువ స్టోరేజ్ కావాలి కానీ కిచెన్ చిన్నగా ఉందనే వారికి ఇది బెస్ట్ సొల్యూషన్.

ప్రత్యేకత: 5-in-1 కన్వర్టిబుల్ మోడ్స్, ఫాస్ట్ ఐస్ కూలింగ్.

ధర: సుమారు రూ.22,000 – రూ.24,000

కాంపాక్ట్ ఫ్రిజ్ కొనేటప్పుడు ఈ స్మార్ట్ టిప్స్ పాటించండి:

మెజర్‌మెంట్స్: ఫ్రిజ్ కొనేముందు మీ కిచెన్‌లో.. దాన్ని పెట్టాలనుకునే ప్లేస్ పొడవు, వెడల్పులను టేప్‌తో కొలిచి చూసుకోండి.

డోర్ ఓపెనింగ్ స్పేస్: ఫ్రిజ్ డోర్ పూర్తిగా తెరుచుకోవడానికి వీలుగా చుట్టుపక్కల కనీసం 2-3 ఇంచుల గ్యాప్ ఉండేలా ప్లాన్ చేయండి.

స్టార్ రేటింగ్: కరెంట్ బిల్లులు భారీగా పెరిగినందున 3-స్టార్ లేదా 5-స్టార్ ఇన్వర్టర్ మోడల్స్ ఎంచుకోవడం లాంగ్ రన్‌లో చాలా బెనిఫిట్.

అమెజాన్‌లో లభించే ఈ స్మార్ట్, స్పేస్-సేవింగ్ రిఫ్రిజరేటర్లు మీ చిన్న కిచెన్‌ను మరింత అందంగా మార్చేస్తాయి. మరి మీ బడ్జెట్ అండ్ అవసరాలకు తగ్గ మోడల్‌ను ఈరోజే సెలెక్ట్ చేసుకోండి.

 

Tags

Related News

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

పిల్లల్లో డిప్రెషన్ ముప్పును తగ్గించే చిన్ననాటి అనుభవాలు ఇవే.. పేరెంట్స్ ఇవి తప్పక తెలుసుకోవాలి!

సాయంత్రం పూట వేడి వేడిగా ఇలా చేసి పెట్టండి ఇంటిల్లిపాదీ ఇష్టంగా తింటారు!

హోటల్ స్టైల్ క్రిస్పీ ఇన్‌స్టంట్ రవ్వ దోశ.. 15 నిమిషాల్లో ఇలా తయారు చేసుకోండి!

పిల్లల చేతి నుంచి ఫోన్ తీసుకోగానే ఏడుస్తున్నారా? ఇలా చేస్తే స్వయంగా ఇచ్చేస్తాడు

మన రక్తంలో ప్లాస్టిక్ విధ్వంసం.. తాజా రీసెర్చ్‌లో తేలిన సంచలన విషయాలు!

ఈ నవరాత్రులకు 3 స్పెషల్ డిషెస్.. ప్రసాదంగానూ పెట్టొచ్చు, రుచికి తిరుగే ఉండదు!

ఇడ్లీ,దోశలోకి అదిరిపోయే రుచితో ఉల్లిపాయ చట్నీలు..ఇలా చేసేయండి!

Big Stories

Advertisement
×