E-Paper
Advertisement

Hair Oiling Tips: జుట్టు ఒత్తుగా పెరగాలంటే నూనె ఎప్పుడు పెట్టుకోవాలి? ఉదయమా లేక రాత్రుళ్లా?

Hair Oiling Tips: జుట్టు ఒత్తుగా పెరగాలంటే నూనె ఎప్పుడు పెట్టుకోవాలి? ఉదయమా లేక రాత్రుళ్లా?
Advertisement

Hair Oiling Tips: చిన్నప్పుడు మన అమ్మమ్మో లేక నాన్నమ్మో తలకు నూనె పెట్టి గట్టిగా మసాజ్ చేస్తుంటే.. ఆ హాయే వేరు కదా. అదే ఇప్పుడైతే ఈ ఆఫీసుల బిజీలో పడి చాలామంది వారానికి ఒకసారి మాత్రమే జుట్టుకు ఆయిల్ రాస్తున్నారు. అది కూడా తలకు నూనె అంటి అంటనట్లుగా పెట్టుకుంటున్నారు. అందుకే నేటి తరంవారిలో జట్టురాలే సమస్య అధికమవుతుంది. అయితే, జుట్టు బాగా పెరగాలంటే నూనెను ఏ సమయంలో రాస్తే మంచిదనే డౌట్ చాలామందిలో ఉంటుంది. కొందరు పొద్దున్నే అంటే.. మరికొందరు రాత్రిపూట అంటున్నారు. ఇంతకీ జుట్టు బలంగా, ఒత్తుగా పెరగాలంటే ఏ టైంలో నూనె రాయోలో ఇప్పుడు తెలసుకుందామా.

నూనె రాస్తే నిజంగా జుట్టు పెరుగుతుందా?

చాలామంది నూనె రాసేయగానే జుట్టు పెరిగిపోతుంది అనుకుంటారు. కానీ అది పూర్తిగా నిజం కాదు. నూనె పెట్టి తలను మెల్లగా మసాజ్ చేసినప్పుడు అక్కడ రక్త ప్రసరణ పెరిగి, జుట్టు కుదుళ్లు స్ట్రాంగ్ అవుతాయి. దీనివల్ల జుట్టు చిట్లిపోకుండా, డ్రై అవ్వకుండా హెల్దీగా ఉంటుంది. మంచి ఫుడ్, ప్రశాంతమైన నిద్రతో పాటు నూనెను కరెక్ట్ పద్ధతిలో వాడితేనే జుట్టు పెరుగుదల కనిపిస్తుంది.

ఉదయం పూట నూనె రాస్తే?

Advertisement

మీరు ఆ రోజే తలస్నానం చేయాలనుకుంటే.. స్నానానికి ఒక గంట ముందు నూనె రాసుకోవడం చాలా మంచిది. దీనివల్ల తల మీద జిడ్డు పేరుకుపోదు. ఎవరికైతే ఆయిలీ స్కిన్ ఉంటుందో, మొటిమల సమస్య ఎక్కువగా ఉంటుందో.. వారికి ఈ పద్ధతే బెస్ట్. అయితే ఒక్కటి గుర్తుంచుకోండి.. నూనె రాసుకుని బయట దుమ్ములో తిరగకండి. అలా చేస్తే జుట్టుకు మురికి త్వరగా అంటుకుని చుండ్రు సమస్యలు వస్తాయి.

Also Read: పుట్టబోయే పిల్లలు హెల్దీగా ఉండాలంటే.. అబ్బాయిలు కచ్చితంగా ఇవి చేయాల్సిందే!

రాత్రి పెట్టుకుంటే ఏమౌతుంది?

Advertisement

మీ జుట్టు బాగా పొడిగా, ఎండుగడ్డిలా అయిపోతుంటే.. రాత్రిపూట నూనె రాసుకోవడమే కరెక్ట్. రాత్రంతా ఉంచడం వల్ల నూనెలోని పోషకాలు లోపలి వరకు వెళ్లడానికి సమయం దొరుకుతుంది. పైగా పడుకునే ముందు మసాజ్ చేసుకుంటే హాయిగా నిద్ర పడుతుంది. కానీ, మరీ ఎక్కువగా నూనె రాసేసి రాత్రంతా వదిలేయకండి. దానివల్ల చుండ్రు వచ్చే ఛాన్స్ ఎక్కువ.

మీది డ్రై హెయిర్ అయితే?

దీనికి అందరికీ ఒకటే రూల్ ఉండదు. మీ జుట్టు తత్వాన్ని బట్టి టైమ్ మార్చుకోవాలి. మీది డ్రై హెయిర్ అయితే వారానికి ఒకసారి రాత్రిపూట పెట్టుకోండి. అదే మీది ఆయిలీ స్కాల్ప్ అయితే తలస్నానానికి ముందు గంట సేపు ఉంచుకుంటే చాలు. వారానికి రెండు మూడు సార్లు నూనె రాస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఏ టైమ్ అనేది మీ కన్వీనియంట్‌ని బట్టి చూసుకోండి.

ఈ టిప్స్ పాటిస్తున్నారా?

నూనె రాసేటప్పుడు వేళ్లతో సున్నితంగా మసాజ్ చేయడం మర్చిపోవద్దు. నూనె మరీ ఎక్కువగా కాకుండా.. కుదుళ్లకు అంటేలా పెట్టుకుంటే చాలు. అలాగే తలస్నానం చేసేటప్పుడు గాఢత తక్కువగా ఉండే షాంపూ వాడితే మీ జుట్టు సహజంగా మెరుస్తుంది.

Also Read: త్వరగా బరువు తగ్గాలంటే ఏ టైంలో వర్కౌట్స్ చేయాలి? ఉదయమా లేక సాయంత్రమా?

Related News

హెవీ ఇయర్‌రింగ్స్‌తో చెవి నొప్పి వస్తుందా? చెవి రంధ్రాలు సాగకుండా ఈ సింపుల్ ట్రిక్ పాటించండి

ఒక్క పన్ను పీకడానికి రూ.2.25 లక్షలా.. అదే ఇండియాలో అయితే?

డెస్క్ జాబ్ చేస్తున్నారా? ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే సమస్యలు ఇవే

తగ్గేదెలే.. ఈ తేదీల్లో పుట్టినవారు ఆత్మగౌరవం విషయంలో అసలు రాజీపడరు

స్కూల్‌కు వెళ్లే సమయం అయినా పిల్లలు నిద్రలేవడం లేదా? ఈ 5 టిప్స్‌తో మార్నింగ్ రొటీన్ మార్చండి

గుండెపోటు ముప్పును 30 శాతం తగ్గించగల పిల్.. తాజా అధ్యయనంలో అద్భుత ఫలితాలు

వర్షాకాలంలో తరచూ అనారోగ్యానికి గురవుతున్నారా? రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి ఈ పుడ్స్

రక్తంలో చక్కెర పెరగకుండా ఉండాలంటే ఆపిల్ తినాలా? పియర్ తినాలా?

Big Stories

Advertisement
×