E-Paper
Advertisement

Best Time to Exercise: త్వరగా బరువు తగ్గాలంటే ఏ టైంలో వర్కౌట్స్ చేయాలి? ఉదయమా లేక సాయంత్రమా?

Best Time to Exercise: త్వరగా బరువు తగ్గాలంటే ఏ టైంలో వర్కౌట్స్ చేయాలి? ఉదయమా లేక సాయంత్రమా?
Advertisement

Best Time to Exercise: సంపూర్ణ ఆరోగ్యం పొందాలంటే వ్యాయామం చేయాలని మనందరికీ తెలుసు. అయితే, జిమ్‌కు వెళ్లాలన్నా లేదా వాకింగ్ చేయాలన్నా చాలామందికి వచ్చే అతిపెద్ద సందేహం ఏ సమయంలో చేయాలి? అని. కొందరు ఉదయాన్నే నిద్రలేవగానే వర్కవుట్ చేయడానికి ఇష్టపడితే.. మరికొందరు ఆఫీసు పనులు ముగిశాక సాయంత్రం వేళల్లో చెమట చిందిస్తుంటారు. నిజానికి ఏ సమయంలో వ్యాయామం చేసినా శరీరానికి మేలే జరుగుతుంది. కానీ, ఇటీవల 14వేల మందిపై జరిగిన ఒక ఆసక్తికర పరిశోధన ప్రకారం.. మనం వ్యాయామం చేసే సమయం మన గుండె ఆరోగ్యంపై, దీర్ఘకాలిక వ్యాధులపై గణనీయమైన ప్రభావం చూపుతుందని తేలింది.

మార్నింగ్ వర్కౌట్స్‌ బెనిఫిట్స్:

ఈ పరిశోధనలో పాల్గొన్న వారి హృదయ స్పందన రేటును విశ్లేషించినప్పుడు ఒక ముఖ్యమైన విషయం బయటపడింది. ఎవరైతే ఉదయం పూట క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తారో.. వారిలో గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంది. ముఖ్యంగా ఉదయం 7 నుండి 8 గంటల మధ్య శారీరక శ్రమ చేసేవారిలో రక్తపోటు, కొలెస్ట్రాల్, మధుమేహం వంటి సమస్యలు తక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. సాయంత్రం వేళల్లో వ్యాయామం చేసేవారితో పోలిస్తే, ఉదయం పూట యాక్టివ్‌గా ఉండేవారిలో గుండె జబ్బుల ముప్పు దాదాపు 31 శాతం తగ్గినట్లు ఈ గణాంకాలు చెబుతున్నాయి.

Advertisement

Also Read: పీరియడ్స్ పిల్స్ వాడినప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తే ఇక పైకే!

సాయంత్రం చేస్తే ఏమౌతుంది?

ఉదయాన్నే వ్యాయామం చేయడం వల్ల ఇన్ని లాభాలు ఎందుకు కలుగుతాయనే దానికి కొన్ని శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. మన శరీరంలో ఒక జీవ గడియారం (సర్కాడియన్ రిథమ్) ఉంటుంది. తెల్లవారుజామున వ్యాయామం చేయడం వల్ల మన జీవక్రియ మెరుగుపడటమే కాకుండా, హార్మోన్ల నియంత్రణ, రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇది రోజంతా మనల్ని ఉత్సాహంగా ఉంచడమే కాకుండా, రాత్రిపూట మంచి నిద్ర పట్టడానికి కూడా సహాయపడుతుంది. అంతేకాదు.. ఉదయాన్నే వర్కవుట్ పూర్తి చేస్తే ఆ రోజంతా మనం తీసుకునే ఆహారం విషయంలో కూడా క్రమశిక్షణతో ఉండే అవకాశం ఉంటుంది.

అలవాటుగా మార్చుకోవాలి:

Advertisement

కేవలం పరిశోధనలు చెప్పాయి కదా అని ఒకే రోజులో మీ దినచర్యను మార్చుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం మీరు గనుక సాయంత్రం వేళల్లో వ్యాయామం చేస్తుంటే.. అది శరీరానికి మేలు చేస్తుంది. అయితే, మరిన్ని మెరుగైన ఫలితాల కోసం మెల్లమెల్లగా మీ వ్యాయామ సమయాన్ని ఉదయానికి మార్చుకోవడానికి ప్రయత్నించవచ్చు. మొదట్లో ఇబ్బందిగా అనిపించినా మెల్లమెల్లగా అలవాటు అవుతుంది. వ్యాయామం ఎంత సేపు చేశామన్నది కాదు.. క్రమం తప్పకుండా చేస్తున్నామ, లేదా అన్నదే ముఖ్యం.

మీ జీవినశైలికి తగ్గట్టు:

నిజానికి ఆరోగ్యంగా ఉండటానికి ఫలానా సమయంలోనే వ్యాయామం చేయాలంటూ ఏమీ లేదు. కానీ ఉదయం పూట చేసే ప్రయత్నం మన శరీరానికి అదనపు బలాన్ని ఇస్తుంది. కాబట్టి.. మీ జీవనశైలికి ఏ సమయం వీలవుతుందో చూసుకుని, రోజూ కనీసం కొద్దిసేపైనా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోండి. లేదంటే.. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకే ఇబ్బంది పడాల్సి ఉంటుంది.

Also Read: నోటిఫికేషన్స్ గోల లేదు, ఛార్జింగ్ కష్టాలు ఉండవ్.. మీ ఆరోగ్యం ఇక ఈ స్మార్ట్ రింగ్ చేతుల్లో!

Related News

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సాయం చేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు కష్టకాలంలో తోడుగా నిలుస్తారు

మరణం తర్వాత శరీరంలోని ఏ అవయవం ఎంతసేపు జీవించి ఉంటుంది? ఈ విషయాలు తెలుసా

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం

Big Stories

Advertisement
×