E-Paper
Advertisement

Tips For Skin: శనగపిండి, పెరుగుతో.. కొరియన్ స్కిన్ మీ సొంతం

Tips For Skin: శనగపిండి, పెరుగుతో.. కొరియన్ స్కిన్ మీ సొంతం
Advertisement

Tips For Skin: అందంగా కనిపించాలని అందరికీ ఉంటుంది. ముఖ్యంగా ముఖంపై మెరుపును కాపాడుకోవడానికి మార్కెట్‌లో చాలా ఖరీదైన ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. ఇందుకోసం అనేక మంది వేలాది రూపాయలు ఖర్చు చేస్తుంటారు. ఇంత చేసినా చాలా సార్లు ముఖంపై మచ్చలు, టానింగ్ వంటి సమస్యలు వస్తూనే ఉంటాయి. అయితే, కొన్ని హోం రెమెడీస్‌తో ముఖం యొక్క మృదుత్వం, మెరుపును పెరిగేలా చేస్తాయి. శనగపిండి, పెరుగుతో తయారుచేసిన ఫేస్ ప్యాక్ చర్మంపై ముడతలను తొలగించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా టానింగ్‌ను తగ్గిస్తుంది.

శనగ పిండి, పెరుగు అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు..

Advertisement

జిడ్డు తొలగిపోతుంది: చాలా మంది చర్మం తరుచుగా జిడ్డుగా మారుతుంది. ఇటువంటి పరిస్థితిలో, పెరుగు, శనగ పిండిని ముఖానికి ఉపయోగించడం వల్ల చర్మంపై జిడ్డు తొలగిపోతుంది. పెరుగు, శనగపిండి మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయడం వల్ల పిగ్మెంటేషన్ సమస్య తొలగిపోతుంది. ఇది చర్మం రంగును క్లియర్ చేస్తుంది. అంతే కాకుండా ముఖంపై pH స్థాయిని మెరుగుపరుస్తుంది.

మచ్చలు:
ముఖంపై మచ్చలు రావడం సాధారణ సమస్య. శనగపిండిలో నీరు కలిపి ఆ ఫేస్ట్ తో ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖంపై ఉన్న జిడ్డు తొలగిపోతుంది. అంతే కాకుండా పెరుగు మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది. శనగపిండి, పెరుగు కలిపి ముఖానికి రాసుకుంటే చర్మం మెరుస్తుంది.

Advertisement

చర్మంపై తేమ:
ముఖం డ్రైగా మారితే పెరుగు శెనగపిండితో తయారుచేసిన ఫేస్ ప్యాక్ మంచి మాయిశ్చరైజర్‌ గా పనిచేస్తుంది. ఇది చర్మాన్ని తేమగా ఉంచుతుంది. అంతే కాకుండా చర్మాన్ని శుభ్రపరచడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

Also Read: వీటితో మీ ఫేస్ మెరిసిపోతుంది తెలుసా ?

ముడతలను తగ్గించండి:
వయసు పెరుగుతున్న కొద్దీ ముఖంపై ముడతలు కూడా పెరగడం ప్రారంభమవుతాయి. శనగపిండి, పెరుగుతో చేసిన ఫేస్ ప్యాక్ ను ముఖానికి అప్లై చేయడం వల్ల ముడతలు తగ్గుతాయి.

శనగపిండి, పెరుగు ఫేస్ ప్యాక్ తయారుచేసే విధానం:
శనగ పిండి, పెరుగు ఫేస్ ప్యాక్ తయారు చేయడం చాలా సులభం. ఇందుకోసం ఒక గిన్నెలో 2 చెంచాల శనగపిండి వేసి అందులో రెండు చెంచాల పెరుగు కూడా వేయాలి. దీన్ని మిక్స్ చేసి చర్మంపై అప్లై చేసి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. దీని తర్వాత, నీటితో ముఖం కడుక్కోండి. తేలికగా రుద్దడం ద్వారా ముఖం శుభ్రం చేసుకోండి.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

పాలు తాగడం ఇష్టం లేదా? కాల్షియం కోసం ఈ 8 ఆరోగ్యకరమైన ఆహారాలు తినండి

ఖరీదైన ఫేస్‌వాష్ అవసరం లేదు.. కిచెన్‌లో లభించే ఈ ఐటెమ్స్‌తో మీ ఫేస్ డీప్ క్లీన్

పుట్టబోయేది మగబిడ్డ లేదా ఆడబిడ్డ.. హార్ట్‌బీట్‌తో తెలుసుకోవచ్చా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

వయసు మీరుతున్నా ప్రేమలో మాత్రం ఫ్రెష్‌ ఫీలింగ్.. ఈ తేదీల్లో పుట్టినవారు గ్యారంటీ లవర్స్

రోజూ పకోడీలు తిని బోర్ కొడుతోందా? పచ్చి బొప్పాయితో క్రిస్పీ కట్లెట్స్ ట్రై చేయండి

కృష్ణాష్టమికి మీ పాపను రాధమ్మగా ముస్తాబు చేయాలా? ఫొటోషూట్ అందంగా చేయడానికి టిప్స్

మహిళల్లో ఎముకల బలహీనత సమస్య.. మెనోపాజ్‌కు ముందే బలమైన ఎముకల కోసం ఏం చేయాలి?

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

Big Stories

Advertisement
×