BigTV English
Advertisement

Bigg Boss 8 Day 35 Promo 2: నామినేషన్ రచ్చ మొదలు.. హౌస్ మేట్స్ వర్సెస్ వైల్డ్ కార్డ్స్..!

Bigg Boss 8 Day 35 Promo 2: నామినేషన్ రచ్చ మొదలు.. హౌస్ మేట్స్ వర్సెస్ వైల్డ్ కార్డ్స్..!

Bigg Boss 8 Day 35 Promo 2.. బిగ్ బాస్ సీజన్ 8 5 వారాలు పూర్తి చేసుకోగా.. ఐదు వారాలకు గానూ ఆరు మంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం హౌస్ లో 8 మంది కుటుంబ సభ్యులు ఉండగా మరొకవైపు వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ను ఎనిమిది మందిని హౌస్ లోకి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం హౌస్ మేట్స్ వర్సెస్ వైల్డ్ కార్డ్స్ అంటూ వీరిని క్లాన్ లుగా విభజించి గేమ్ మొదలుపెట్టారు బిగ్ బాస్. ఇకపోతే ఆరో వారం మొదలైంది.. సోమవారం మొదలైంది అంటే నామినేషన్ రచ్చ షురూ అయింది అని చెప్పవచ్చు. సోమవారం 35వ రోజుకు సంబంధించి నామినేషన్ ప్రక్రియ వాడివేడిగా సాగుతోంది. మరి ఎవరెవరు నామినేట్ చేసుకున్నారు.. అనే విషయం ఇప్పుడు చూద్దాం.


ప్రోమో షురూ..

తాజాగా బిగ్ బాస్ నిర్వాహకులు 35వ రోజుకు సంబంధించి రెండవ ప్రోమో విడుదల చేశారు.ఈ ప్రోమోలో నామినేషన్ రచ్చ మొదలైంది. వైల్డ్ కార్డు ఎంట్రీస్.. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఆట తీరుని గత ఐదు వారాలుగా చూస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ ఐదు వారాల ఆట తీరును దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం హౌస్ లో ఉన్న ఎనిమిది మంది కంటెస్టెంట్స్ లను నామినేట్ చేయాల్సి ఉంటుంది. అలా ఒక్కొక్క వైల్డ్ కార్డు ఎంట్రీ ఇద్దరిని చొప్పున హౌస్ మేట్స్ నామినేట్ చేశారు. మరి ఎవరెవరిని నామినేట్ చేశారు ఇప్పుడు చూద్దాం.


యష్మిని నామినేట్ చేసిన హరితేజ..

ముందుగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టిన హరితేజ.. హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకుంటున్న యష్మిని నామినేట్ చేసింది. పర్సన్ పర్సన్ కి రూల్స్ మారుతున్నాయి అని హరితేజ చెప్పగా.. యష్మీ మాట్లాడుతూ.. ఏది కరెక్ట్ అనిపిస్తుందో అది నేను చేస్తాను అని యష్మీ అంటే..నీకు ఇష్టం లేదు అన్న దగ్గర వేరే రూల్ అప్లై అవుతుంది అంటూ హరితేజ కామెంట్ చేస్తుంది. నా గేమ్ కి ఎవరు డిస్టర్బింగ్ గా ఉన్నారో వాళ్లనే కదా చేయాలి అంటూ యష్మి చెబుతుంది. దాంతో హరితేజ యష్మిని నామినేట్ చేసింది.

విష్ణు ప్రియ ను టార్గెట్ చేసిన హౌస్ మేట్స్..

ఆ తర్వాత గౌతమ్ కృష్ణ విష్ణు ప్రియ నామినేట్ చేస్తూ.. నువ్వు నీ గేమ్ ను పక్కన పెట్టేసి వేరే వ్యక్తి పైన ఆసక్తి చూపిస్తున్నట్టు అనిపిస్తోంది అంటూ చెబుతాడు. దీంతో విష్ణు ప్రియ మాట్లాడుతూ.. ఇక్కడ నేనేంటి.. నా ఎమోషన్ ఏంటి.. నేనేం చేస్తున్నాను.. అదే పోర్ట్రైట్ చేస్తాను అంటూ విష్ణుప్రియ చెబుతుంది. ఆ తర్వాత నయని పావని కూడా విష్ణుప్రియను నామినేట్ చేస్తూ సీరియస్ నెస్ అసలు కనిపించడం లేదు. ఈ వీక్ చీఫ్ అవ్వాలనుకోవట్లేదు అని మీరు చెప్పడం అసలు మాకు నచ్చడం లేదు. అంటుంది. ఫస్ట్ ఈ షో అర్థం చేసుకొని, ప్యాట్రన్ అర్థం చేసుకోవడానికి నాకు టైం కావాలి అంటూ విష్ణుప్రియ చెప్పడంతో.. నయని పావని మాట్లాడుతూ.. విన్నర్ అవడానికి ఉన్నది 15 వారాలు మాత్రమే అంటూ చెబుతుంది. ఆ తర్వాత హరితేజ పృథ్వీ నీ నామినేట్ చేయగా.. మీరు ఉన్నది ఒక గంటే కదా అంటూ కామెంట్ చేస్తారు. అలా కాస్త వీరిద్దరి మధ్య గొడవ జరుగుతుంది. మొత్తానికైతే ఈ ప్రోమో చూసిన నెటిజెన్స్ మేకుల్ని దించారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Related News

Bigg Boss 9 : ఎంత నటిస్తావమ్మా? అప్పుడు పురుగుల చూసావు ఇప్పుడు ఉన్నాను అంటున్నావ్

Bigg Boss 9: అది సుమన్ శెట్టి అంటే, అందుకే ఇంత మంది ఇష్టపడుతున్నారు

Bigg Boss 9: మరోసారి తన సెల్ఫిష్ బిహేవర్ బయట పెట్టిన ఇమ్మానియేల్

Bigg Boss 9 Telugu : ముద్దుబిడ్డ తనూజాకు బిగ్ బాస్ స్పెషల్ ఆఫర్… కళ్యాణ్ బలి… ఇదేం తుప్పాస్ గేమ్ బాసూ ?

Bigg Boss 9 Telugu Day 62 : ఇమ్మూ, రీతూ ఇంత సెల్ఫిషా ? కంటెస్టెంట్స్ ఎమోషన్స్ తో ఆటాడుకున్న నాగ్… రామూ షాకింగ్ ఎలిమినేషన్

Bigg Boss Tamil: ప్రాంక్‌ పేరుతో కొట్టుకున్న కంటెస్టెంట్స్‌.. ఫైర్‌ అయిన హోస్ట్‌!

Bigg Boss 9 Elimination: డబుల్‌ ట్విస్ట్‌, డబుల్‌ ఎలిమినేషన్‌.. రాము రాథోడ్‌ అవుట్‌!

Bigg Boss 9 Promo : బిగ్ బాస్ హౌస్ లో ఆర్జీవి, అందరూ అమ్మాయిలే కావాలి అంటూ..

Big Stories

×