E-Paper
Advertisement

Bhramari Pranayama: ఒక్క నిమిషంలో మనసుకు ప్రశాంతత.. స్ట్రెస్ తగ్గించడంలో ‘భ్రమరి ప్రాణాయామం’ ఎలా పనిచేస్తుందంటే?

Bhramari Pranayama: ఒక్క నిమిషంలో మనసుకు ప్రశాంతత.. స్ట్రెస్ తగ్గించడంలో ‘భ్రమరి ప్రాణాయామం’ ఎలా పనిచేస్తుందంటే?
Advertisement

Bhramari Pranayama: ఉదయం కళ్లుతెరిచిన క్షణం నుంచే మన జీవితం ఓ పరుగు పందెంలా మారిపోతుంది. ఆఫీస్ పనులు, బాధ్యతలు, గంటల కొద్దీ ఫోన్ స్క్రోలింగ్.. ఇవన్నీ కలిసి మన నరాల వ్యవస్థపై ఒత్తిడి పెంచుతుంటాయి. దాంతో మెడ ఎప్పుడూ బిగుతుగా అనిపించడం, తల భారంగా మారడం, కారణం తెలియని ఆందోళన ఒక్కసారిగా వచ్చి వేధించడం లాంటి సమస్యలు మొదలవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో గంటల తరబడి వ్యాయామాలు చేయడం అందరికీ సాధ్యం కాదు. కానీ కేవలం ఒక నిమిషంలోనే శరీరానికీ, మనసుకీ ఊరటనిచ్చే ఓ సింపుల్ యోగా పద్ధతి ఉంది.

ఒక్క నిమిషం చాలు:

స్ట్రెస్‌ను తక్షణమే తగ్గించే అత్యంత సులభమైన శ్వాసాభ్యాసాల్లో ‘భ్రమరి ప్రాణాయామం’ ఒకటి. దీన్ని చేయడానికి ప్రత్యేకంగా ఏ స్థలం అవసరం లేదు. కూర్చుని లేదా నిటారుగా నిలబడి కళ్లను మూసుకుని, చూపుడు వేళ్లను చెవుల దగ్గర ఉంచాలి. ఇప్పుడు గాలిని లోతుగా పీల్చుకుని, నెమ్మదిగా వదులుతూ తేనెటీగల మాదిరి ‘మ్మ్’ అనే శబ్దాన్ని చేయాలి. ఈ శబ్దం వల్ల మెదడులోని నరాలకు మృదువైన కంపనాలు చేరి, ఒత్తిడిలో ఉన్న నర్వస్ సిస్టమ్ వెంటనే రిలాక్స్ అవుతుంది. శరీరాన్ని అప్రమత్తంగా ఉంచే ఫైట్ ఆర్ ఫ్లైట్ పరిస్థితి మెరుగుపడి, ప్రశాంతతనిచ్చే రెస్ట్ అండ్ డైజెస్ట్ మోడ్ యాక్టివ్ అవుతుంది. ఒక్క నిమిషంలోనే మనస్సు తేలికగా మారిన భావన స్పష్టంగా తెలుస్తుంది.

Advertisement

Read Also: చలికాలంలో గడ్డ పెరుగు తినడం ఆరోగ్యానికి హానికరమా?.. వైద్య నిపుణుల అభిప్రాయం ఇదే!

ఆందోళన పారిపోద్ది:

భ్రమరి ప్రాణాయామంతో పాటు అదే సమయంలో చేయగల మరో చిన్న పద్ధతి భుజాల సడలింపు. వెన్నెముకను నిటారుగా ఉంచి గాలిని పీలుస్తూ భుజాలను నెమ్మదిగా చెవుల వరకూ పైకి ఎత్తాలి. తర్వాత ఒక్కసారిగా గాలిని వదిలేస్తూ భుజాలను కిందకు వదిలేయాలి. ఇలా రెండు లేదా మూడు సార్లు చేస్తే మెడ, భుజాల చుట్టూ పేరుకుపోయిన టెన్షన్ క్రమంగా సడలిపోతుంది. బిగుసుకుపోయిన నరాలు మళ్లీ సహజ స్థితికి చేరుకుని, శరీరం లైట్‌గా అనిపించడం మొదలవుతుంది.

ఏకాగ్రత పెరుగుతుంది:

Advertisement

రోజంతా కంప్యూటర్ స్క్రీన్ ముందు కూర్చునే వారికి భ్రమరి ప్రాణాయామం నిజంగా ఓ వరం లాంటిది. ఇది శరీరంలోని అలసటను తగ్గించడమే కాదు, మెదడులో పేరుకుపోయిన మానసిక ఒత్తిడినీ శాంతింపజేస్తుంది. ఫలితంగా ఏకాగ్రత పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా గంటల తరబడి వ్యాయామాలు చేయాల్సిందే అన్న నియమం లేదు. కొన్నిసార్లు కేవలం 60 సెకన్లు మీ శ్వాసపై, మీ శరీరంపై దృష్టి పెట్టినా చాలు. ఇలాంటి చిన్న యోగా అలవాట్లు నరాల వ్యవస్థను రీఫ్రెష్ చేసి, రోజంతా ఉత్సాహంగా, ప్రశాంతంగా ఉండేందుకు బాగా సహాయపడతాయి.

Read Also: కోడిగుడ్లు నిజంగా మన ఆరోగ్యానికి మేలు చేస్తాయా? ఈ నిజాలు తెలిస్తే అవాక్కే!

Related News

LED ఫేస్ మాస్క్ ముఖంపై ముడతలు తగ్గిస్తుందని ప్రచారం.. నిజంగా పనిచేస్తుందా?

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

Big Stories

Advertisement
×