E-Paper
Advertisement

Group-3 Results: టీజీపీఎస్సీ తీపికబురు.. గ్రూప్-3 ఫలితాలు విడుదల

Group-3 Results: టీజీపీఎస్సీ తీపికబురు.. గ్రూప్-3 ఫలితాలు విడుదల
Advertisement

Group-3 Results: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గ్రూప్-3 అభ్యర్థులకు తీపి కబురు అందించింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా.. తాజాగా 1370 మంది అభ్యర్థులతో కూడిన ప్రొవిజనల్ జాబితాను అధికారులు విడుదల చేశారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఫలితాలు వెలువడటంతో అభ్యర్థుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

ఎంపికైన అభ్యర్థుల వివరాలను టీజీపీఎస్సీ తన అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్ల ఆధారంగా ఫలితాలను సరిచూసుకోవచ్చని అధికారులు సూచించారు. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ, మెరిట్ మరియు రిజర్వేషన్ నిబంధనల ప్రకారం ఈ జాబితాను రూపొందించినట్లు కమిషన్ వెల్లడించింది.

Advertisement

రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో గ్రూప్-3 సర్వీసుల భర్తీ కోసం గత ఏడాది నవంబర్ 17, 18 తేదీల్లో రాత పరీక్షలను నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన అనేక కేంద్రాల్లో పకడ్బందీగా ఈ పరీక్షలు జరిగాయి. అప్పట్నుంచి అభ్యర్థులు ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాంకేతిక కారణాలు, ఇతర ప్రక్రియల వల్ల కొంత సమయం తీసుకున్నప్పటికీ.. తుదకు ఫలితాల విడుదల ప్రక్రియ పూర్తయింది.

ఈ గ్రూప్-3 నోటిఫికేషన్‌కు నిరుద్యోగుల నుంచి భారీ స్పందన లభించింది. మొత్తం 5.63 లక్షల మంది అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే, పరీక్ష రోజున మాత్రం అభ్యర్థుల హాజరు తక్కువగానే నమోదైంది. దరఖాస్తు చేసుకున్న వారిలో కేవలం 50.24 శాతం మంది మాత్రమే పరీక్షలకు హాజరయ్యారు. అంటే దాదాపు సగం మంది అభ్యర్థులు పరీక్షకు దూరంగా ఉన్నప్పటికీ, హాజరైన వారి మధ్య పోటీ మాత్రం తీవ్రంగానే ఉంది. రాష్ట్రంలో వరుసగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతుండటంతో నిరుద్యోగుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. గ్రూప్-3 ఫలితాల విడుదల ద్వారా 1370 కుటుంబాల్లో ఉపాధి వెలుగులు నిండనున్నాయి.

Advertisement

ALSO READ: Top 20 News : కేసీఆర్‌కు సీఎం రేవంత్ సవాల్, నకిలీ మద్యం కేసులో జోగి రమేష్‌కు షాక్, బ్యాంకులో దోపిడీముఠా

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×