E-Paper
Advertisement

Curd In Winter: చలికాలంలో గడ్డ పెరుగు తినడం ఆరోగ్యానికి హానికరమా?.. వైద్య నిపుణుల అభిప్రాయం ఇదే!

Curd In Winter: చలికాలంలో గడ్డ పెరుగు తినడం ఆరోగ్యానికి హానికరమా?.. వైద్య నిపుణుల అభిప్రాయం ఇదే!
Advertisement

Curd In Winter: చలికాలం వచ్చేసరికి పెరుగు తినాలా, వద్దా? అనే ప్రశ్న చాలామందిని ఆలోచింపజేస్తుంది. అయితే పెరుగు శరీరానికి అవసరమైన పోషకాలను అందించి జీర్ణశక్తిని మెరుగుపరచడంలో, శీతాకాలంలో ఇమ్యూనిటీని బలపరచడంలో ఎంతగానో సహాయపడుతుందని వైద్యులు చెబుతున్నారు.

కానీ చల్లని స్వభావం ఉన్న ఆహారమైనందున, చలికాలంలో పెరుగును నేరుగా తీసుకోవడం వల్ల కొందరిలో జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా జలుబు, సైనస్ సమస్యలు ఉన్నవాళ్లు రాత్రి వేళల్లో పెరుగుకు దూరంగా ఉండటం మంచిదని సూచిస్తున్నారు.

Advertisement

Read Also: జిమ్‌ అవసరం లేదు.. రోజూ మెట్లు ఎక్కితే చాలు, ఫిట్‌నెస్ ఫలితాలు చూసి ఆశ్చర్యపోతారు!

తగిన జాగ్రత్తలు పాటిస్తూ..

అయితే.. పెరుగును పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని, అలాగే ఫ్రిజ్‌ నుంచి నేరుగా తీసుకుని తినకుండా, సాధారణ ఉష్ణోగ్రతకు వచ్చిన తర్వాతే తినడం మంచిది. ముఖ్యంగా ఉదయం లేదా మధ్యాహ్నం పూట పెరుగు తినడం ఆరోగ్యానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఆ సమయంలో శరీరం పెరుగును సులభంగా జీర్ణం చేసుకోగలుగుతుంది.

జీవక్రియ మెరుగవుతుంది:

Advertisement

పెరుగు పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియాను పెంచి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే ఇందులో ఉండే కాల్షియం ఎముకలను బలంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రోటీన్, కాల్షియం, రిబోఫ్లావిన్, విటమిన్ B6, విటమిన్ B12 వంటి అవసరమైన పోషకాలు పెరుగులో సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలోని రోజువారీ కార్యకలాపాలకు తోడ్పడి, జీవక్రియను చురుగ్గా ఉంచుతాయి.

పేగుల ఆరోగ్యానికి పెరుగు:

క్రమం తప్పకుండా పెరుగు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. పేగుల ఆరోగ్యం బాగుండటంతో శరీర సహజ రక్షణ వ్యవస్థ బలపడుతుంది. అందుకే చలికాలంలో కూడా పెరుగును పూర్తిగా మానేయకుండా, పగటిపూట తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. అలా తీసుకుంటే పెరుగులోని పోషక గుణాలు పూర్తిగా శరీరానికి అందుతాయి, మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుందని సూచిస్తున్నారు.

Read Also: ‘విటమిన్ ఈ’ రోజుకు ఎంత అవసరం? ఏయే ఆహారాల్లో లభిస్తుంది? పూర్తి వివరాలు ఇవిగో..

Related News

LED ఫేస్ మాస్క్ ముఖంపై ముడతలు తగ్గిస్తుందని ప్రచారం.. నిజంగా పనిచేస్తుందా?

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

Big Stories

Advertisement
×