E-Paper
Advertisement

Black Eggs vs White Eggs: ప్రొటీన్ ఫుడ్‌పై ఏంటీ కన్ఫ్యూజన్.. ఈ రెండిట్లో ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా?

Black Eggs vs White Eggs: ప్రొటీన్ ఫుడ్‌పై ఏంటీ కన్ఫ్యూజన్.. ఈ రెండిట్లో ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా?
Advertisement

Black Eggs vs White Eggs: కరోనా తర్వాత ప్రజలు ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు. రోజూ ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఎప్పుడు తింటే మంచిది.. అనే దాని గురించి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో చాలామంది ప్రొటీన్ కోసం గుడ్లు సహా పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకుంటున్నారు. అయితే, మొన్నటి వరకు మార్కెట్లో తెల్లగుడ్లు, గోధుమ రంగు గుడ్లు ఉండేవి. ప్రొటీన్ లవర్స్ వీటినే తినేవాళ్లు. ఇప్పుడు సడెన్‌గా నల్లగుడ్లు కూడా దర్శనం ఇవ్వడంతో ఇవీ ప్రాచుర్యం పొందాయి. కానీ, ఈ రెండిట్లో ఎక్కువగా ప్రొటీన్, విటమిన్లు, ఖనిజాలు ఉన్న గుడ్డు ఏదో చాలామంది కన్ఫ్యూజన్ అవుతున్నారు. మీకూ ఆ డౌట్ ఉంటే.. ఈ ఆర్టికల్ చేదివేయండి.

ప్రొటీన్ ఎక్కువ.. కొవ్వు తక్కువ:

నల్లగుడ్లకు పెట్టింది పేరు కడక్‌నాథ్ కోడి. ఈ కడక్‌నాథ్ కోళ్లు ఎక్కువగా మధ్యప్రదేశ్‌లోని గిరిజన ప్రాంతాల్లో కనిపిస్తాయి. ఈ కోళ్లు నల్లటి ఈకలు, నల్ల మాంసం, ముదురు గుడ్లకు ప్రసిద్ధి చెందాయి. ఈ కోళ్ల గుడ్లు తినడానికి రుచిగానే కాదు..ఇందులో ప్రొటీన్ కంటెంట్ కూడా అధికంగా ఉండి, కొవ్వు తక్కువగా ఉంటుంది. కాబట్టి.. ఈ నల్లగుడ్లు ఫిట్‌నెస్ ఔత్సాహికులకు ఇష్టమైన ఆహారంగా మారిపోయింది.

నల్లగుడ్లు మంచి ఎంపిక:

Advertisement

బ్లాక్ ఎగ్స్ పోషకాహార పరంగా చూస్తే.. సాధారణ గుడ్ల కంటే ఉత్తమం. 100 గ్రాముల నల్లగుడ్లలో దాదాపు 15.6 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. తెల్లగుడ్లు లేదా గోధుమ రంగు గుడ్ల కంటే దాదాపు రెండు రెట్లు ఎక్కువ. నల్లగుడ్లలో.. కొవ్వు, కొలెస్ట్రాల్ కూడా తక్కువే. ఇవి సుమారు 5.8 గ్రాముల కొవ్వు, 372 మిల్ లీగ్రాముల కొలెస్ట్రాల్ కలిగి ఉంటాయి. జిమ్‌కు వెళ్లి కండలు పెంచాలనుకునేవారికి లేదా బరువును తగ్గించుకోవాలనుకునేవారికి ఈ నల్లగుడ్లు బెస్ట్ ఆప్షన్. వీటిలో ప్రోటీన్‌ సమృద్ధిగా ఉండటమే కాకుండా.. ఆరోగ్యకరమైనవి కూడా.

అనేక ఆరోగ్య ప్రయోజనాలు:

ఈ కడక్‌నాథ్ గుడ్లలో ప్రోటీన్ మాత్రమే కాదు.. విటమిన్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారికి బ్లాక్ ఎగ్స్ ప్రయోజనకరంగా ఉంటాయి. కడక్‌నాథ్ గుడ్లు గుండె ఆరోగ్యానికి కూడా తోడ్పడతాయి. ఎందుకంటే.. వాటిలో కొవ్వు, కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. మొత్తానికి ఈ బ్లాక్ ఎగ్స్ రుచి, ఆరోగ్యం రెండింటికీ అద్భుతమైన ఎంపిక.

ఈ రెండిట్లో ఏది ఉత్తమం?

Advertisement

నలుపు లేదా తెలుపు గుడ్లు.. రెండూ ఆరోగ్యానికి ప్రయోజనకరంగానే ఉంటాయి. కానీ, పోషక నాణ్యత విషయానికి వస్తే.. కడక్‌నాథ్ గుడ్లు కాస్త అధిక ప్రయోజనాలు కలిగి ఉంటాయి. ఇవి సాధారణ గుడ్ల కంటే.. ఎక్కువ ప్రోటీన్, తక్కువ కొవ్వు, యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఇవి శరీరాన్ని బలోపేతం చేస్తాయి. అయితే, తెల్లగుడ్ల కంటే వీటికి ఎక్కువ ఖర్చవుతుంది. అంతేకాదు.. మార్కెట్లో ఎక్కువగా అందుబాటులో ఉండవు కాబట్టి.. ప్రొటీన్ తెల్లగుడ్లు తీసుకున్నా మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు.

Related News

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోందా? ప్రశాంతంగా ఉండడానికి రోజూ ఈ 5 టిప్స్ పాటించండి

మామిడి ఆకులు కేవలం ఇంట్లో తోరణాలు కట్టడానికి కాదు.. స్కిన్ కేర్ నుంచి ఎరువు తయారీ వరకు ఎన్ని ప్రయోజనాలు

అదృష్టాన్ని కాదు కష్టాన్ని నమ్ముకుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎన్ని కష్టాలొచ్చినా వెనకడుగు వేయరు

ఈ వీకెండ్‌ అలవాట్లు ఉన్నవారిలో క్యాన్సర్ ముప్పు.. అతిగా ఎంజాయ్ చేస్తే యమ డేంజర్

హెవీ ఇయర్‌రింగ్స్‌తో చెవి నొప్పి వస్తుందా? చెవి రంధ్రాలు సాగకుండా ఈ సింపుల్ ట్రిక్ పాటించండి

Big Stories

Advertisement
×