E-Paper
Advertisement

California Almonds: అమెరికా బాదం vs ఇండియా బాదం.. ఆరోగ్యానికి ఏది బెస్ట్?

California Almonds: అమెరికా బాదం vs ఇండియా బాదం.. ఆరోగ్యానికి ఏది బెస్ట్?
Advertisement

California Almonds vs Kashmiri Almonds Walnuts| డ్రైఫ్రూట్స్‌లో బాదం, పిస్తా, కాజు, వాల్ నట్స్ లాంటి నట్స్ పవర్‌ఫుల్ ఫుడ్స్. వీటిలో కూడా వాల్‌నట్స్‌లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటే, బాదం అంటే ఆల్‌మండ్స్‌లో విటమిన్ ఇ అధిక మొత్తంలో ఉంటుంది. వీటితో పాటు రెండింటిలో కూడా ప్రొటీన్, మెగ్నీషియం, ఫైబర్ కూడా ఉంటాయి. రుచితో పాటు ఆరోగ్యకరంగా ఉండడంతో వీటిని అందరూ ఇష్టపడతారు. అయితే మార్కెట్‌లో లభించే వాల్‌నట్స్, బాదం తక్కువ క్వాలిటీ కలిగి ఉంటాయి. అందుకే కొనే సమయంలో జాగ్రత్తగా ఉండాలి.

ఇండియాలో లభించే బాదం, వాల్‌నట్స్ ఇవే

ఇండియాలో ఎక్కువగా అమెరికా బ్రాండ్ కాలిఫోర్నియా బాదం, వాల్‌నట్స్ లభిస్తాయి. అయితే వీటితో భారత్‌కు చెందిన కాశ్మీర్ బాదం, వాల్‌నట్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ రెండింటిలో ఎందులో పోషక విలువలు ఎక్కువగా ఉన్నాయనేది తెలుసుకోవాలి.

కాశ్మీర్, కాలిఫోర్నియా నట్స్ ఎలా పండిస్తారు?

Advertisement

కాశ్మీర్ నట్స్ సాంప్రదాయ పద్ధతుల్లో పండిస్తారు. రైతులు తక్కువ రసాయనాలు వినిడతారు. ఇవి ఎక్కువగా ఆర్గానిక్‌గా, సహజంగా ప్రాసెస్ అవుతాయి. కానీ మార్కెట్లో తక్కువగా దొరుకుతాయి. కాలిఫోర్నియా నట్స్ భారీ స్థాయిలో వాణిజ్య ఫార్ములాతోనే పండిస్తారు. అంటే ఆధునిక పద్ధతులు వినియోగించి ఎక్కువ ఉత్పత్తి చేస్తారు. ఇవి సులభంగా దొరుకుతాయి. పైగా తక్కువ ధరలో ఉంటాయి.

రుచి, ఆకారంలో తేడాలు

కాశ్మీర్ వాల్‌నట్స్, బాదం పప్పులో సహజ నూనె ఎక్కువగా ఉంటుంది. కాశ్మీర్ మమ్రా బాదం రుచికరంగా ఉంటాయి. అయితే గట్టిగా ఉండడంతో నమలడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. అవి మరింత సహజంగా, తక్కువ ప్రాసెస్ చేసినట్లు అనిపిస్తాయి. కాలిఫోర్నియా వాల్‌నట్స్ తేలికైన, కొంచెం తీయని రుచితో వస్తాయి. అవి తక్కువ నూనెతో లైట్‌గా ఉంటాయి. కాలిఫోర్నియా బాదం క్రంచీగా, సాఫ్ట్‌గా ఉంటాయి. తినడానికి సులభం కాబట్టి స్నాక్స్‌కు ఎక్కువగా ఇష్టపడతారు.

రూపు, తోలు మందంలో తేడాలు

Advertisement

కాశ్మీర్ వాల్‌నట్స్ గట్టిగా, మందమైన తోలుతో (షెల్) ఉంటాయి. వాటి సైజు అసమానంగా, సహజంగా కనిపిస్తుంది. మమ్రా బాదం చిన్నగా, వేర్వేరు సైజులో ఉంటాయి. కొంచెం వంకరగా లేదా లోపలికి వంగినట్లు కనిపిస్తాయి. కాలిఫోర్నియా వాల్‌నట్స్ తోలు పలచగా ఉంటాయి. వాటిని త్వరగా పగులగొట్టవచ్చు. కాలిఫోర్నియా బాదం పెద్దగా, దాదాపు ఒకే సైజులో ఉంటాయి. సాఫ్ట్‌గా మెరుగ్గా పాలిష్ చేసినట్లు కనిపిస్తాయి.

నూనె, పోషకాలలో తేడా

కాశ్మీర్ వాల్‌నట్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె, మెదడు ఆరోగ్యానికి చాలా మంచివి. మమ్రా బాదంలో 50 శాతం వరకు సహజ నూనె ఉంటుంది. మెగ్నీషియం, కాల్షియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి శరీరంలో శక్తిని పెంచి, శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కాలిఫోర్నియా నట్స్‌లో సహజ నూనె కొంచెం తక్కువగా ఉంటుంది. అయినా అవి మంచి పోషకాలు ఇస్తాయి. కానీ వాటి పోషక సాంద్రత కొంచెం తక్కువ.

Also Read: డాన్స్ చేసే సమయంలో గుండెపోటు.. పెరుగుతున్న కేసుల సంఖ్య.. ఇలా నివారించండి

ఏ నట్స్ ఆరోగ్యానికి ఎక్కువ మంచివి?

దేశీ కాశ్మీర్ వాల్‌నట్స్, మమ్రా బాదంలలో పోషకాలు ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువ. గుండె, మెదడు, ఎముకల బలం కోసం ఇవి బెస్ట్. మరోవైపు అమెరికా కాలిఫోర్నియా నట్స్ రోజువారీ స్నాక్స్, వంటకాల్లో వేయడానికి బాగుంటాయి. అవి తినడానికి సులభంగా ఉంటాయి.

ఏవి తినడం బెటర్?

ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు కావాలంటే కాశ్మీర్ నట్స్ ఎంచుకోండి. కొలెస్ట్రాల్ తగ్గించేందుకు, జ్ఞాపకశక్తి మెరుగుపరచడం కోసం ఇవి బాగుంటాయి. రోజువారీ తినడానికి సులభం, చౌకగా కావాలంటే కాలిఫోర్నియా నట్స్ బెటర్. మీ ఆరోగ్య అవసరాలు, బడ్జెట్ ప్రకారం ఎంచుకోండి.

Related News

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

ఐలైనర్ సరిగ్గా రావడం లేదా? పర్ఫెక్ట్ లుక్ కోసం ఈజీ మేకప్ ట్రిక్స్‌ ఇవిగో

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

భోజనం చేసినా, ఏదైనా తాగినా వెంటనే లిప్‌స్టిక్ పాడవుతోందా? రోజంతా పెదాలు కలర్‌ఫుల్‌గా ఉండేందుకు చిట్కాలు

Big Stories

Advertisement
×