E-Paper
Advertisement

Hair Care tips: ఆముదంలో వీటిని కలిపి తలకు పట్టించారంటే జుట్టు ఒత్తుగా పెరిగేస్తుంది

Hair Care tips: ఆముదంలో వీటిని కలిపి తలకు పట్టించారంటే జుట్టు ఒత్తుగా పెరిగేస్తుంది

జుట్టు పొడవుగా, దట్టంగా పెరగాలని చాలా మంది కోరుకుంటారు. కానీ కాలుష్యం, స్ట్రెస్, చెడు ఆహారం, కెమికల్ ప్రోడక్ట్స్ వాడకం వల్ల జుట్టు రాలడం, పలుచబడడం వంటి సమస్యలు వస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లోనే సహజంగా జుట్టు పెరుగుదల కోసం ఆముదం మంచి పరిష్కారమని చెబుతారు. ఆముదం ఆయిల్‌ను కొన్ని ఇతర నూనెలతో కలిపి వాడితే హెయిర్ గ్రోత్ వేగంగా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు ఆ 5 నూనెల గురించి తెలుసుకోండి.

కొబ్బరి నూనె
కాస్టర్ ఆయిల్ చాలా మందంగా ఉంటుంది. అందుకే నేరుగా జుట్టుకు రాయడం కష్టంగా అనిపిస్తుంది. అప్పుడు కొబ్బరి నూనె కలిపితే ఆయిల్ పలుచగా మారుతుంది. ఇది జుట్టు లోపలికి చొచ్చుకెళ్లి ప్రోటీన్ లాస్ తగ్గిస్తుంది. కొబ్బరి నూనె వాడటం వల్ల జుట్టు బ్రేకేజ్ తగ్గి మృదువుగా మారుతుంది. కాస్టర్ ఆయిల్‌తో కలిపి వాడితే జుట్టు బలంగా పెరుగుతుంది.

బాదం నూనె
బాదం నూనెలో విటమిన్ E ఎక్కువగా ఉంటుంది. ఇది జుట్టుకు మెరుపు ఇస్తుంది. డ్రై, ఫ్రిజ్జీ హెయిర్ ఉన్నవారికి బాదం నూనె మంచి ఎంపిక. కాస్టర్ ఆయిల్‌తో కలిపితే స్కాల్ప్‌కు పోషణ అందుతుంది. జుట్టు పొడవుగా, సాఫ్ట్‌గా మారుతుంది. రెగ్యులర్‌గా మసాజ్ చేస్తే జుట్టు రాలడం తగ్గే అవకాశం ఉంటుంది.

రోజ్మేరి ఆయిల్
రోజ్మేరి ఆయిల్ స్కాల్ప్‌లో రక్తప్రసరణ పెంచుతుందని చెబుతారు. రక్తప్రసరణ బాగా ఉంటే హెయిర్ ఫాలికల్స్ యాక్టివ్‌గా పని చేస్తాయి. అయితే ఇది స్ట్రాంగ్ ఆయిల్ కావడంతో కొద్దిగా మాత్రమే ఉపయోగించాలి. కాస్టర్ ఆయిల్ మిశ్రమంలో మూడు నుంచి అయిదు చుక్కలు వేసినా సరిపోతుంది. దీన్ని వాడటం వల్ల కొత్త జుట్టు పుట్టడంలో సహాయ పడుతుంది.

Also read: Hair Transplant: హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకునే ముందు ఈ 5 సైడ్ ఎఫెక్టుల గురించి తెలుసుకోండి

జోజోబా నూనె
జోజోబా నూనె మన స్కాల్ప్ సహజ నూనెలకు దగ్గరగా ఉంటుంది. అందుకే ఇది స్కాల్ప్ ఆయిల్ బ్యాలెన్స్‌ను కాపాడుతుంది. ఆయిలీ స్కాల్ప్ ఉన్నవారికి కూడా ఇది ఉపయోగపడుతుంది. కాస్టర్ ఆయిల్‌తో కలిపి వాడితే స్కాల్ప్ ఇర్రిటేషన్ తగ్గి జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.

ఆర్గాన్ నూనె
ఆర్గాన్ నూనెను లిక్విడ్ గోల్డ్ అని కూడా పిలుస్తారు. ఇందులో ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టు డ్యామేజ్ తగ్గించి మెరుపు ఇస్తాయి. కాస్టర్ ఆయిల్‌తో కలిపి వాడితే జుట్టు గ్రీజీగా కాకుండా పోషణ అందుతుంది. డ్రై, కెమికల్ డ్యామేజ్ హెయిర్ ఉన్నవారికి ఇది మంచి ఎంపిక.

ఎలా వాడాలి?
కాస్టర్ ఆయిల్ ను వాడేటప్పుడు కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఒక భాగం ఆముదం, రెండు భాగాలు పైన చెప్పిన నూనెల్లో ఏదో ఒకటి తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం గోరువెచ్చగా చేయాలి. స్కాల్ప్‌పై నెమ్మదిగా 5–10 నిమిషాలు మసాజ్ చేయాలి. కనీసం 1–2 గంటలు ఉంచి తర్వాత షాంపూతో కడగాలి. ఇవి సహజ నూనెలు అయినా ప్రతి ఒక్కరికి ఒకేలా పనిచేయవు. మొదట చిన్న భాగంలో ట్రై చేసి అలర్జీ లేదని చూసుకోవాలి. వారానికి 2–3 సార్లు వాడితే మంచి ఫలితం కనిపిస్తుంది. అలాగే మంచి ఆహారం, నీరు, నిద్ర కూడా హెయిర్ గ్రోత్‌కు చాలా ముఖ్యమైనవి.

Related News

ఇంటి బయట ॐతో పాటు ఈ నాలుగు చిహ్నాలుంటే.. మీ జీవితంలో సుఖ సంతోషాలే

మార్కెట్‌ నుంచి తెచ్చిన మొక్కలు ఇంట్లో ఎండిపోతున్నాయా? ఈ టిప్స్ పాటిస్తే ఏళ్ల తరబడి పచ్చగా పెరుగుతాయి

వేసవి నీరసం వల్ల ఓఆర్ఎస్ తాగుతున్నారా? ప్యాకెట్లు వద్దు.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి

మీ అబ్బాయి కోసం పెళ్లిసంబంధాలు చూస్తున్నారా? ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి సర్వ గుణ సంపన్నురాలు

వేసవిలో అద్దంలా మెరిసిపోయే ముఖ చర్మం కావాలా? ఈ టిప్స్ మీ కోసమే

కొత్త ఇల్లు మీ కోసం సంతోషాలు తీసుకొస్తుందా లేదా కష్టాలకు కారణమవుతుందా? దీనికి కారణాలు ఇవే

గుడ్డు తింటే జరిగే మ్యాజిక్ ఇదే.. కానీ ఆ ఒక్క తప్పు అస్సలు చేయొద్దు!

నెల రోజులు చాయ్‌కి ‘టాటా’ చెబితే.. మీ బాడీలో జరిగే వింతలు ఇవే!

Big Stories

×