Road Reflectors: బైక్‌పై వెళ్తున్నప్పుడో, కార్లో ప్రయాణిస్తున్నప్పుడో రోడ్డు మధ్యలో చిన్న చిన్న లైట్లు మిలమిలా మెరుస్తూ పింక్, వైట్, ఎల్లో కలర్స్‌లో కనిపించడాన్ని ఎప్పుడైనా గమనించారా? అచ్చం నేల మీద నక్షత్రాలు పరిచినట్లు భలే గమ్మత్తుగా ఉంటాయి కదూ! వాటినే మనం రోడ్డు రిఫ్లెక్టర్లు లేదా ‘క్యాట్ ఐస్’ అని పిలుస్తాం. ఇవి కేవలం రోడ్డు అందం కోసం పెట్టినవి కావు, చీకట్లో రహదారిపై రాబోయే ప్రమాదకరమైన మలుపులు, లేన్ సరిహద్దులు, రోడ్డు అంచులను డ్రైవర్లకు స్పష్టంగా చూపిస్తూ ఎంతో మంది ప్రాణాలను కాపాడే నిజమైన రక్షకులు. అసలు ఈ అద్భుతాన్ని ఎవరు, ఎలా కనిపెట్టారో తెలిస్తే మీరు ఖచ్చితంగా ముక్కున వేలేసుకుంటారు. దీని వెనుక ఒక పిల్లి చేసిన మాయ, ఒక లండన్ వ్యక్తి సమయస్ఫూర్తి దాగున్నాయి.
చిన్న గోడపై కూర్చుని ఉన్న పిల్లి వల్లే
అది 1933వ సంవత్సరం. బ్రిటన్‌కు చెందిన పెర్సీషా అనే ఒక సాధారణ రోడ్డు మెకానిక్ ఒకరోజు రాత్రి దట్టమైన పొగమంచు, గాఢాంధకారంలో తన కారు నడుపుకుంటూ ఇంటికి బయలుదేరాడు. అప్పట్లో ఇప్పటిలా వీధి దీపాలు, రోడ్డు రేడియం మార్కింగ్‌లు అస్సలు ఉండేవి కావు. చీకటి ఎంత దారుణంగా ఉందంటే, అసలు రోడ్డు ఎటు ఉందో, ఖాళీ స్థలం ఎటు ఉందో తెలియక పెర్సీషా కంగారుతో చెమటలు పట్టేస్తున్నాయి.
also read :‘ఎల్లమ్మ’లో దేవిశ్రీ ప్రసాద్ జోడీగా ఆ క్రేజీ హీరోయిన్.. దిల్ రాజు ప్లాన్ మామూలుగా లేదుగా
సరిగ్గా అదే సమయంలో, చావు అంచుల్లో ఉన్న అతనికి ప్రకృతి ఒక అద్భుతమైన క్లూ ఇచ్చింది. రోడ్డు పక్కన ఉన్న ఒక చిన్న గోడపై కూర్చుని ఉన్న పిల్లి, పెర్సీషా వస్తున్న కారు వైపు చూసింది. కారు హెడ్‌లైట్ల వెలుతురు పడగానే ఆ పిల్లి కళ్ళు చీకట్లో వింతగా, చాలా పవర్‌ఫుల్‌గా మెరిశాయి. ఆ మెరుపును చూసి పెర్సీషా ఒక్కసారిగా అలర్ట్ అయ్యాడు. వెంటనే కారును జాగ్రత్తగా పక్కకు తిప్పాడు. అలా ఆ పిల్లి కళ్ళ మెరుపు ఆ రాత్రి అతని ప్రాణాలను కాపాడింది.
కృతజ్ఞతగా ‘క్యాట్స్ ఐ’
ఇంటికి వచ్చాక కూడా పెర్సీషాకు ఆ పిల్లి కళ్ళ మెరుపే గుర్తొస్తూ ఉంది. పిల్లి కళ్ళ వెనుక కాంతిని వెనక్కి పంపే ఒక ప్రత్యేకమైన పొర (టాపెటమ్ లూసిడమ్) ఉంటుందని, అందుకే అవి అంతలా మెరుస్తున్నాయని అతను రీసెర్చ్ చేసి తెలుసుకున్నాడు. మరి పిల్లి కళ్ళు వెలుతురును తిరిగి ప్రతిబింబిస్తున్నప్పుడు, రోడ్డుపై కూడా ఇలాంటివే ఆర్టిఫిషియల్‌గా ఏర్పాటు చేస్తే రాత్రిపూట డ్రైవర్లకు రూట్ క్లియర్‌గా తెలుస్తుంది కదా అని ఆలోచించాడు.
also read :త్రికాల మూవీ రివ్యూ.. విజువల్ వండర్.. కానీ ఆ ఒక్కటి మిస్సైంది!
వెంటనే తన గ్యారేజీలో కూర్చుని గాజు ముక్కలు, రబ్బరు బేస్‌తో ఒక చిన్న పరికరాన్ని తయారుచేసి, దానికి కృతజ్ఞతగా ‘క్యాట్స్ ఐ’ అని పేరు పెట్టాడు. వాహనాల హెడ్‌లైట్ వెలుతురు దీనిపై పడగానే, అది ఎటువంటి కరెంట్ లేకుండానే తిరిగి ఆ వెలుగును డ్రైవర్ కళ్ళకే రిఫ్లెక్ట్ చేస్తుంది. దీనివల్ల వందల మీటర్ల దూరంలోనే రోడ్డు ఎలా ఉందో తెలిసిపోతుంది.
పిల్లి కళ్ళను చూసి పుట్టిన ఈ క్రేజీ ఐడియా
కాలం మారుతున్న కొద్దీ ఈ క్యాట్ ఐస్ మరింత స్మార్ట్‌గా, హైటెక్‌గా మారిపోయాయి. ఇప్పుడు మనం చూస్తున్న రిఫ్లెక్టర్లలో కేవలం గాజు ముక్కలు మాత్రమే కాకుండా, పగటిపూట సూర్యరశ్మిని గ్రహించి రాత్రి వేళల్లో స్వయంగా వెలిగే సోలార్ ప్యానెల్స్, ఎల్‌ఈడీ లైట్లను కూడా వాడుతున్నారు. ఇవి ఎంత స్ట్రాంగ్‌గా ఉంటాయంటే, వీటిపై నుంచి భారీ లారీలు, ట్రక్కులు వెళ్లినా సరే ఇవి అస్సలు పగిలిపోవు. ఒక చిన్న పిల్లి కళ్ళను చూసి పుట్టిన ఈ క్రేజీ ఐడియా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది వాహనదారులను క్షేమంగా ఇళ్లకు చేరుస్తోంది.మొత్తానికి ఒక అర్థరాత్రి పెర్సీషా పెట్టుకున్న ప్రయాణం వల్ల ఈరోజు రోడ్లపై జాలీగా వెళ్ళగలుగుతున్నాం అన్న మాట.