E-Paper
Advertisement

అన్న ఎన్టీఆర్ లాగే సీఎం రేవంత్ రెడ్డి పాలన.. మహేష్ కుమార్ గౌడ్

అన్న ఎన్టీఆర్ లాగే సీఎం రేవంత్ రెడ్డి పాలన.. మహేష్ కుమార్ గౌడ్
Advertisement

Mahesh Kumar Goud: స్వేచ్ఛ బ్యూరో: ఇచ్చిన మాటను నిలపెట్టుకోవడం కాంగ్రెస్ నైజం అంటూ టీపీసీసీ చీఫ్​ మహేష్​ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. గురువారం ఆయన అమీర్ పేట్ లోని ఎన్డీఆర్ విగ్రహం ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అంటేనే మాట ఇస్తే కట్టుబడి ఉంటామని చెప్పడానికి ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ ఒక తార్కాణం అన్నారు. నగరం నడి ఒడ్డున అన్న ఎన్టీఆర్ విగ్రహం సీఎం చేతుల మీదగా ఆవిష్కరించుకోవడం సంతోషకరమన్నారు.

యావత్ ప్రపంచ తెలుగు వారికి ఆయన ఎన్టీఆర్ స్పూర్తి అన్నారు. ఎన్టీఆర్ ను ఓ పార్టీకో, కులానికో అంటకట్టవదన్నారు. బడుగు బలహీన వర్గాలకు పేదవారికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పెట్టి చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. ఇందిరా గాంధీ దేశంలో పేద ప్రజల సంక్షేమం కోసం జీవితాంతం పరితపించారన్నారు. ఎన్టీఆర్ కూడా ఇందిరా గాంధీ లాగా ఆమె బాటలో పయనించి పేద ప్రజల సంక్షేమానికి కృషి చేశారన్నారు.

Advertisement

కాంగ్రెస్ పార్టీ సంస్కృతి కలలను కళాకారులను గౌరవిస్తుందన్నారు. ఎన్టీఆర్ ను గౌరవించుకోవడం అంటే యావత్ తెలుగుజాతిని గౌరవించుకోవడం లాంటిదేనని చెప్పారు. ఎన్టీఆర్ లాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బడుగు బలహీన వర్గాలు పేద ప్రజల కోసం పనిచేస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో జూబ్లీహిల్స్ లో మంచి మెజారిటీతో గెలిచామన్నారు. అదే వేగంతో రాష్ట్రవ్యాప్తంగా జరగబోయే ఎన్నికల్లో 100 సీట్లకు పైగా గెలుస్తామని టీపీసీసీ చీఫ్​ నొక్కి చెప్పారు.

Also Read: ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ.. విమర్శకులకు రేవంత్ రెడ్డి గట్టి కౌంటర్!

Related News

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత దృశ్యం.. మిరప తోటల్లో సినీ తారల ఫ్లెక్సీలు!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

నకిలీ యూఎల్‌సీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు దందా కలకలం

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. మారనున్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు!

తెలంగాణలో హ్యుందాయ్ బిగ్ ప్లాన్.. రూ.8,528 కోట్లతో మెగా ప్రాజెక్ట్.. సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి!

నీ డేటా మొత్తం నా దగ్గర ఉంది పరేషాన్ కాకు.. కేటీఆర్‌ పై గజ్జెల కాంతం ఫైర్!

కరవు కట్టడి చర్యల్లో.. సీఎం రేవంత్ అట్టర్ ఫ్లాప్.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ కవిత!

Big Stories

Advertisement
×