E-Paper
Advertisement

‘ఎల్లమ్మ’లో దేవిశ్రీ ప్రసాద్ జోడీగా ఆ క్రేజీ హీరోయిన్.. దిల్ రాజు ప్లాన్ మామూలుగా లేదుగా

‘ఎల్లమ్మ’లో దేవిశ్రీ ప్రసాద్ జోడీగా ఆ క్రేజీ హీరోయిన్.. దిల్ రాజు ప్లాన్ మామూలుగా లేదుగా
Advertisement

Ellamma Movie: ‘బలగం’..అన్నా దమ్ముల ఎమోషన్ తో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ ని ఎలా షేక్ చేసిందో చెప్పక్కర్లేదు.ముఖ్యంగా  దర్శకుడు వేణు యెల్దండి తెలంగాణ మట్టి వాసనలను, భావోద్వేగాలను వెండితెరపై ఆవిష్కరించడంలో చూపించిన ప్రతిభకు ఇండస్ట్రీ మొత్తం ఫిదా అయిపోయింది. ఆ బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత వేణు తెరకెక్కిస్తున్న లేటెస్ట్ అండ్ మోస్ట్ ప్రెస్టెజీయస్ ప్రాజెక్ట్ ‘ఎల్లమ్మ’.

ఇక ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచే టాలీవుడ్‌లో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయ్. దానికి ప్రధాన కారణం, రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రంతో హీరోగా వెండితెరకు పరిచయం అవుతుండటమే. ఇప్పటివరకు తన సంగీతంతో కోట్ల మందిని ఊర్రూతలూగించిన డీఎస్‌పీ, ఇప్పుడు పూర్తి స్థాయి యాక్షన్ అండ్ ఎమోషనల్ రోల్‌లో హీరోగా కనిపించబోతుండటం ట్రేడ్ వర్గాల్లో సైతం హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement

ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న దిల్ రాజు

టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.ఇక ఈ ఊరమాస్ పాత్ర చివరికి దేవిశ్రీ ప్రసాద్‌ను వరించడంతో, ఆయన మార్కెట్‌కు ఈ కథాబలం తోడైతే హీరోగా కూడా డీఎస్‌పీకి బ్లాక్ బస్టర్ డెబ్యూ దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఇటీవల ‘ఎల్లమ్మ’కు సంబంధించి దేవిశ్రీ ప్రసాద్ స్వంత ఊరైన తూర్పుగోదావరి జిల్లా వేడంగి పరిసర ప్రాంతాల్లో జరిగిన కొన్ని లొకేషన్స్ మరియు టెస్ట్ షూట్ వీడియోలు సోషల్ మీడియాలో లీక్ కావడం అభిమానుల్లో మరింత క్యూరియాసిటీని రేపుతోంది.

Advertisement

హీరోయిన్ పాత్రకు కూడా అంతే ప్రాధాన్యం

ఈ సినిమాలో హీరో పాత్ర ఎంత క్రేజీగా ఉండబోతుందో, హీరోయిన్ పాత్రకు కూడా అంతే ప్రాధాన్యం ఉందని సమాచారం. కేవలం గ్లామర్ రోల్‌కే పరిమితం కాకుండా, అత్యంత ఇంటెన్స్ యాక్షన్, సెంటిమెంట్ డిమాండ్ చేసే ఎమోషనల్ క్యారెక్టర్ కావడంతో హీరోయిన్ ఎంపిక మేకర్స్‌కు ఒక సవాల్‌గా మారింది. కేవలం డబ్బింగ్ ఆర్టిస్ట్‌తో మేనేజ్ చేయడం కాకుండా, స్వయంగా పవర్‌ఫుల్ ఎమోషన్స్ పలికించగల నటి కోసం జల్లెడ పడుతుంది మూవీ టీమ్.

also read :‘బ్లాస్ట్‌ జోన్‌’ మూవీ రివ్యూ..యాక్షన్ కింగ్ మార్క్ మ్యాజిక్ రిపీట్ అయిందా?

ఈ క్రమంలో గతంలో పలువురు స్టార్ హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. ‘మహానటి’ చిత్రంతో జాతీయ అవార్డు అందుకున్న కీర్తి సురేష్ ఈ పాత్రకు ఆల్మోస్ట్ ఫైనల్ అయిందని ప్రచారం జరగ్గా, డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వల్ల ఆమె తప్పుకున్నట్లు తెలిసింది. ఆ తర్వాత ‘సీతారామం’, ‘హాయ్ నాన్న’ వంటి వరుస విజయాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్న మృణాల్ ఠాకూర్‌ను సంప్రదించగా, ఆమె కూడా ప్రస్తుతం హిందీ, తమిళ ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో ఈ క్రేజీ ఆఫర్ మరో నటి వద్దకు చేరింది.

ప్రముఖంగా వినిపిస్తున్న మమితా బైజు

ప్రస్తుతం ఈ ప్రెస్టెజీయస్ ప్రాజెక్ట్‌లో మలయాళ యంగ్ సెన్సేషన్ మమితా బైజు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గతేడాది విడుదలైన ‘ప్రేమలు’ సినిమాతో సౌత్ ఇండియా మొత్తాన్ని తనవైపు తిప్పుకున్న ఈ యంగ్ బ్యూటీ, తెలుగు యువతకు విపరీతంగా కనెక్ట్ అయిపోయింది. ప్రస్తుతం ఆమెతో మేకర్స్ సీరియస్ చర్చలు జరుపుతున్నట్లు టాక్ నడుస్తోంది. ఒకవేళ అంతా అనుకున్నట్లు జరిగితే, డీఎస్‌పీ సరసన మమితా బైజు జోడీ కట్టడం ఖాయం.

ఛాన్స్ దక్కేనా ?

మమితా బైజు కేవలం యూత్‌ఫుల్ లవ్ స్టోరీలకే పరిమితం కాకుండా విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ నటిగా తన వేరియేషన్స్ చూపిస్తోంది. ‘ప్రేమలు’ గ్లోబల్ హిట్ తర్వాత ఆమె కేవలం కమర్షియల్, గ్లామరస్ పాత్రలకే మొగ్గు చూపలేదు. ఇటీవల ధనుష్ ‘రాయన్’ సినిమా తర్వాత వచ్చిన ఒక తమిళ్ ప్రాజెక్ట్‌లో పల్లెటూరి యువతిగా సీరియస్ రోల్ చేసి ప్రశంసలు అందుకుంది. అలాగే ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ అనే చిత్రంలో నలభై ఏళ్ళ వయసున్న వ్యక్తిని ప్రేమించే టీనేజర్‌గా నటించి బోల్డ్ రిస్క్ తీసుకుంది. నటిగా ఆమె చూపిస్తున్న ఈ మెచ్యూరిటీ కారణంగానే, ‘ఎల్లమ్మ’లోని రా అండ్ రస్టిక్ పాత్రకు మమితా బైజు ఒక అద్భుతమైన ఛాయిస్ అవుతుందని లెక్కలు కడుతున్నారు ట్రేడ్ పండిట్స్.

చూడాలి మరి సర్క్యులేట్ అవుతున్నట్టుగా మమితా ఆన్ బోర్డ్ అవుతుందా లేక మరో ముద్దుగుమ్మ పేరు వినబడుతుందా !

also read :రామ్ చరణ్ ‘పెద్ది’లో టాక్సిక్ లవ్ స్టోరీ.. ఢిల్లీ ప్రెస్ మీట్‌లో ఊహించని లీక్!

Related News

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన బాలయ్య భామ..టార్గెట్ సెకండ్ ఇన్నింగ్స్ ?

Big Stories

Advertisement
×