E-Paper
Advertisement

Chayote Health Benefits: సాధారణ కూరగాయే కానీ అసాధారణ లాభాలు.. డైట్‌లో చేర్చుకుంటే వందమంది బలం మీ సొంతం!

Chayote Health Benefits: సాధారణ కూరగాయే కానీ అసాధారణ లాభాలు.. డైట్‌లో చేర్చుకుంటే వందమంది బలం మీ సొంతం!
Advertisement

Chayote Health Benefits: ప్రస్తుత జనరేషన్ వాళ్లకి సీమ వంకాయలు అంటే అంతగా అవగాహన లేకపోవచ్చు. కానీ ఈ కూరగాయ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. ఎక్కడున్నా వెతికి మరీ తినేస్తారు. అంతలా సీమ వంకాయలతో ప్రయోజనాలు చేకూరుతాయి మరి. ఈ కూరగాయ చూసేందుకు అచ్చం జామ‌కాయ‌ల‌ను పోలి ఉంటుంది. దీనిలో అనేక పోష‌కాలు ఉండటం వలన తరచూ  డైట్‌లో చేర్చుకోమని వైద్యులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో సీమ వంకాయలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో చూసేద్దాం రండి.

సీమ వంకాయలో ఏముంది?

ఒక క‌ప్పు ఉడ‌క‌బెట్టిన సీమ వంకాయ‌ల‌ను తింటే.. సుమారు 39 క్యాల‌రీల శ‌క్తి ల‌భిస్తుంది. దీంతోపాటు ఈ కూరగాయ ద్వారా పిండి ప‌దార్థాలు 9 గ్రాములు, ప్రోటీన్లు 2 గ్రాములు, కొవ్వు 0.5 గ్రాములు, ఫైబ‌ర్ 4 గ్రాములు ల‌భిస్తాయి. అంతేకాదు.. దీనిలో విటమిన్లు బి9, సి, కె, బి6, మాంగ‌నీస్‌, కాప‌ర్, జింక్, పొటాషియం, మెగ్నిషియం, ఐర‌న్‌, ఫాస్ఫ‌ర‌స్‌, క్యాల్షియం కూడా సమృద్ధిగా ఉంటాయి. వీటి ద్వారా మన శరీరానికి మంచి పోషకాలు అందుతాయి.

గుండె సమస్యలకు చెక్:

Advertisement

తరచూ సీమ వంకాయ‌ల‌ను మన ఆహారంలో భాగం చేసుకుంటే.. యాంటీఆక్సిడెంట్ల‌ు, విట‌మిన్ సి, ఫ్లేవ‌నాయిడ్స్‌, ఫినోలిక్ స‌మ్మేళ‌నాలను పొందవచ్చు. ఇవి మన శరీరంలోని ఫ్రీ ర్యాడిక‌ల్స్‌తో పోరాడటానికి సహకరిస్తాయి. దీంతో ఆక్సీక‌ర‌ణ ఒత్తిడి త‌గ్గి, క‌ణాల‌కు జ‌రిగే న‌ష్టం పూర్తిగా నియంత్రించబడుతుంది. ముఖ్యంగా క్యాన్స‌ర్‌, గుండె జ‌బ్బులు, నాడీ సంబంధిత వ్యాధులు వచ్చే అవ‌కాశాలు చాలా వరకు తగ్గుతాయి. సీమ వంకాయల్లో ఉండే ఫ్లేవ‌నాయిడ్స్ ర‌క్త నాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా చూడటంతో.. రక్త నాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే సీమ వంకాయల్లోని పోషకాలు హార్ట్ ఎటాక్స్ వంటివి రాకుండా అడ్డుకుంటాయి.

జీర్ణ సమస్యలు ఉండవిక:

సాధారణంగా సీమ వంకాయల్లో పిండి పదార్థాలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి.. వీటిని తింటే రక్తంలో చ‌క్కెర స్థాయిల వేగం తగ్గుతుంది. ఇది షుగ‌ర్ ఉన్న‌వారికి ఎంత‌గానో మేలు చేస్తుంది. వీటిని తరచూ మన డైట్‌లో భాగం చేసుకుంటే.. శ‌రీరం ఇన్సులిన్‌ను మ‌రింత మెరుగ్గా ఉప‌యోగించుకుంటుంది. దీంతో షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గి, డయాబెటిస్ అదుపులో ఉంటుంది. ముఖ్యంగా టైప్-2 డయాబెటిస్ ఉన్న‌వారికి సీమ వంకాయలు ఎంత‌గానో మేలు చేస్తాయి. ఈ కూరగాయలోని అధిక ఫైబ‌ర్ వల్ల పేగుల్లో మ‌లం సుల‌భంగా క‌దులుతుంది. దీంతో ‌మల‌బ‌ద్ద‌కం త‌గ్గుతుంది.  సీమ వంకాయలు ప్రీ బ‌యోటిక్ ఆహారంగానూ ప‌నిచేస్తాయి. కాబట్టి.. వీటిని తింటే జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌లు రాకుండా చూసుకోవచ్చు.

గర్భిణీ స్త్రీలకు మేలు:

Advertisement

ఈ కూరగాయలో క్యాల‌రీలు చాలా త‌క్కువ‌గా, ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. వారంలో రెండు లేదా మూడు సార్లు సీమ వంకాయలు తింటే ఎక్కువ సేపు ఆక‌లి వేయ‌దు. దీంతో ఆహారం త‌క్కువ‌గా తినవచ్చు. ఈ ప్రక్రియ అంతా బరువు త‌గ్గేందుకు స‌హాయ పడుతుంది. ముఖ్యంగా అధిక బ‌రువు ఉన్న‌వారు సీమ వంకాయ‌ల‌ను త‌ర‌చూ తీసుకుంటే.. బ‌రువును అదుపులో ఉంచుకోవచ్చు. అలాగే సీమ వంకాయలను గర్భిణీ స్త్రీలు తింటే.. ఎంత‌గానో మేలు జ‌రుగుతుంది. ఈ కాయ‌ల్లో ఫోలేట్ అధికంగా ఉండటంతో.. గ‌ర్భంలో ఉన్న శిశువు ఎదుగుద‌ల‌కు సహాయ ప‌డుతుంది. దీనిలోని యాంటీఆక్సిడెంట్ల వల్ల గర్భం దాల్చిన మహిళలకు బలం చేకూరుతుంది.

Related News

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

Big Stories

Advertisement
×