E-Paper
Advertisement

Eko movie OTT : మలయాళ మిస్టరీ థ్రిల్లర్ ‘ఎకో’ స్ట్రీమింగ్ షురూ… ఎప్పుడు, ఎక్కడ చూడవచ్చు అంటే ?

Eko movie OTT : మలయాళ మిస్టరీ థ్రిల్లర్ ‘ఎకో’ స్ట్రీమింగ్ షురూ… ఎప్పుడు, ఎక్కడ చూడవచ్చు అంటే ?
Advertisement

Eko movie OTT : మలయాళ సినిమా ప్రియులకు 2025 మరిచిపోలేని ట్రీట్స్ ఎన్నో సినిమాల రూపంలో ఇచ్చింది. అందులో ‘ఎకో’ మూవీ కూడా ఒకటి. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ గురించి మూవీ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఎట్టకేలకు మూవీ అయితే ఓటీటీలోకి వచ్చేసింది. కానీ తెలుగులో అందుబాటులో లేదు. మరి ఈ సినిమాను తెలుగులో ఏ ఓటీటీలో చూడవచ్చు? అనే డీటైల్స్ పై ఒక లుక్కేద్దాం పదండి.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

మిస్టరీ థ్రిల్లర్ ‘ఎకో’ థియేటర్స్‌లో సూపర్ హిట్ అయిన తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమాకు దింజిత్ అయ్యతన్ దర్శకత్వం వహించాడు. ఆయన ఇంతకు ముందు ‘కిష్కింధ కాండం’, ‘కేరళ క్రైమ్ ఫైల్స్ 2’ వంటి సినిమాలను రూపొందించారు. సందీప్ ప్రదీప్, నారాయణ్, సౌరభ్ సచ్దేవా, బియానా మోమిన్, వినీత్, అశోకన్, బిను పప్పు లాంటి నటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ముజీబ్ మజీద్ సంగీతం అందించారు. కేవలం 5 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 50 కోట్లు వసూలు చేసి సూపర్ హిట్ అయింది. మలయాళ సినిమా ఇండస్ట్రీలో ఈ ఏడాది ‘ఎకో’ఒక బెస్ట్ థ్రిల్లర్ అని చెప్పవచ్చు.

Advertisement

థియేటర్స్‌లో మంచి వసూళ్లు సాధించిన ‘ఎకో’ నెట్ ఫ్లిక్స్ (Netflix)లో డిసెంబర్ 20 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. కానీ మలయాళం వెర్షన్ మాత్రమే మొదట అందుబాటులోకి వచ్చింది. దీంతో తమిళం, తెలుగు, హిందీ వంటి ఇతర భాషలకు సంబంధించిన మూవీ లవర్స్ డిసప్పాయింట్ అయ్యారు. కానీ తాజా అప్డేట్ తో వాళ్ళకు కూడా గుడ్ న్యూస్ వచ్చేసింది. 2026 జనవరి 7న నుంచి ఓటీటీలో ఈ మూవీ మిగతా భాషల్లోనూ విడుదల అవుతుంది. మిస్టరీ థ్రిల్లర్ ప్రియులకు బెస్ట్ ఛాయిస్. అస్సలు మిస్ అవ్వొద్దు.

Read Also : సైకాలజిస్ట్ కి చావు రుచి చూపించే దెయ్యాలు… అత్తారింట్లోనూ వదలకుండా… మతిపోగొట్టే సస్పెన్స్ థ్రిల్లర్

స్టోరీలోకి వెళ్తే…

Advertisement

ఎకో కథ కట్టుకున్ను మిస్టీ హిల్స్‌ చుట్టూ సాగుతుంది. ఒక వృద్ధ మహిళ (బియానా మోమిన్), ఆమె కేర్ టేకర్ (సందీప్ ప్రదీప్), తప్పిపోయిన వ్యక్తి (కురియాచన్) చుట్టూ తిరుగుతుంది అతన్ని వెతుకుతూ కొందరు మనుషులు కేరళ-కర్ణాటక సరిహోద్దుల్లో ఉన్న మంచుకొండల ప్రాంతానికి వస్తారు. అక్కడ కురియాచన్ గురించి రకరకాల కథలు, పుకార్లు వినిపిస్తుంటాయి. ఈ వేటలో కొన్ని షాకింగ్ విషయాలు బయట పడతాయి. మహిళ జీవితంలోని డార్క్ సీక్రెట్స్, కేర్ టేకర్ పాస్ట్, మిస్ అయిన వ్యక్తి మోటివ్స్ అన్నీ మిస్టరీగా మారుతాయి. ఇంతకీ ఆ మిస్సింగ్ వ్యక్తి దొరికాడా ? అతను ఏమయ్యాడు ? తప్పిపోయిన వ్యక్తితో ఆ ముసలావిడకు, కేర్ టేకర్ కు సంబంధం ఏంటి ? అనేది సినిమాలో చూడాల్సిందే.

Tags

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×