E-Paper
Advertisement

Chicken Kurma: చికెన్ కుర్మా ఇలా వండారంటే అదిరిపోతుంది, అన్నం రోటీలతో తింటే ఆ రుచే వేరు

Chicken Kurma: చికెన్ కుర్మా ఇలా వండారంటే అదిరిపోతుంది, అన్నం రోటీలతో తింటే ఆ రుచే వేరు
Advertisement

చికెన్ కుర్మా అంటేనే నోరూరిపోతుంది. దీని నుంచి వచ్చే వాసన, టేస్టీ గ్రేవీ, నోట్లో కరిగిపోయేలాంటి చికెన్ ముక్కలు… అబ్బబ్బా గుర్తొస్తే ఇప్పుడే తినేయాలనిపిస్తుంది.ఇది రైస్, చపాతీ, రోటీ, నాన్ దేనితో తిన్నా కాంబినేషన్ అదిరిపోతుంది. హోటల్ స్టైల్‌లో ఇంట్లోనే సులువుగా చేసుకునేలా ఈ చికెన్ కుర్మా రెసిపీని ఇప్పుడు చూద్దాం.

చికెన్ కుర్మాకు కావాల్సిన పదార్థాలు
చికెన్ – ఒక కిలో
ఉల్లిపాయలు – మూడు
పచ్చిమిర్చి – మూడు
అల్లం వెల్లుల్లి పేస్ట్ – రెండు టేబుల్ స్పూన్లు
పెరుగు – అర కప్పు
నూనె – అవసరమైనంత
ఉప్పు – రుచికి తగినంత
పసుపు – అర టీస్పూన్
కారం పొడి – ఒక టీస్పూన్
గరం మసాలా – అర టీస్పూన్
జీలకర్ర – 1 టీస్పూన్
ధనియాలు – 1 టేబుల్ స్పూన్
గసగసాలు – 2 టేబుల్ స్పూన్లు
జీడిపప్పు – 10
కొబ్బరి తురుము – అర కప్పు
లవంగాలు – 4
యాలకులు – 3
దాల్చిన చెక్క – చిన్న ముక్క
బే ఆకు – 1

Advertisement

Also read: Chilli Paneer Recipe: చైనీస్ స్టైల్‌లో చిల్లి పనీర్ రెసిపీ, దీన్ని ఎలా చేయాలంటే

చికెన్ కుర్మా రెసిపీ
1. ముందుగా ఒక కళాయిని స్టవ్ మీద పెట్టి జీలకర్ర, ధనియాలు, గసగసాలు, జీడిపప్పు వేసి వేయించాలి. ఇప్పుడు కొబ్బరి తురుము వేసి ఒక నిమిషం కలపాలి.
2. చల్లారిన తర్వాత ఈ పదార్థాలన్నింటిని కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇదే చికెన్ కుర్మాకు ముఖ్యమైన రుచికరమైన మసాలా.
3. స్టవ్ మీద ఒక లోతైన కళాయి పెట్టి నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బే ఆకు వేసి వాసన వచ్చే వరకు వేయించాలి.
4. తరువాత తరిగిన ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. ఉల్లిపాయలు బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి పచ్చి వాసన పోయే వరకు కలపాలి.
5. ఇప్పుడు చికెన్ ముక్కలు వేసి బాగా కలపాలి. చికెన్ రంగు మారే వరకు మద్య మద్యలో కలుపుతూ వేయించాలి.
6. ఇప్పుడు పసుపు, కారం పొడి, ఉప్పు వేసి మరోసారి కలపాలి.
7. తరువాత ముందే సిద్ధం చేసుకున్న కొబ్బరి గసగసాల మసాలా పేస్ట్ వేసి నెమ్మదిగా కలపాలి.
8. మంట తగ్గించి పెరుగు వేసి బాగా కలపాలి అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి మధ్య మంటపై ఉడకనివ్వాలి.
9. చికెన్ పూర్తిగా ఉడికిన తరువాత గ్రేవీ చిక్కబడుతుంది. చివరగా గరం మసాలా వేసి రెండు నిమిషాలు మరిగించాలి.

Advertisement

ఈ రుచికరమైన చికెన్ కుర్మాను వేడిగా రైస్, జీరా రైస్, చపాతీ, రోటీ లేదా నాన్‌తో తింటే చాలా రుచికరంగా ఉంటుంది. పైన కొత్తిమీర ఆకులు చల్లితే రుచి మరింతగా అదిరిపోతుంది. ఎక్కువ రిచ్ టేస్ట్ కావాలంటే జీడిపప్పులు ఎక్కువ వేయాలి. ఎక్కువ కారంగా కావాలంటే పచ్చిమిర్చి లేదా కారం పొడి ఎక్కువ వేయాలి.

Related News

ఆటిజం ఉన్న పిల్లలకు ఏకాగ్రత మెరుగుపరిచే టెక్నిక్.. కొత్త అధ్యయనంలో ఆసక్తికర ఫలితాలు

ఆన్‌లైన్‌లో యువతితో ప్రేమ.. ప్రియురాలిని కలవడానికి 1900 కిమీ ప్రయాణం.. ఏఐ దెబ్బకు మైండ్ బ్లాక్

ఘాటు ఘాటుగా మష్రూమ్ పెప్పర్ ఫ్రై.. ఒక్కసారి ఇలా ట్రై చేస్తే టేస్ట్ అద్భుతం!

వంట రాని వాళ్లు కూడా నిమిషాల్లో చేసేయగల సూపర్ టేస్టీ పన్నీర్ భుర్జీ రెసిపీ!

థీమ్ పార్కుకు వెళుతున్నారా? జాగ్రత్త రోలర్ కోస్టర్ రైడ్స్‌తో మెదడుకు ప్రమాదం

పిల్లలు వద్దనుకోవడం స్వార్థమా? సమాజం చేసే విమర్శలకు సమాధానమిదే

భార్యా, తల్లా.. ఇద్దరి మధ్య నలిగిపోకుండా భర్త ఏం చేయాలి?

పిల్లల ఆరోగ్యంతో చెలగాటం వద్దు.. బేబీ ఫుడ్‌లో చక్కెరపై FSSAI కీలక ఆదేశాలు!

Big Stories

Advertisement
×