E-Paper
Advertisement

Peddi special song: పెద్ది స్పెషల్ సాంగ్ కోసం స్టార్ హీరోయిన్.. వర్కౌట్ అయ్యేనా?

Peddi special song: పెద్ది స్పెషల్ సాంగ్ కోసం స్టార్ హీరోయిన్.. వర్కౌట్ అయ్యేనా?
Advertisement

Peddi Special Song: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charan Tej) ప్రస్తుతం బుచ్చిబాబు సానా(Bucchi Babu Sana) దర్శకత్వంలో పెద్ది (Peddi Movie)అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గ్రామీణ క్రీడా నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాలో చరణ్ మాస్ లుక్ లో కనిపించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా మార్చి 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్ర బృందం ఇటీవల అధికారకంగా వెల్లడించారు. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సినిమా అనుకున్న సమయానికి విడుదల కావడం లేదని వాయిదా పడుతుందంటూ వార్తలు బయటకు వస్తున్నాయి.

పెద్ది వాయిదా పడుతుందా?

ఈ సినిమా విషయంలో డైరెక్టర్ బుచ్చిబాబు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరి షూటింగ్ పనులను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే షూటింగ్ మరింత ఆలస్యం అవుతుందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాని వాయిదా వేస్తున్నారంటూ వార్తలు బయటకు వస్తున్నాయి కానీ ఇప్పటివరకు ఈ సినిమా విడుదల వాయిదా గురించి చిత్ర బృందం ఎక్కడ స్పందించలేదు. ఇకపోతే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ పూర్తి చేసి ఎడిటింగ్ కోసం పంపించారని , మరొక నెల రోజులలో సెకండ్ హాఫ్ కూడా పూర్తి చేయాలన్న ఆలోచనలో బుచ్చిబాబు ఉన్నట్టు తెలుస్తుంది . మరి అనుకున్న సమయానికే షూటింగ్ పూర్తి అయితే యధావిధిగా ఈ సినిమాని విడుదల చేస్తారా? లేదా వాయిదా వేస్తారా? అనేది తెలియాల్సి ఉంది.

స్పెషల్ సాంగ్ ప్లాన్ చేసిన బుచ్చి బాబు..

Advertisement

ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరొక వార్తా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది ఈ సినిమాలో బుచ్చిబాబు ఒక స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశారని ఈ స్పెషల్ సాంగ్ కోసం పలువురు హీరోయిన్లను సంప్రదించారని తెలుస్తుంది. ముందుగా సమంత స్పెషల్ సాంగ్ చేయబోతున్నారంటూ వార్తలు వచ్చాయి . అందులో నిజం లేదని ఆ తర్వాత తమన్న ,పూజా హెగ్డే వంటి వారి పేర్లు కూడా బయటకు వచ్చాయి. అయితే తాజాగా మరొక హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం మృణాళ్ ఠాకూర్ (Mrunal Thakur)రంగంలోకి దిగబోతున్నారంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

చరణ్ కోసం మృణాళ్ ఠాకూర్..

Advertisement

ఇలా రామ్ చరణ్ పెద్ది సినిమాలో మృణాళ్ స్పెషల్ స్టెప్పులు వేయబోతున్నారని విషయం తెలిసిన అభిమానులు షాక్ అవుతున్నారు. అసలు వీరిద్దరీ కాంబినేషన్ వర్కౌట్ అయ్యేనా అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ స్పెషల్ సాంగ్ గురించి వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలి అంటే స్వయంగా ఈ వార్తలపై చిత్ర బృందం స్పందించాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ జోడిగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఇటీవల విడుదల చేసిన చికిరి చికిరి అనే పాట 200 మిలియన్లకు పైగా వ్యూస్ కైవసం చేసుకుని సినిమా పట్ల భారీగా అంచనాలను పెంచేసింది. ఇక త్వరలోనే ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ కూడా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Also Read: Susmitha Konidela: చరణ్ నా టార్గెట్ కాదు..అది నా కోరిక మాత్రమే: సుస్మిత కొణిదెల

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×