E-Paper
Advertisement

Tollywood: తమకంటే వయసులో చిన్న చెల్లెళ్లను కలిగి ఉన్న హీరోయిన్స్ వీళ్ళే!

Tollywood: తమకంటే వయసులో చిన్న చెల్లెళ్లను కలిగి ఉన్న హీరోయిన్స్ వీళ్ళే!
Advertisement

Tollywood: ఈ మధ్యకాలంలో హీరోయిన్లు ఒకరి తరువాత ఒకరు తమ వ్యక్తిగత విషయాలను.. కుటుంబ విషయాలను బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మొన్నటికీ మొన్న ఎవరో కూడా తెలియని డింపుల్ హయతి (Dimple hayathi) హీరోయిన్ గానే పరిచయమయ్యింది . అలాంటి ఈమె ఇటీవల తాను నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా సమయంలో తాను లెజెండ్రీ దిగ్గజ దర్శకులు దాసరి నారాయణరావు మనవరాలిని అని, సీనియర్ హీరోయిన్ ప్రభా తన నానమ్మ అని చెప్పి అందరిని ఒక్కసారిగా ఆశ్చర్యపరిచింది. ఇక ఇదే ఆశ్చర్యం అనుకుంటే.. ఇప్పుడు మరో హీరోయిన్ నిధి అగర్వాల్ (Nidhhi agerwal) తనకు వయసులో తనకంటే ఏడేళ్లు చిన్నదైనా చెల్లెలు ఉందని చెప్పి మరో బాంబు పేల్చింది ఈ ముద్దుగుమ్మ.

చిట్టి చెల్లెమ్మలను కలిగి ఉన్న హీరోయిన్స్ వీళ్ళే..

గత ఏడాది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమాలో హీరోయిన్ గా నటించి, తన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకుంది. “పంచమి” క్యారెక్టర్ లో ఒదిగిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఈ ఏడాది స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) హీరోగా, మారుతీ దర్శకత్వంలో వచ్చిన ‘ది రాజాసాబ్’ అనే సినిమాలో నటించింది. జనవరి 9వ తేదీన సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది.ప్రస్తుతం మరో కొన్ని ప్రాజెక్టులలో బిజీగా ఉన్న ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన చెల్లి గురించి చెప్పుకొచ్చింది.

Advertisement

నిధి అగర్వాల్ మాట్లాడుతూ.. “నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా పెళ్లి అవసరం లేదు. కానీ నాకు నలుగురు పిల్లలు కావాలి. సుస్మిత సేన్ లాగా నేను కూడా పిల్లల్ని దత్తత తీసుకోవాలనుకున్నాను.కానీ పిల్లల్ని దత్తత తీసుకున్న తర్వాత వేరే ప్రపంచంలో బ్రతకాల్సి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు సాధ్యపడదు. అయితే నాకు పిల్లలపై ఆసక్తి కలగడానికి కారణం నా చెల్లెలు. నిజానికి నా తల్లిదండ్రులు నా తర్వాత ఇంకొకరు కావాలని కోరుకోలేదు. అయితే నేను మాత్రం చెల్లి కావాలని ప్రతి రోజు పూజ గదిలో లెటర్ రాసి పెట్టేదాన్ని. దేవుడు నా మొర ఆలకించి.. నేను పుట్టిన 7 ఏళ్ల తర్వాత నాకు ఒక చిట్టి చెల్లెలు ఇచ్చాడు. ఆమెను చెల్లిగా కాకుండా కూతురిలా చూసుకుంటున్నాను” అని చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచింది నిధి అగర్వాల్. మొత్తానికైతే తనకంటే వయసులో ఏడేళ్ల చిన్నదైనా చెల్లి ఉందని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ALSO READ:Balakrishna: 65 ఏళ్లల్లో కూడా జోరు పెంచిన బాలయ్య.. ఆ లైనప్ ఏంటి మావా!

నిధితోపాటు రష్మిక కూడా..

Advertisement

ఇకపోతే ఇండస్ట్రీలో తనకంటే వయసులో చాలా చిన్న చెల్లిని కలిగి ఉన్న మరో హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika mandanna). గత ఏడాది భాషతో సంబంధం లేకుండా ఏకంగా ఐదు చిత్రాలలో నటించి బ్లాక్ బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకున్న ఈమెకి కూడా ఏకంగా తనకంటే వయసులో 16 సంవత్సరాల చిన్నదైన ఒక చెల్లెలు ఉంది. ఆమె షిమాన్ మందన్న. రష్మిక కూడా తన చెల్లిని ఎంత ప్రేమగా చూసుకుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలా ఈ ఇద్దరు హీరోయిన్లు కూడా తమకంటే వయసులో చాలా చిన్న అమ్మాయిలను చెల్లెళ్లుగా కలిగి ఉండడం గమనార్హం.. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×