E-Paper
Advertisement

Cloves For Diabetes: వీటితో షుగర్ ఇట్టే తగ్గిపోతుంది తెలుసా ?

Cloves For Diabetes: వీటితో షుగర్ ఇట్టే తగ్గిపోతుంది తెలుసా ?
Advertisement

Cloves For Diabetes: ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో మధుమేహం కూడా ఒకటి.  ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎక్కువ మందిలో షుగర్ లెవల్స్ ‌అదుపులో ఉండవు. అలాంటి వారు రోజువారి డైట్‌లో లవంగం వాడితే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. షుగర్ నియంత్రణకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మధుమేహ వ్యాధి గ్రస్తులు లవంగాలను ఎలా వాటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెసుకుందాం.

లవంగాల్లో అనేక ఔషధ గుణాలుంటాయి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా లవంగాల్లో ఉండే యూజినాల్ అనే సమ్మేళనం రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంతో పాటు ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. దీంతో పాటు లవంగాలను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

Advertisement

లవంగాలను ఎలా తీసుకోవాలి..
రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉండాలంటే ముందుగా ఒక బౌల్‌లో గ్లాస్ వాటర్ తీసుకుని అందులో ఆరు నుంచి ఎనిమిది లవంగాలను వేసి స్టౌవ్ పై మరిగించాలి. ఆ తర్వాత వాటర్‌ను కాచుకోవాలి. గోరువెచ్చగా మారిన తర్వాత ఆ నీటిని తాగాలి దీని మూడు నెలల పాటు వాడితే మంచి రిజల్ట్ కనిపిస్తుంది. అంతే కాకుండా షుగర్ తగ్గుతుంది.

గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడంలో లవంగాలు ఎంతగానో ఉపయోగపడతాయి. గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో ఇవి సహాయపడగలవని కొన్ని అధ్యయనాల ద్వారా రుజువైంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.

Advertisement

ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను తగ్గించడంలో లవంగాలు ఉపయోగపడతాయి. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది మధుమేహం మేనేజ్‌మెంట్‌లో ప్రధానమైంది.

Also Read: అల్లంతో కీళ్ల నొప్పులు మాయం

లవంగాలు మంచి యాంటీఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉంటాయి. ఇవి శరీరంలో ఉత్పన్నమయ్యే ఫ్రీ రేడికల్స్‌ను నయం చేస్తాయి.లవంగాలు శరీరంలోని నాడీ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు రక్త ప్రసరణలో సహాయపడతాయి. ఫలితంగా రక్తపోటును కూడా తగ్గిస్తాయి.

Related News

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

భోజనం చేసినా, ఏదైనా తాగినా వెంటనే లిప్‌స్టిక్ పాడవుతోందా? రోజంతా పెదాలు కలర్‌ఫుల్‌గా ఉండేందుకు చిట్కాలు

ప్రతిరోజూ హెల్మెట్ ధరిస్తే జుట్టు డ్యామేజ్.. ఈ సులభమైన హెయిర్ కేర్ చిట్కాలు మీ కోసం

పాము, ముంగీస లాంటి స్వభావం వీరిది.. ఈ తేదీల్లో పుట్టినవారు పెళ్లి తరువాత గొడవపడుతూనే ఉంటారు

మద్యం లేదా సిగరెట్.. ఆరోగ్యానికి ఏది ఎక్కువ ప్రమాదకరం.. ఏది ముందుగా మానేయాలి?

ఉద్యోగం చేసే భార్యభర్తల మధ్య ఒత్తిడి, గొడవలు.. దాంపత్య జీవితం కాపాడుకోవడానికి ఇలా చేయడం తప్పనిసరి

ఆలుగడ్డలు 5 నెలల పాటు తాజాగా ఉండాలా? అయితే ఆ ప్రదేశంలో పెట్టండి!

రోగాలు మాయం.. వర్షాకాలంలో కచ్చితంగా తినాల్సిన కూరగాయలు

Big Stories

Advertisement
×