E-Paper
Advertisement

Coffee vs Green Tea: కాఫీ లేదా గ్రీన్ టీ.. ఈ రెండింట్లో ఏది ఉదయం తాగితే ఎక్కువ ఆరోగ్యం?

Coffee vs Green Tea: కాఫీ లేదా గ్రీన్ టీ.. ఈ రెండింట్లో ఏది ఉదయం తాగితే ఎక్కువ ఆరోగ్యం?
Advertisement

ఉదయం లేవగానే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది టీ లేదా కాఫీ. కొందరు కాఫీ లేక రోజు మొదలుపెట్టరు. మరికొందరు గ్రీన్ టీని ఆరోగ్య రహస్యంగా భావిస్తారు. అయితే ఈ రెండింటిలో ఆరో్యానికి ఏది మంచిదనే చర్చ చాలా కాలంగా కొనసాగుతోంది. తాజా నివేదికల ప్రకారం కాఫీ, గ్రీన్ టీ రెండింటిలోనూ ఆరోగ్యానికి ఉపయోగపడే యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే శరీర తత్వం, అవసరం బట్టి ఎంపిక మారుతుందని సూచిస్తున్నారు.

కాఫీ తాగితే ఏమవుతుంది?
కాఫీలో కెఫిన్ మోతాదు ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇది వెంటనే ఎనర్జీ ఇచ్చినట్టు అనిపిస్తుంది. అలసట తగ్గి ఫోకస్ పెరగడంలో కూడా సహాయపడుతుందని చెబుతున్నారు. ఉద్యోగం, చదువు, వ్యాయామం చేసే వారికి ఇది తాత్కాలిక ఉత్సాహాన్ని ఇస్తుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం కాఫీ తాగే వారిలో టైప్-2 డయాబెటిస్, లివర్ సమస్యలు, కొన్ని నరాల సంబంధ వ్యాధుల ప్రమాదం తక్కువగా ఉండొచ్చని సమాచారం. కానీ ఎక్కువ కాఫీ తాగితే ఆందోళన, గుండె వేగం పెరగడం, నిద్రలేమి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

Also read: Hair fall: ఉల్లి రసం లేదా ఉల్లి నూనె.. ఈ రెండింటిలో ఏది జుట్టు రాలడాన్ని ఆపుతుంది?

గ్రీన్ టీలో ఏముంటుంది?
మరోవైపు గ్రీన్ టీలో కెఫిన్ తక్కువగా ఉంటుంది. ఇందులో ఎల్-థియానిన్ అనే పదార్థం ఉండటం వల్ల మనసు ప్రశాంతంగా ఉండేందుకు సహాయపడుతుందని చెబుతున్నారు. గ్రీన్ టీలో ఉండే క్యాటెకిన్స్, ఈజీసీజీ వంటి యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించడంలో కూడా ఇవి సహాయపడొచ్చు. బరువు తగ్గాలని చూసే వారిలో కూడా గ్రీన్ టీకి ఆదరణ పెరుగుతోంది. కొందరు నిపుణులు దీర్ఘకాల ఆరోగ్యానికి గ్రీన్ టీ కొంచెం మెరుగైన ఎంపిక కావచ్చని అంటున్నారు.

Advertisement

అయితే ఈ రెండింటిని ఎలా తీసుకుంటున్నామన్నది కూడా చాలా ముఖ్యం. ఎక్కువ చక్కెర, క్రీమ్, ఫ్లేవర్ సిరప్స్ కలిపితే ఆరోగ్య ప్రయోజనాలు తగ్గిపోతాయి. బ్లాక్ కాఫీ లేదా చక్కెర తక్కువ గ్రీన్ టీ మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే ఖాళీ కడుపుతో ఎక్కువ కాఫీ తాగితే అసిడిటీ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. గ్రీన్ టీని కూడా అధికంగా తాగడం సరైంది కాదని హెచ్చరిస్తున్నారు. కొందరికి ఎక్కువ గ్రీన్ టీ వల్ల వికారం లేదా కాలేయ సమస్యలు రావచ్చని నివేదికలు చెబుతున్నాయి.

సోషల్ మీడియాలో కూడా ఈ విషయంపై పెద్ద చర్చ జరుగుతోంది. చాలామంది కాఫీ వల్ల వెంటనే ఎనర్జీ వస్తుందని చెబుతుంటే, మరికొందరు గ్రీన్ టీ వల్ల ప్రశాంతమైన ఫీలింగ్ వస్తుందని అంటున్నారు. రెడిట్‌లో కొందరు కాఫీ వల్ల ఆందోళన పెరిగిందని, గ్రీన్ టీ మాత్రం తేలికగా అనిపించిందని తమ అనుభవాలు పంచుకున్నారు. అందుకే ఏది మంచిదనే విషయం ఒక్క సమాధానంతో చెప్పలేమని నిపుణులు చెబుతున్నారు. వెంటనే ఉత్సాహం కావాలనుకునే వారికి కాఫీ సరిపోతే, ప్రశాంతమైన ఎనర్జీతో పాటు దీర్ఘకాల ఆరోగ్య ప్రయోజనాలు కోరుకునే వారికి గ్రీన్ టీ మంచి ఎంపికగా మారొచ్చని సూచిస్తున్నారు.

Related News

హెవీ ఇయర్‌రింగ్స్‌తో చెవి నొప్పి వస్తుందా? చెవి రంధ్రాలు సాగకుండా ఈ సింపుల్ ట్రిక్ పాటించండి

ఒక్క పన్ను పీకడానికి రూ.2.25 లక్షలా.. అదే ఇండియాలో అయితే?

డెస్క్ జాబ్ చేస్తున్నారా? ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే సమస్యలు ఇవే

తగ్గేదెలే.. ఈ తేదీల్లో పుట్టినవారు ఆత్మగౌరవం విషయంలో అసలు రాజీపడరు

స్కూల్‌కు వెళ్లే సమయం అయినా పిల్లలు నిద్రలేవడం లేదా? ఈ 5 టిప్స్‌తో మార్నింగ్ రొటీన్ మార్చండి

గుండెపోటు ముప్పును 30 శాతం తగ్గించగల పిల్.. తాజా అధ్యయనంలో అద్భుత ఫలితాలు

వర్షాకాలంలో తరచూ అనారోగ్యానికి గురవుతున్నారా? రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి ఈ పుడ్స్

రక్తంలో చక్కెర పెరగకుండా ఉండాలంటే ఆపిల్ తినాలా? పియర్ తినాలా?

Big Stories

Advertisement
×