E-Paper
Advertisement

30 ఏళ్ల ‘ఒకే నంబర్’ మ్యాజిక్.. 390 కోట్ల జాక్‌పాట్

30 ఏళ్ల ‘ఒకే నంబర్’ మ్యాజిక్.. 390 కోట్ల జాక్‌పాట్
Advertisement

Lottery Success : అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో ఎవరూ చెప్పలేరు. కానీ, వర్జీనియాకు చెందిన ఈ దంపతుల కథ వింటే మాత్రం “నమ్మకం ఉంటే ఏదైనా సాధ్యమే” అని అనిపించక మానదు. అవును..మూడు దశాబ్దాల ఎదురుచూపులు, ఎన్నో ఓటములు.. కానీ చివరకు వీళ్ళకి దక్కిన విజయం మాత్రం ప్రపంచమే షాక్ అయ్యేలా చేసింది.

గత 20 ఏళ్లకు పైగా వారు ప్రతి వారం

Advertisement

మాములుగా లాటరీ ఆడేవారు ఏం చేస్తారు..ఒకసారి నంబర్ రాకపోతే, మరుసటి సారి నంబర్లు మార్చేస్తుంటారు. “ఈ నంబర్ మనకు అ కలిసి రాదులే” అని వదిలేస్తారు. కానీ మిల్టన్ మరియు మెలిండా మాత్రం ఒకే నంబర్ పట్టుకొని వేలాడారు.అవును ..గత 20 ఏళ్లకు పైగా వారు ప్రతి వారం అదే నంబర్లతో టికెట్లు కొనేవారు మరి.అయితే ఆ నంబర్ సెట్ వెనుక వారి జీవితంలోని ముఖ్యమైన తేదీలు (పుట్టిన రోజులు లేదా పెళ్లి రోజు వంటివి) ఉన్నాయని సమాచారం. ఇక చాలామంది ఫ్రెండ్స్ ,రిలేటివ్స్ “ఎందుకు వేస్ట్.. నంబర్లు మార్చి చూడొచ్చుగా” అని ఉచిత సలహాలు ఇచ్చినా, ఈ జోడీ మాత్రం తమ ‘లక్కీ నంబర్ల’నే నమ్ముకకోవడం విశేషం.

ఒకేసారి 41 మిలియన్ డాలర్ల భారీ మొత్తం 

Advertisement

వారు గెలుచుకున్న లాటరీ పేరులోనే ఉంది అసలు కిటుకు. ‘క్యాష్4లైఫ్’ అంటే గెలిచిన వారికి లైఫ్ టైమ్ కంటిన్యూ గా వచ్చే ఇన్ కమ్ ఆప్షన్ ఉంటుంది. అయితే మిల్టన్ జోడీ మాత్రం “లంప్ సమ్” (Lump Sum)ఆప్షన్ కే మొగ్గు చూపారు,ఫలితంగా ఒకేసారి 41 మిలియన్ డాలర్ల భారీ మొత్తాన్ని అందుకునే అవకాశం దక్కిందట. ఇక ట్యాక్స్‌లు పోను మిగిలిన సొమ్ముతో వారు ఏకంగా ఏడు తరాలకు సరిపడా ఆస్తిని కూడబెట్టినట్లయిందన్న మాట.

also read :బోసిపోయిన బాక్సాఫీస్ ..బలైపోయిన ఎగ్జిబిటర్స్ …ఈ వారమూ ఇంతేనా?

ఆ రోజు ఏం జరిగింది?

ఫలితాలు వచ్చిన రోజు రాత్రి మిల్టన్ తన ఫోన్‌లో నంబర్లను సరిచూసుకున్నారట. మొదటి నంబర్ మ్యాచ్ అయింది.. రెండోది.. మూడోది.. అలా ఆరు నంబర్లు వరుసగా సరిపోవడంతో ఆయన గుండె ఒక్క క్షణం ఆగిపోయినంత పని అయింది. వెంటనే మెలిండాను నిద్రలేపి విషయం చెప్పారు. ఇద్దరూ కలిసి పదిసార్లు టికెట్‌ను సరిచూసుకున్నాక కానీ వారికి నమ్మకం కలగలేదు. ఆ రాత్రంతా వారు ఆనందంతో నిద్రపోలేదని మర్చిపోలేని క్షణాలని వర్జీనియా లాటరీ అధికారులతో పంచుకుంది ఈ జోడీ.

డబ్బుతో ఏం చేస్తారంటే 

ఇకపై ఉద్యోగాల కోసం కష్టపడాల్సిన అవసరం లేదని, ప్రశాంతమైన రిటైర్మెంట్ జీవితాన్ని గడుపుతామని,తమ పిల్లలు పడుతున్న కష్టాలను చూడలేకపోతున్నామని, ఇప్పుడు వారందరికీ ఈ డబ్బుతో మంచి బిజినెస్ పెట్టిస్తామంటూ ఎమోషనల్ అయిపోతుంది మెలిండా జోడీ.ఇక ఇందులో కొంత భాగాన్ని సమాజ సేవకు, అవసరమైన వారికి సాయం చేయడానికి కూడా కేటాయించబోతున్నట్లు సమాచారం.

ఇక ఈ వార్త ఫేస్‌బుక్, ఎక్స్ (ట్విట్టర్)లో సెన్సేషన్‌గా మారింది. “30 ఏళ్లు అంటే మామూలు విషయం కాదు.. వారి ఓపికకు హాట్సాఫ్” అని ఒకరు కామెంట్ చేయగా, “నేను కూడా రేపటి నుంచి ఒకే నంబర్‌ను నమ్ముకుంటా” అని మరికొందరు ఫన్నీగా పోస్ట్లు పెట్టడం విశేషం.

ఏది ఏమైనా అదృష్టం అనేది అందరికీ రాకపోవచ్చు, కానీ వచ్చినప్పుడు మాత్రం ఇలాగే గంపగుత్తగా వచ్చేస్తుందని ప్రూవ్ చేసింది ఈ జోడీ. మొత్తానికి ఈ వర్జీనియా కపుల్ ఈ సక్సెస్ స్టోరీ ఇప్పుడు వరల్డ్ వైడ్ గా ఉన్న లాటరీ ప్రియులకి మంచి బూస్టప్ ఇచ్చేదే !

also read :రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్ 2’ మానియా.. 50 డేస్.. అన్‌స్టాపబుల్ రికార్డ్స్!

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×