E-Paper
Advertisement

కడుపు ఉబ్బరం, గ్యాస్ వేధిస్తున్నాయా? మీరు చేసే ఈ చిన్న తప్పులే కారణం!

కడుపు ఉబ్బరం, గ్యాస్ వేధిస్తున్నాయా? మీరు చేసే ఈ చిన్న తప్పులే కారణం!

Gas and Indigestion Mistakes: నేటి లైఫ్ స్టైల్ లో వేధించే అతిపెద్ద ఆరోగ్య సమస్య ఏంటంటే.. గ్యాస్, అజీర్ణం , ఉబ్బరం . చాలా సార్లు మనం జంక్ ఫుడ్ తినకపోయినా..ఇంట్లోనే హెల్తీగా వండుకుని తిన్నా కూడా ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తూనే ఉంటాయి. అప్పుడు మనం “అదేంటి నేను బాగానే తింటున్నా కదా, అయినా ఈ గ్యాస్ ఏంటి?” అని తల పట్టుకుంటాం. కానీ.. అసలు సమస్య మనం తినే ఆహారంలో లేదు, మనం తింటున్న ‘విధానం’, తినేటప్పుడు చేసే కొన్ని ‘చిన్న చిన్న తప్పుల’ లోనే ఉంది. మరి ఆ తప్పులు ఏంటో ఇప్పుడు క్లియర్ తెలుసుకుందాం.

గ్యాస్ , అజీర్ణం కలిగించే 5 ప్రధాన ఆహారపు తప్పులు:
మన జీర్ణవ్యవస్థ ఒక పద్ధతి ప్రకారం పని చేస్తుంది. దానికి విరుద్ధంగా మనం కొన్ని పనులు చేసినప్పుడు కడుపులో యాసిడ్స్ ఇంబ్యాలెన్స్ అయి గ్యాస్ తయారవుతుంది. అవేంటంటే..

1. నమలకుండా గబగబా మింగేయడం:
ఈ రోజుల్లో అందరికీ టైమ్ లేదు. ఆఫీస్ అర్జెంట్ అనో లేదా రీల్స్ చూస్తూనో ప్లేట్‌లోని అన్నాన్ని కేవలం 5 నిమిషాల్లోనే లాగించేస్తుంటారు.

ఏమవుతుంది?: మనం ఆహారాన్ని సరిగ్గా నమలనప్పుడు, ముక్కలు ముక్కలుగా ఉన్న ఆహారం కడుపులోకి వెళ్తుంది. దాన్ని అరిగించడానికి పొట్ట ఎక్కువ యాసిడ్‌ను రిలీజ్ చేయాల్సి వస్తుంది. పైగా వేగంగా తినడం వల్ల ఆహారంతో పాటు ఎక్కువ గాలి కూడా లోపలికి వెళ్లి కడుపు ఉబ్బరానికి దారితీస్తుంది.

పరిహారం: ప్రతి ముద్దను కనీసం 24 సార్లు బాగా నమిలి, లాలాజలంతో కలిపి మింగడం అలవాటు చేసుకోండి.

2. భోజనం చేస్తూ.. లేదా తిన్న వెంటనే నీళ్లు తాగడం:
చాలా మందికి తింటున్నప్పుడు పక్కన వాటర్ బాటిల్ ఉండాల్సిందే. ప్రతి రెండు ముద్దలకి ఒక గ్లాస్ నీళ్లు తాగుతుంటారు.

ఏమవుతుంది?: మనం తిన్న ఆహారాన్ని అరిగించడానికి కడుపులో ‘జఠరాగ్ని’ (జీర్ణ రసాలు) పుడుతుంది. మనం తినేటప్పుడు లేదా తిన్న వెంటనే లీటర్ల కొద్దీ నీళ్లు తాగితే ఆ జీర్ణ రసాలు పలచనైపోతాయి. దీని వల్ల ఆహారం అరగకుండా పొట్టలోనే ఉండిపోయి, కుళ్లిపోయి గ్యాస్‌గా మారుతుంది.

పరిహారం: భోజనానికి అరగంట ముందు లేదా తిన్న 45 నిమిషాల తర్వాత మాత్రమే నీళ్లు తాగాలి.

3. తిన్న వెంటనే బెడ్‌పై వాలిపోవడం:
రాత్రిపూట డిన్నర్ ముగించగానే అలసటగా ఉందని చాలా మంది నేరుగా బెడ్‌పైకి వెళ్లి పడుకుంటారు.

ఏమవుతుంది?: మనం నిటారుగా కూర్చున్నప్పుడు గురుత్వాకర్షణ శక్తి వల్ల ఆహారం కిందకి వెళ్తుంది. కానీ తిన్న వెంటనే పడుకుంటే, కడుపులోని యాసిడ్లు వెనక్కి ప్రవహించి , గుండెల్లో మంట మరియు తీవ్రమైన అజీర్ణాన్ని కలిగిస్తాయి.

పరిహారం: తిన్న తర్వాత కనీసం 15-20 నిమిషాల పాటు ఇంట్లోనే మెల్లగా వజ్రాసనంలో కూర్చోవడం లేదా చిన్నగా వాకింగ్ (శతపావళి) చేయడం చాలా మంచిది.

4. విరుద్ధ ఆహారాలు కలపడం:
నోటికి రుచిగా ఉందని చెప్పి కొన్ని ఆహారాలను కలిపి తినడం వల్ల పొట్టలో పెద్ద యుద్ధమే జరుగుతుంది.

ఏమవుతుంది?: ఉదాహరణకు, పండ్లను భోజనంతో పాటు లేదా భోజనం చేసిన వెంటనే తినడం. పండ్లు చాలా త్వరగా అరిగిపోతాయి. కానీ అన్నం అరగడానికి టైమ్ పడుతుంది. అన్నంతో పండ్లు కలిసినప్పుడు అవి లోపల పులిసిపోయి విపరీతమైన గ్యాస్‌ను రిలీజ్ చేస్తాయి. అలాగే పాలు-చేపలు, పుల్లటి పండ్లు-పాలు లాంటి కాంబినేషన్లు కూడా అజీర్ణానికి కారణమవుతాయి.

పరిహారం: పండ్లను ఎప్పుడూ విడిగా (స్నాక్ టైమ్‌లో) మాత్రమే తినండి.

5. రాత్రి పూట లేట్‌గా.. హెవీగా తినడం:
రాత్రి 10 లేదా 11 గంటలకి బిర్యానీలు, ఫ్రైడ్ రైస్‌లు వంటి పీచుపదార్థం లేని మైదా ఫుడ్స్ తినడం ఇప్పటి ట్రెండ్.

ఏమవుతుంది?: సూర్యాస్తమయం తర్వాత మన జీర్ణవ్యవస్థ స్లో అవుతుంది. ఆ టైమ్‌లో హెవీ ఫుడ్స్ వేస్తే పొట్ట దాన్ని అరిగించలేక చతికిలపడుతుంది. ఉదయం లేవగానే కడుపు నొప్ఫి, మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం, రోజంతా గ్యాస్ రావడం జరుగుతుంది.

“రోగాలు అన్నీ పొట్ట నుండే మొదలవుతాయి” అని పెద్దలు ఊరికే అనలేదు. మన గట్ హెల్త్ బాగుంటేనే మనం యాక్టివ్‌గా ఉండగలం. గ్యాస్ పెరిగినప్పుడు గుండెల్లో నొప్పి రావడం, తలనొప్పి రావడం కూడా జరుగుతుంది. అందుకే.. ఇకపై ఏం తింటున్నాం అనే దానితో పాటు ఎలా తింటున్నాం అనే దానిపై కూడా ఫోకస్ పెట్టండి. పైన చెప్పిన చిన్న చిన్న తప్పులను సరిదిద్దుకోండి, గ్యాస్ టాబ్లెట్లతో పని లేకుండా మీ జీర్ణశక్తిని సూపర్ ఫాస్ట్‌గా మార్చుకోండి!

 

Related News

బీపీ, షుగర్‌ని ఈజీగా మేనేజ్ చేయొచ్చు.. మీ లైఫ్‌స్టైల్‌లో ఈ మార్పులు చేసుకోండి!

మారుతున్న వాతావరణంతో ముప్పు..

వాతావరణం మారడం వల్ల తరచుగా.. తలనొప్పి వస్తోందా?

పొద్దున్నే టీతో రస్క్ తింటున్నారా? అయితే ఈ షాకింగ్ నిజాలు మీ కోసమే!

వేసవిలో పెరుగుతున్న అగ్నిప్రమాదాల సంఖ్య.. ఇంట్లో ఫైర్ సేఫ్టీ కోసం ఇవి తప్పనిసరి

ఎక్కవ కాలం జీవించాలంటే అన్నీ తినండి ఈ 3 తప్ప.. లేకుంటే చిన్న వయసులోనే ఆరోగ్య సమస్యలు

విదేశాల్లో ఇళ్లపై వాటర్ ట్యాంకులు ఎందుకు కనిపించవు? అసలు కారణం ఇదే!

Big Stories

×