E-Paper
Advertisement

Relationship Secrets: ప్రేమలో ఉన్నారా ..అయితే ఈ పొరపాట్లు చేస్తున్నారేమో చెక్ చేసుకోండి.

Relationship Secrets: ప్రేమలో ఉన్నారా ..అయితే ఈ పొరపాట్లు చేస్తున్నారేమో చెక్ చేసుకోండి.
Advertisement

Relationship Secrets: ముఖ్యంగా ప్రేమలో ఉన్నప్పుడు చాలా మంది చేసే పొరపాట్లు ఏంటో తెలుసా ..మేకప్ వేసుకోవడం అవును ..ఏంటి మొహానికి అనుకున్నారా ..కాదు మనసుకి.
ప్రేమ అంటేనే చిన్న చిన్న అలకలు ,కోపాలు ,ఇరిటేషన్లు…కానీ ఇవేవి లేవు అన్నట్టుగా అసలు బిహేవియర్ ని పక్కన పెట్టేసి మనసుకి మేకప్ వేస్తారు చూడండి .అప్పుడు మొదలవుతుంది అసలు సినిమా.మొదట్లో అది బాగానే ఉంటుంది.ఇద్దరూ నటిస్తుంటారు కాబట్టి. కాని కొన్ని రోజులయ్యాక మాత్రం ఆ మేకప్ తొలిగిపోవడం గ్యారంటీ.

also read:Pooja Hegde:’ఆదర్శ కుటుంబం’లో జిగేల్ రాణి.. గుంటూరు కారం ఎఫెక్టేనా?

Advertisement

ఇంకేం అసలు రంగు బయటపడేసరికి ఒకరి మీద ఒకరు కంప్లైంట్లు చేసుకోవడం మొదలవుతుంది. నువ్వు  ‘ఇలాంటివాడివి అనుకోలేదని’ అమ్మాయి అంటే ‘అసలు నువ్ ఇలా ఉంటావు అని అనుకోలేదని’  అబ్బాయ్ అనడం మొదలవుతుంది.అందం మీద మోజు ఒక రాత్రితో పోతుంది .కానీ మనిషికి మనిషి నచ్చాలంటే మాత్రం అసలైన క్యారెక్టర్ ఏంటో తెలిసినపుడే. పై పై పొంగులకి మోసపోకుండా నిశితంగా అబ్జర్వ్ చేయండి. కోపం వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవుతున్నాడు,డబ్బు విషయాల్లో ఎలా ప్రవర్తిస్తున్నాడు ..ముఖ్యంగా నీ అభిప్రాయాలకి తను ఎంత విలువ ఇస్తున్నాడు వంటివే మీ బందానికి అసలు లిట్మస్ టెస్ట్.మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి ఏమైనా చేస్తా అని అనే వాళ్ళని కాకుండా మీకోసం వాళ్ళు ఏం చేయట్లేదో గమనించండి.

నిజానికి ప్రేమ అనేది పెద్ద పెద్ద డైలాగుల్లో ఉండదు,అది చిన్న చిన్న రెస్పాన్సిబులిటీస్ లలో ఉంటుంది.ముఖ్యంగా నీ కన్నా నాకెవరూ ఎక్కువ కాదు, అసలు అమ్మ నాన్నలు కూడా నీ తర్వాతే అనే వాళ్ళని అస్సలు  నమ్మకండి, ఎందుకంటే కానీ పెంచిన వాళ్ళనే ఈజీగా పక్కన పెట్టేసిన వ్యక్తీ మిమ్మల్ని కరివేపాకులా తీసేయడం పెద్ద కష్టం కాదు. ఏంతొ మంది అనుభవాలు మనకు ఇవే చెబుతాయ్ కూడా.లవ్ లో ఉంటె కనీసం ఇది నాకు నచ్చలేదు అని చెప్పడానికే భయపడితే ఇక పెళ్లి తర్వాత అలాంటి వాటికి అలవాటైపోయి లైఫ్ డిప్రెషన్ లోకి పోవడ,మ్ ఖాయం. ఏదైనా బందం లోకి అడుగుపెట్టేముందే చెప్పెయ్యండి. ఇపుడు చెబితే నొచ్చుకుంటారేమో..కాని పెళ్లి అయ్యాకా పెద్ద పెద్ద గొడవలు కాకుండా ఆపుతుంది.

Advertisement

ప్రేమ అంటే ఓవర్ గా రియాక్ట్ అవడం, చనువు పెంచేసుకోవడం, మాటలు బార్డర్ దాటేయడం కాదు. ప్రేమ అంటే ఒకరిని ఒకరు గౌరవించుకునే స్పేస్ ఉండాలి, అర్థం చేసుకునే టైం ఉండాలి, మాటలకి మించిన సైలెన్స్ ఉండాలి.అతని లోపాలతో సహ ఇలాంటివి అన్నీ చూశాకా కూడా ఆ మనిషి నచ్చారంటే అదే అసలైన ప్రేమ. అప్పుడే ఎలాంటి అడ్డంకులు వచ్చినా కలిసి ప్రయాణిoచగలం.ఎందుకంటే ప్రేమ అంటే సాంగ్ కాదు…రెండు గంటల సినిమా కాదు. ప్రేమంటే కళ్ళు మూసుకొని దూకేయడం కాదు, కళ్ళు తెరిచి కలిసి నడిచే అధ్బుతమైన ప్రయాణం.

also read:Tollywood Lord Rama Actors: వెండితెర శ్రీరామ చంద్రులు

Related News

హెవీ ఇయర్‌రింగ్స్‌తో చెవి నొప్పి వస్తుందా? చెవి రంధ్రాలు సాగకుండా ఈ సింపుల్ ట్రిక్ పాటించండి

ఒక్క పన్ను పీకడానికి రూ.2.25 లక్షలా.. అదే ఇండియాలో అయితే?

డెస్క్ జాబ్ చేస్తున్నారా? ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే సమస్యలు ఇవే

తగ్గేదెలే.. ఈ తేదీల్లో పుట్టినవారు ఆత్మగౌరవం విషయంలో అసలు రాజీపడరు

స్కూల్‌కు వెళ్లే సమయం అయినా పిల్లలు నిద్రలేవడం లేదా? ఈ 5 టిప్స్‌తో మార్నింగ్ రొటీన్ మార్చండి

గుండెపోటు ముప్పును 30 శాతం తగ్గించగల పిల్.. తాజా అధ్యయనంలో అద్భుత ఫలితాలు

వర్షాకాలంలో తరచూ అనారోగ్యానికి గురవుతున్నారా? రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి ఈ పుడ్స్

రక్తంలో చక్కెర పెరగకుండా ఉండాలంటే ఆపిల్ తినాలా? పియర్ తినాలా?

Big Stories

Advertisement
×