Most powerful mixer grinder 2026: ప్రతి ఇంట్లో ప్రస్తుతం మిక్సీ ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి గట్టి పప్పుల దాకా, వేడి వేడి మసాలాల నుంచి చల్లని స్మూతీల దాకా.. ఏది తయారు చేయాలన్నా కూడా మిక్సీనే దిక్కు. అయితే.. పాతకాలం నాటి తక్కువ పవర్ ఉన్న మిక్సీలతో గంటల తరబడి కుస్తీ పడటం మానేయాలి. 2026 నాటికి టెక్నాలజీ మారిపోయింది. ఇప్పుడు 1000W నుంచి ఏకంగా 2500W వరకు పవర్ ఉన్న ‘బీస్ట్’ లాంటి మోడల్స్ మార్కెట్లోకి వచ్చేశాయి. మరి మీ అవసరానికి తగ్గట్టుగా, అసలు సిసలైన పవర్‌ఫుల్ మిక్సీ ఏదో ఇప్పుడు. తెలుసుకుందాం.
1. కమర్షియల్ పవర్ హౌస్ (హోటల్స్ & హెవీ యూజ్ కోసం):
పెద్ద కుటుంబం అయినా లేదా చిన్నపాటి క్యాటరింగ్ బిజినెస్ ఉన్నా.. ఈ హై-పవర్ మిక్సీలు ది బెస్ట్.
HANS Dominar X Pro (2500W):
ఇది 2500W పవర్, 3.5 HP మోటార్‌తో వస్తుంది. రాళ్లను కూడా పొడి చేసేంత మోటార్ దీని సొంతం. 5 లీటర్ల భారీ జార్ ఉండటం వల్ల ఒక్కసారిగా కేజీల కొద్దీ మసాలాను రుబ్బేయొచ్చు. 60 నిమిషాల పాటు ఆగకుండా పని చేసినా ఇది పాడవదు.
AGARO Grand Professional (2000W):
స్టైల్ ప్లస్ పవర్. ఇది స్మూతీలు చేయడానికి, ఐస్ ముక్కలను ఇట్టే పొడి చేయడానికి అద్భుతంగా పని చేస్తుంది. ఇందులో ఉండే 8 స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్స్ గ్రైండింగ్‌ను చాలా స్మూత్‌గా చేస్తాయి.
2. హోమ్ యూజ్ కోసం ‘పవర్ ఫుల్’ ఆప్షన్స్ (1000W మోడల్స్):
ఇంటి వాడకానికి 1000 వాట్స్ మిక్సీలు ఇప్పుడు ట్రెండింగ్. ఇవి కరెంటును పొదుపు చేస్తూనే.. ఎలాంటి పదార్థాలనైనా పక్కాగా గ్రైండ్ చేస్తాయి.
Bosch TrueMixx Pro (1000W):
రోట్లో దంచిన రుచి కావాలా? అయితే బాష్ కే ఓటు వేయాలి. ఇందులో ఉండే ‘స్టోన్ పౌండింగ్’ టెక్నాలజీ వల్ల మసాలాలు నలిగినప్పుడు ఆ వాసన, రుచి అచ్చం పాతకాలం నాటి రోటి పచ్చడిలాగే ఉంటాయి.
Sujata MG03 (1000W):
నమ్మకానికి మారుపేరు సుజాత. ఇది చూడటానికి సింపుల్‌గా ఉన్నా.. దీని మోటార్ లైఫ్ చాలా ఎక్కువ. డబుల్ బాల్ బేరింగ్ ఉండటం వల్ల 90 నిమిషాల పాటు కంటిన్యూగా రన్ చేసినా మోటార్ కాలిపోయే ఛాన్స్ ఉండదు.
Preethi Taurus Plus (1000W):
వేగమే దీని ప్రాణం. కఠినమైన పదార్థాలను కూడా కేవలం 90 సెకన్లలోనే పిండి చేసే పవర్ దీనికుంది. ఓవర్‌లోడ్ అయితే ఆటోమేటిక్‌గా ఆగిపోయే సేఫ్టీ ఫీచర్ కూడా ఉంది.
Also Read: బ్లెండర్ వర్సెస్ మిక్సర్ గ్రైండర్.. మీ వంటగదికి ‘పర్ఫెక్ట్’ ఏది?
మీరు ఏది కొంటే బెటర్?
సరైన మిక్సీని ఎంచుకోవడం పెద్ద బ్రహ్మ విద్యేం కాదు. ఈ చిన్న టిప్స్ ఫాలో అవ్వండి..
1.హోటల్స్- HANS Dominar X Pro (2500W)
2.సంప్రదాయ రుచి (రోటి పచ్చడిలా)- Bosch TrueMixx Pro
3.ఎక్కువ పాడవకుండా ఉండాలంటే- (Durability)Sujata MG03
4.తక్కువ టైమ్, ఎక్కువ స్పీడ్- Preethi Taurus Plus
మార్కెట్లో వందల మోడల్స్ ఉండొచ్చు. కానీ మీ అవసరం ఏంటో తెలిస్తేనే సరైంది ఎంచుకోవచ్చు. రోజువారీ వంటలకు 1000W మిక్సీలు సూపర్ హిట్. అదే మీరు హెవీ పనుల కోసం చూస్తుంటే 2000W పైబడిన మోడల్స్ బెస్ట్. సరైన మిక్సీని ఎంచుకుంటే.. వంటగదిలో మీ శ్రమ సగానికి సగం తగ్గుతుంది.