E-Paper
Advertisement

ఏసీ గదిలో నిద్రపోతే ఆరోగ్య సమస్యలు వస్తాయా? దానికి కారణాలు ఇవే

ఏసీ గదిలో నిద్రపోతే ఆరోగ్య సమస్యలు వస్తాయా? దానికి కారణాలు ఇవే
Advertisement

వేసవి వేడిలో చల్లదనం, సౌకర్యం కోసం చాలా ఇళ్లలో ఎయిర్ కండీషనర్ ఉపయోగిస్తుంటారు. అయితే ఏసీ గదిలో నిద్రపోయిన తర్వాత కొందరు గొంతు నొప్పి, తుమ్ములు, దగ్గు, ముక్కు మూసుకుపోయి ఊపిరి ఆడకపోవడం వంటి సమస్యలతో ఇబ్బందిపడుతుంటారు. అలాగే ఏసీ వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుందని చాలా మంది నమ్ముతారు. కానీ వైద్యులు ఇందులో పూర్తిగా నిజం కాదని చెబుతారు.

ఏసీ వల్ల రోగనిరోధక శక్తి తగ్గదు

ఏసీ వల్ల సాధారణంగా రోగనిరోధక శక్తి బలహీనం కాదు. సరైన ఉష్ణోగ్రతలో నిద్రపోతే శరీరం బాగా విశ్రాంతి పొందుతుంది. చల్లని గది నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది.

అసలు సమస్య అదే

Advertisement

గదిలో ఏసీ ఆన్ చేస్తే తేమ తగ్గుతుంది. ఇదంతా పొడిగాలి వల్లే జరుగుతుంది. పొడి గాలి ముక్కు, గొంతు, శ్వాసనాళాలను ప్రభావితం చేసి దురద, తుమ్ములు, దగ్గు వస్తాయి. శరీరం సహజంగా తేమతో రక్షణ పొందుతుంది. ఈ తేమ తగ్గడం వల్ల అసౌకర్యం కలుగుతుంది.

ఏసీ ఫిల్టర్ల మురికి సమస్యలు పెంచుతాయి

మురికి ఫిల్టర్లలో దుమ్ము, బ్యాక్టీరియా, అలర్జీ కారకాలు పేరుకుపోతాయి. గాలితో పాటు ఇవి గది అంతా వ్యాపించి అలర్జీలు, శ్వాస సమస్యలు కలిగిస్తాయి.

ఆకస్మిక టెంపరేచర్ మార్పులు

Advertisement

బయటి వేడి నుంచి నేరుగా చల్లని ఏసీ గదికి వెళ్లడం వల్ల శ్వాసనాళాలు చికాకు పడతాయి. ఆస్తమా, సైనస్ సమస్యలు ఉన్నవారికి ఇది ఎక్కువగా ఇబ్బంది కలిగిస్తుంది.

అధిక చల్లదనం నివారించండి

ఏసీని చాలా సరైన ఉష్ణోగ్రతలో (24-26 డిగ్రీలు) ఉంచడం మంచిది. అధిక చల్లదనం గొంతు పొడిబారడానికి కారణం అవుతుంది.

నీళ్లు ఎక్కువగా తాగండి

వేసవి వల్ల శరీరంలో నీరు తగ్గిపోతాయి. అలాగే ఏసీ గదిలో చల్లదనం, పొడి గాలి కారణంగా దాహం తక్కువగా వేస్తుంది. దీని వల్ల నీరు తక్కువ తాగుతారు. దీని వల్ల శరీరంలో డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. అందుకే ఏసీ గదిలో ఉన్నా నీళ్లు బాగా తాగడం చాలా ముఖ్యం. ఇది శరీర తేమను కాపాడి, అసౌకర్యాన్ని తగ్గిస్తుంది.

Also Read: వేసవిలో చెమటకాయల వల్ల మంట, దురదతో ఇబ్బందిపడుతున్నారా? ఈ సహజ పద్ధతులతో ఉపశమనం

ఏసీ ఫిల్టర్లను క్రమం తప్పకుండా శుభ్రం చేయండి

ఫిల్టర్లు శుభ్రంగా ఉంటే గాలి నాణ్యత మెరుగుపడి, అలర్జీలు తగ్గుతాయి.

గాలి ప్రసరణ ఉండేలా చూడండి

గదిని పూర్తిగా మూసేయకుండా, కొంత సమయం కిటికీలు తెరిచి గాలి వచ్చేలా చూడండి.

ఏసీ గదిలో నిద్రపోతే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రావడం సాధారణం కానీ ఏసీ వల్ల రోగనిరోధక శక్తి తగ్గదు. పొడి గాలి, మురికి ఫిల్టర్లు, అధిక చల్లదనం వల్ల సమస్యలు వస్తాయి. సరైన ఉష్ణోగ్రత, శుభ్రమైన ఫిల్టర్లు, తగినంత నీళ్లు తాగడం వంటి అలవాట్లతో సౌకర్యంగా నిద్రపోవచ్చు. ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

Related News

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

పిల్లల్లో డిప్రెషన్ ముప్పును తగ్గించే చిన్ననాటి అనుభవాలు ఇవే.. పేరెంట్స్ ఇవి తప్పక తెలుసుకోవాలి!

సాయంత్రం పూట వేడి వేడిగా ఇలా చేసి పెట్టండి ఇంటిల్లిపాదీ ఇష్టంగా తింటారు!

హోటల్ స్టైల్ క్రిస్పీ ఇన్‌స్టంట్ రవ్వ దోశ.. 15 నిమిషాల్లో ఇలా తయారు చేసుకోండి!

పిల్లల చేతి నుంచి ఫోన్ తీసుకోగానే ఏడుస్తున్నారా? ఇలా చేస్తే స్వయంగా ఇచ్చేస్తాడు

మన రక్తంలో ప్లాస్టిక్ విధ్వంసం.. తాజా రీసెర్చ్‌లో తేలిన సంచలన విషయాలు!

ఈ నవరాత్రులకు 3 స్పెషల్ డిషెస్.. ప్రసాదంగానూ పెట్టొచ్చు, రుచికి తిరుగే ఉండదు!

ఇడ్లీ,దోశలోకి అదిరిపోయే రుచితో ఉల్లిపాయ చట్నీలు..ఇలా చేసేయండి!

Big Stories

Advertisement
×