Most Popular Commuter Bikes 2026: మన దేశంలో కమ్యూటర్ బైకులకు ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా తక్కువ ధరలో మంచి మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్, రోజువారీ ప్రయాణాలకు సౌకర్యంగా ఉండే బైక్‌లను ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్నారు. అందుకే, రూ.1 లక్షలోపు బైకుల మార్కెట్ చాలా విస్తృతంగా ఉంది. హీరో, హోండా, టీవీఎస్, బజాజ్ లాంటి కంపెనీలు పలు మోడల్స్ ను అందిస్తున్నాయి. వాటిలో టాప్ బైకుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ సెగ్మెంట్ లో చాలా కాలంగా ఆదరణ పొందుతున్న బైక్ లలో హీరో HF డీలక్స్ ఒకటి. దీని ధర సుమారు రూ.58 వేల నుంచి ప్రారంభమవుతుంది. 97.2cc ఇంజన్ తో వచ్చే ఈ బైక్ మంచి మైలేజ్ తో పాటు ఈజీగా నడిపే అవకాశం ఉంటుంది. LED హెడ్ లైట్, డిజిటల్ డిస్ ప్లే లాంటి ఫీచర్లు కూడా కొన్ని వేరియంట్లలో లభిస్తాయి.
తక్కువ ఖర్చుతో మంచి పర్ఫార్మెన్స్ ఉన్న బైక్ గా ఇది గుర్తింపు తెచ్చుకుంది. 99.59cc ఇంజన్ తో వచ్చే ఈ బైక్ రోజువారీ ఆఫీస్, గ్రామీణ రోడ్ల ప్రయాణాలకు బాగా ఉపయోగపడుతుంది. మంచి గ్రౌండ్ క్లియరెన్స్ కూడా దీనికి ప్లస్ పాయింట్.
కొంచెం ఎక్కువ పవర్ కావాలనుకునే వారికి మంచి ఎంపిక. 115cc ఇంజన్‌తో వచ్చే ఈ బైక్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. రఫ్ రోడ్లపై కూడా సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు దీనిని రూపొందించారు.
స్టైలిష్ లుక్ తో కమ్యూటర్ బైక్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఇది స్పోర్టీ డిజైన్ తో పాటు మంచి పవర్ కూడా అందిస్తుంది. యువత ఎక్కువగా ఈ బైక్ ను ఇష్టపడుతున్నారు.
టీవీఎస్ నుంచి వచ్చే టీవీఎస్ రేడియాన్, టీవీఎస్ స్పోర్ట్ కూడా ఈ సెగ్మెంట్ లో మంచి గుర్తింపు పొందాయి. రేడియాన్ లో పొడవైన సీటు, USB ఛార్జింగ్, డిజిటల్ మీటర్ లాంటి ఫీచర్లు ఉంటే, స్పోర్ట్ బైక్ తక్కువ ధరలో మంచి మైలేజ్ అందిస్తుంది.
హోండా నుంచి వచ్చే షైన్ 100 దేశంలో అత్యంత అందుబాటు ధరలో లభించే బైక్ లలో ఒకటిగా కొనసాగుతోంది. తక్కువ బరువు ఉండటంతో ఎవరైనా ఈజీగా నడిపే అవకాశం ఉంటుంది. అదే సమయంలో హోండా షైన్ 125 ఎక్కువ పవర్, మంచి కంఫర్ట్ కోరుకునే వారికి అనుకూలంగా ఉంటుంది.
ఇక టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్, హీరో సూపర్ స్ప్లెండర్ Xtec కూడా ఫీచర్లు, మైలేజ్, కంఫర్ట్ పరంగా మంచి ఆప్షన్ గా నిలుస్తున్నాయి. ఇందులో 5-స్పీడ్ గేర్ బాక్స్, డిజిటల్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
Read Also: ఒకే ఛార్జ్ తో 300 కి.మీ రేంజ్.. తక్కువ ధరలో బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!