E-Paper
Advertisement

ఆవు పాలు Vs గేదె పాలు.. ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి శ్రేష్ఠం? అసలు నిజాలు ఇవే!

ఆవు పాలు Vs గేదె పాలు.. ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి శ్రేష్ఠం? అసలు నిజాలు ఇవే!

Cow milk vs Buffalo milk: మనందరి లైఫ్‌లో పాలు అనివార్యం. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతిరోజూ పాలు తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మనందరికీ తెలుసు. అయితే.. మార్కెట్లో మనకు ప్రధానంగా ఆవు పాలు, గేదె పాలు రెండూ అందుబాటులో ఉంటాయి. చాలా మందికి ఉండే పెద్ద సందేహం ఏంటంటే.. ఈ రెండింటిలో ఏవి ఎక్కువ పోషకాలను కలిగి ఉంటాయి? పిల్లలకు ఏవి ఇవ్వాలి? బరువు తగ్గాలనుకునే వారు వేటిని ఎంచుకోవాలి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఆవు పాలు vs గేదె పాలు: పోషకాలు వేటిలో ఎక్కువ?

ఆవు పాలు , గేదె పాలు రెండూ వాటి వాటి ప్రత్యేక గుణాలను కలిగి ఉంటాయి. వీటి మధ్య ప్రధాన వ్యత్యాసం వాటిలోని నీటి శాతం, కొవ్వు, ఇతర ఖనిజ లవణాల మీద ఆధారపడి ఉంటుంది.

1. కొవ్వు, కేలరీలు:
గేదె పాలు ఆవు పాల కంటే చిక్కగా ఉంటాయి. దీనికి ప్రధాన కారణం అందులో ఉండే అధిక కొవ్వు శాతం.

గేదె పాలు: ఇందులో సుమారు 7-8% కొవ్వు ఉంటుంది. ఫలితంగా కేలరీలు ఎక్కువగా ఉంటాయి. శరీర బరువు పెరగాలనుకునే వారికి, గేమ్స్ ఆడే వారికి ఇవి మేలు చేస్తాయి.

ఆవు పాలు: ఇందులో కేవలం 3-4% మాత్రమే కొవ్వు ఉంటుంది. ఇవి పల్చగా ఉంటాయి కాబట్టి కేలరీలు తక్కువ. బరువు తగ్గాలనుకునే వారికి ఆవు పాలు బెస్ట్.

2. ప్రోటీన్ , మినరల్స్ :

రెండు రకాల పాలలోనూ నాణ్యమైన ప్రోటీన్ లభిస్తుంది. కానీ వాటి సాంద్రత మారుతుంది.

ప్రోటీన్: గేదె పాలలో ఆవు పాల కంటే 10-11% ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. ఇది కండరాల నిర్మాణానికి తోడ్పడుతుంది.

కాల్షియం: ఎముకల ఆరోగ్యానికి అవసరమైన కాల్షియం గేదె పాలలో అధికంగా ఉంటుంది. అయితే.. ఆవు పాలలో విటమిన్ డి, ఫాస్పరస్ సమతుల్యంగా ఉండటం వల్ల ఆ కాల్షియం శరీరం సులభంగా గ్రహిస్తుంది.

3. జీర్ణక్రియ:
పాలు తాగినప్పుడు అవి మన కడుపులో ఎంత త్వరగా జీర్ణమవుతాయి అనేది చాలా ముఖ్యం.

ఆవు పాలు: ఇవి తేలికగా జీర్ణమవుతాయి. అందుకే శిశువులకు (తల్లి పాలు లేని పక్షంలో), చిన్న పిల్లలకు , జీర్ణక్రియ సమస్యలు ఉన్నవారికి ఆవు పాలు పట్టించడం బెస్ట్.

గేదె పాలు: ఇందులో కొవ్వు , ప్రోటీన్ అధికంగా ఉండటం వల్ల ఇవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.

4. రంగు,నిల్వ సామర్థ్యం:
రంగు: ఆవు పాలు కొద్దిగా లేత పసుపు రంగులో ఉంటాయి. దీనికి కారణం అందులో ఉండే ‘బీటా-కెరోటిన్’ (విటమిన్ ఏ కి మూలం). గేదె పాలు తెల్లగా ఉంటాయి ఎందుకంటే.. అందులోని బీటా-కెరోటిన్ అప్పటికే విటమిన్ ఏ గా మారిపోయి ఉంటుంది.

నిల్వ: గేదె పాలలో పెరాక్సిడేస్ యాక్టివిటీ ఎక్కువగా ఉండటం వల్ల, ఆవు పాల కంటే గేదె పాలు ఎక్కువ సేపు తాజాగా ఉంటాయి.

5. వంటలలో ఉపయోగాలు:
మీరు చేసే వంటకాన్ని బట్టి పాలను ఎంచుకోవచ్చు.

గేదె పాలు: చిక్కగా ఉండటం వల్ల పెరుగు, నెయ్యి, కోవా, పనీర్, ఖీర్ (పాయసం) చేయడానికి ఇవి అద్భుతంగా ఉంటాయి.

ఆవు పాలు: కాఫీ, టీ పల్చని స్వీట్ల తయారీకి ఇవి బాగుంటాయి.

Also Read: ఆపిల్స్ కొంటున్నారా? రుచికరమైన, తాజా ఆపిల్స్‌ను గుర్తించడానికి బెస్ట్ టిప్స్ ఇవే !

ఎవరు ఏ పాలు తాగాలి?
చిన్న పిల్లలకు- ఆవు పాలు (తేలికగా జీర్ణమవుతాయి)
బరువు తగ్గడానికి-ఆవు పాలు (తక్కువ కేలరీలు)
జిమ్/బాడీ బిల్డింగ్-గేదె పాలు (అధిక ప్రోటీన్, కేలరీలు)
నిద్రలేమి సమస్య ఉంటే-గేదె పాలు (ఇవి గాఢ నిద్రకు తోడ్పడతాయి)

చివరిగా చెప్పాలంటే.. ఏ పాలు ‘గొప్పవి’ అనేది మీ శారీరక అవసరాలపై ఆధారపడి ఉంటుంది. మీకు తేలికపాటి ఆహారం కావాలంటే.. ఆవు పాలు, అధిక శక్తి , బలం కావాలంటే గేదె పాలను ఎంచుకోవాలి. అయితే పాలు ఏవైనా సరే, కల్తీ లేనివి ,స్వచ్ఛమైనవి తాగడం వల్లనే పూర్తి ఆరోగ్యం లభిస్తుంది.

Related News

ఏసీలో పడుకుంటే తలనొప్పి వస్తోందా? నిపుణులు చెబుతున్న అసలు కారణాలివే!

టీనేజర్ల ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్న ఎనర్జీ డ్రింక్స్.. తస్మాత్ జాగ్రత్త!

ఇంటి బయట ॐతో పాటు ఈ నాలుగు చిహ్నాలుంటే.. మీ జీవితంలో సుఖ సంతోషాలే

మార్కెట్‌ నుంచి తెచ్చిన మొక్కలు ఇంట్లో ఎండిపోతున్నాయా? ఈ టిప్స్ పాటిస్తే ఏళ్ల తరబడి పచ్చగా పెరుగుతాయి

వేసవి నీరసం వల్ల ఓఆర్ఎస్ తాగుతున్నారా? ప్యాకెట్లు వద్దు.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి

మీ అబ్బాయి కోసం పెళ్లిసంబంధాలు చూస్తున్నారా? ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి సర్వ గుణ సంపన్నురాలు

వేసవిలో అద్దంలా మెరిసిపోయే ముఖ చర్మం కావాలా? ఈ టిప్స్ మీ కోసమే

కొత్త ఇల్లు మీ కోసం సంతోషాలు తీసుకొస్తుందా లేదా కష్టాలకు కారణమవుతుందా? దీనికి కారణాలు ఇవే

Big Stories

×