E-Paper
Advertisement

బంగాళాదుంపలతో కాదు.. అవకాడోతో ఇలా ఫ్రైస్ చేసేయండి, టేస్ట్ అదిరిపోతుంది!

బంగాళాదుంపలతో కాదు.. అవకాడోతో ఇలా ఫ్రైస్ చేసేయండి, టేస్ట్ అదిరిపోతుంది!
Advertisement

Crispy Avocado Fries: వర్షం పడేటప్పుడు లేదా ఈవెనింగ్ టైంలో ఎప్పుడూ చేసుకునే పకోడీలు, ఫ్రెంచ్ ఫ్రైస్‌కు బదులుగా ఈసారి కొత్తగా క్రిస్పీ అవకాడో ఫ్రైస్ తయారు చేసుకుని తిని చూడండి. బయట కరకరలాడే పూత, లోపల వెన్నలా మెత్తగా ఉండే అవకాడో ముక్కలు ఈ స్నాక్‌కు ప్రత్యేకమైన రుచిని అందిస్తాయి. పిల్లలకు సాయంత్రం స్నాక్‌గా ఇవ్వడానికి, ఇంటికి అతిథులు వచ్చినప్పుడు స్టార్టర్‌గా వడ్డించడానికి కూడా ఇవి చక్కగా సరిపోతాయి.

అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి. సాధారణంగా అవకాడోను సలాడ్లు, స్మూతీల రూపంలో తీసుకుంటాం. కానీ ఇలా ఫ్రైస్‌లా తయారు చేస్తే దాని రుచి మరింత భిన్నంగా ఉంటుంది. టమోటా కెచప్, మయోనైస్ లేదా మీకు నచ్చిన డిప్‌తో కలిపి తింటే ఈ స్నాక్‌ను మరింత ఇష్టంగా ఆస్వాదించవచ్చు. మరి ఆలస్యం చేయకుండా క్రిస్పీ అవకాడో ఫ్రైస్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు:

Advertisement

పండిన అవకాడోలు – 2

మైదా పిండి – అర కప్పు

Advertisement

బ్రెడ్ క్రంబ్స్ – ఒక కప్పు

కార్న్ ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్లు

మిరియాల పొడి – అర టీస్పూన్

కారం – అర టీస్పూన్

వెల్లుల్లి పొడి – అర టీస్పూన్

ఉప్పు – తగినంత

నీళ్లు – తగినంత

నూనె – వేయించడానికి సరిపడా

నిమ్మరసం – ఒక టీస్పూన్

తయారీ విధానం ఇలా:

ముందుగా అవకాడోలను మధ్యలోకి కోసి, లోపల ఉండే పెద్ద గింజను తొలగించాలి. తర్వాత చెక్కును తీసి, అవకాడో గుజ్జును పొడవాటి ఫ్రెంచ్ ఫ్రైస్ ఆకారంలో ముక్కలుగా కోయాలి. ముక్కలు మరీ పలుచగా ఉండకుండా చూసుకోవాలి. అప్పుడు వేయించేటప్పుడు అవి విరిగిపోకుండా ఉంటాయి. ముక్కలపై కొద్దిగా నిమ్మరసం చల్లితే రంగు మారకుండా ఉంటుంది.

ఇప్పుడు ఒక గిన్నెలో మైదా పిండి, కార్న్ ఫ్లోర్, కొద్దిగా ఉప్పు వేసి నీళ్లు పోస్తూ కలపాలి. ఈ మిశ్రమం మరీ పలుచగా కాకుండా.. అవకాడో ముక్కలకు పట్టేలా ఉండాలి. మరో ప్లేట్‌లో బ్రెడ్ క్రంబ్స్, మిరియాల పొడి, కారం, వెల్లుల్లి పొడి వేసి బాగా కలపాలి.

తర్వాత అవకాడో ముక్కలను ముందుగా మైదా మిశ్రమంలో ముంచి, ఆపై బ్రెడ్ క్రంబ్స్‌లో దొర్లించాలి. ముక్కలకు అన్ని వైపులా పూత సమానంగా పట్టేలా చూసుకోవాలి. ఇలా సిద్ధం చేసుకున్న ముక్కలను పక్కన పెట్టుకోవాలి.

బాణలిలో నూనె వేడి చేసి, మీడియం మంటపై అవకాడో ముక్కలను కొద్దికొద్దిగా వేయాలి. బంగారు రంగులోకి మారి, బయట కరకరలాడే వరకు వేయించి తీసేయాలి. టిష్యూ పేపర్‌పై ఉంచితే అదనపు నూనె తొలగిపోతుంది.

అంతే.. వేడివేడి క్రిస్పీ అవకాడో ఫ్రైస్ సిద్ధం. వీటిని టమోటా కెచప్ లేదా స్పైసీ మయోనైస్‌తో కలిపి వడ్డించండి. మరింత క్రంచీగా ఉండాలంటే వేయించిన వెంటనే తినడం మంచిది.

Tags

Related News

టేస్టీ అండ్ స్పైసీ క్యాప్సికమ్ రైస్..నిమిషాల్లో తయారయ్యే రెసిపీ!

ఎప్పుడూ పకోడీలేనా? ఈసారి పచ్చి అరటికాయతో ఇలా షామీ కబాబ్ చేసి చూడండి!

దిష్టి ఎలా తీయాలో తెలుసా? వేటితో తీస్తే వెంటనే ఫలితం ఉంటుంది?

కొత్తగా పెళ్లయిన యువతికి ఇంటర్వ్యూలో అలాంటి ప్రశ్న.. మీరైతే ఏం చేస్తారు?

ముఖంపై నల్లటి మచ్చలతో ఇబ్బంది పడుతున్నారా? క్లియర్ స్కిన్ కోసం డాక్టర్ ఏం చెప్పారంటే

చూపు దెబ్బతినకముందే అప్రమత్తం కండి.. కళ్లు చెప్పే ఆ రహస్య సంకేతాలు ఇవే!

చాణక్య నీతి.. భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టే స్నేహితులు వీరే.. ఇలా గుర్తించండి

Big Stories

Advertisement
×