E-Paper
Advertisement

దుల్కర్‌ సినిమా స్ట్రీమింగ్ విషయంలో గందరగోళం… స్ట్రీమింగ్ ఏ ఓటీటీలో ? ఎప్పటి నుంచి ?

దుల్కర్‌ సినిమా స్ట్రీమింగ్ విషయంలో గందరగోళం… స్ట్రీమింగ్ ఏ ఓటీటీలో ? ఎప్పటి నుంచి ?
Advertisement

I’m Game OTT Release: దుల్కర్ సల్మాన్ సినిమాల కోసం ఎదురుచూసే ప్రేక్షకులకు ఇప్పుడు ఓ కొత్త టెన్షన్ మొదలైంది. థియేటర్లలో విడుదలైన సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందోనని ఎదురు చూస్తుంటే… ప్రకటించిన తేదీ వచ్చినా స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రాలేదు. అసలు సినిమా ఏ ఓటీటీలో విడుదలవుతుంది ? ముందుగా చెప్పిన ప్లాట్‌ఫామ్‌లోనే వస్తుందా ? లేక హక్కులు మరో సంస్థ చేతికి వెళ్లాయా ? ఇప్పుడు దుల్కర్ సల్మాన్ నటించిన ‘ఐయామ్ గేమ్’ (I’m Game) విషయంలోనూ ఇలాంటి గందరగోళమే నెలకొంది. అక్టోబర్ 16 నుంచి జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుందని ప్రచారం జరగడంతో ప్రేక్షకులు ఎదురుచూశారు. కానీ అనుకున్న తేదీకి సినిమా అందుబాటులోకి రాకపోవడంతో అసలు ఓటీటీ విడుదల ఎప్పుడు, ఎక్కడ అనే చర్చ మొదలైంది.

కథలోకి వెళ్తే…

దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఐయామ్ గేమ్’ మలయాళ యాక్షన్ థ్రిల్లర్. డాన్ జాన్ అనే పాత్ర చుట్టూ సాగే ఈ కథలో గ్యాంబ్లింగ్‌, అక్రమ బెట్టింగ్‌లు, అండర్‌వరల్డ్‌ వ్యవహారాలు కీలకంగా ఉంటాయి. డబ్బు సంపాదించాలనే ఆశ, పందేల్లో గెలవాలనే తపన ఒక మనిషిని ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి తీసుకెళ్తాయనే అంశాలను ఈ సినిమాలో చూపించారు. డాన్ జీవితంలో చోటుచేసుకునే సంఘటనలు, అతను ఎదుర్కొనే సంఘర్షణలతో కథ యాక్షన్ థ్రిల్లర్‌గా ముందుకు సాగుతుంది.

Advertisement

నహాస్ హిదాయత్ (Nahas Hidhayath) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్‌తో పాటు కయాదు లోహర్ (Kayadu Lohar), ఆంటోనీ వర్గీస్ (Antony Varghese), మైస్కిన్ (Mysskin), కథిర్ (Kathir), వినయ్ ఫోర్ట్ (Vinay Forrt), సంయుక్త విశ్వనాథన్ (Samyuktha Viswanathan) తదితరులు నటించారు. జేక్స్ బిజోయ్ (Jakes Bejoy) సంగీతం అందించారు. సెప్టెంబర్ 3న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాపై ఓటీటీ ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది. అయితే సినిమా కథకంటే ఇప్పుడు దాని డిజిటల్ విడుదల గురించే ఎక్కువ చర్చ జరుగుతోంది.

ఓటీటీలో ఎక్కడ ? ఎప్పటి నుంచి ?

‘ఐయామ్ గేమ్’ అక్టోబర్ 16 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుందని వార్తలు రావడంతో ప్రేక్షకులు ఆ తేదీ కోసం ఎదురుచూశారు. కానీ ఆ రోజు సినిమా అందుబాటులోకి రాకపోవడంతో గందరగోళం మొదలైంది. మరోవైపు, ఈ సినిమా డిజిటల్ హక్కులను జీ5 (ZEE5) సొంతం చేసుకుందని, నవంబర్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. దీంతో అసలు హక్కులు ఏ సంస్థకు దక్కాయి ? జియోహాట్‌స్టార్‌లో రావాల్సిన సినిమా జీ5కి మారిందా ? లేక విడుదల తేదీ మాత్రమే వాయిదా పడిందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

థియేటర్లలో విడుదలైన సినిమాలు ఓటీటీలోకి రావడానికి కొంత సమయం పట్టడం సాధారణమే. అయితే ‘ఐయామ్ గేమ్’ విషయంలో 56 రోజుల థియేట్రికల్ విండో కారణంగానే ఆలస్యమైందనే ప్రచారం కూడా వినిపిస్తోంది. జీ5 ఈ సినిమా హక్కులను సుమారు 12 కోట్లకు కొనుగోలు చేసిందని, నవంబర్ మొదటి లేదా రెండో వారంలో విడుదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఈ వివరాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Read Also: అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

Tags

Related News

కూతురిని కాపాడాలంటే భార్యను పంపమనే మాఫియా డాన్… 8.8 రేటింగ్‌తో దూసుకెళ్తున్న తెలుగు థ్రిల్లర్

పూజారి అంటే పూజలే అనుకుంటున్నారా ? విలన్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే ఫైటర్… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

అపార్ట్‌మెంట్‌లో వరుస మిస్సింగ్స్.. ఆ బిల్డింగ్ కేర్‌టేకర్‌ వెనుక దాగిన భయంకర నిజం… హాలీవుడ్ హారర్ థ్రిల్లర్

ఆ పాత పెట్టె తెరిస్తే పాతాళానికే… ఇంట్లోనే నరకం చూపించిన దుష్టశక్తి… తెలుగులోనే ఈ హారర్ థ్రిల్లర్

అడవిలో ఆపద తెచ్చిన ప్రయాణం… ఆ దారిలో వెళ్తే ప్రాణాలే గాల్లో… టెర్రిఫిక్ తెలుగు థ్రిల్లర్

పూరీ పుణ్యక్షేత్రం రహస్యం… దివ్యశక్తి కోసం విలన్ల ఊచకోత… ఒక్కో సీన్ చూస్తుంటే మతిపోతోంది

ఈజీ మనీ కోసం ఎన్నికల్లో మోసం.. చివరికి ఊరంతా శత్రువులైతే… తెలుగు సినిమానే

Big Stories

Advertisement
×