Change Instagram username:సోషల్ మీడియా ప్రపంచంలో ఇన్‌స్టా అందరి జీవితంలో ఒక భాగమైపోయింది. ప్రొఫైల్ అందంగా కనిపించాలన్నా, ఇతరులు మనల్ని ఈజీగా గుర్తు పట్టాలన్నా ఒక ట్రెండీ అండ్ క్యాచీ యూజర్‌నేమ్ ఉండటం చాలా ముఖ్యం. చాలా మంది కొన్ని రోజుల తర్వాత తమ పాత లేదా చిన్న పిల్లల తరహా హ్యాండిల్స్‌తో బోర్ ఫీలవుతుంటారు. మీ ఇన్‌స్టా యూజర్‌నేమ్‌ను మార్చాలని అనుకుంటున్నారా? ఎలాంటి ఇబ్బంది లేకుండా కేవలం కొన్ని సెకన్లలో మీ ఐడీని సరిబకొత్తగా మార్చుకునే సింపుల్ పద్ధతిని ఇప్పుడు చూద్దాం.
1. ముందుగా మీ ఫోన్‌లో ఇన్‌స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేసి, కుడి వైపు కింద ఉండే మీ ప్రొఫైల్ పిక్చర్ ఐకాన్‌పై క్లిక్ చేయండి.
2. తర్వాత మీ ప్రొఫైల్ పేజీ ఓపెన్ అయిన తర్వాత బయో కింద కనిపించే ‘Edit Profile’ (ఎడిట్ ప్రొఫైల్) బటన్‌పై ట్యాప్ చేయండి.
3. అక్కడ మీకు ‘Username’ అనే కాలమ్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి మీ పాత పేరును తొలగించి, మీకు నచ్చిన కొత్త ట్రెండీ యూజర్‌నేమ్‌ను టైప్ చేయండి.
4. కొత్త పేరు ఎంటర్ చేసిన తర్వాత, స్క్రీన్ పైభాగంలో కుడి వైపు ఉండే బ్లూ టిక్ మార్క్‌పై క్లిక్ చేస్తే మీ యూజర్‌నేమ్ అప్‌డేట్ అయిపోతుంది.
5. మీ ప్రొఫైల్‌కు పర్ఫెక్ట్ లుక్ రావాలంటే.. కేవలం పేరు మార్చడమే కాదు, అది అందరినీ ఆకట్టుకునేలా ఉండాలి.
6. ఎక్కువ అంకెలు, అనవసరమైన అక్షరాలు లేకుండా .. సింపుల్‌గా ఉండేలా చూసుకోండి. అప్పుడే ఇతరులు మిమ్మల్ని త్వరగా సెర్చ్ చేసి ఫాలో అవ్వగలుగుతారు.
Also Read: ఫోన్ కెమెరా బ్లర్‌గా ఉందా? వాటర్ మాయిశ్చర్ తొలగించే బెస్ట్ హ్యాక్స్!
7. మీ పేరు, మీ అభిరుచులు లేదా మీ ప్రొఫైల్ కంటెంట్ (ఉదాహరణకు ఫోటోగ్రఫీ, ట్రావెలింగ్, ఫ్యాషన్) ఆధారంగా యూజర్‌నేమ్ క్రియేట్ చేసుకుంటే చాలా ప్రొఫెషనల్ లుక్ వస్తుంది.
8. మీరు అనుకున్న పేరు ఆల్రెడీ వేరే వాళ్ళు వాడి ఉంటే, ఇన్‌స్టాగ్రామ్ అప్పట్లో కొన్ని నంబర్లు లేదా అండర్‌స్కోర్ యాడ్ చేయమని సూచిస్తుంది. కాబట్టి యూనిక్ నేమ్ ట్రై చేయండి.
మీరు ఒకసారి ఇన్‌స్టాగ్రామ్ యూజర్‌నేమ్ మార్చిన తర్వాత, రాబోయే 14 రోజుల వరకు మళ్లీ మార్చడానికి కుదరదు. కాబట్టి మీరు సెట్ చేసే పేరు స్పెల్లింగ్ కరెక్ట్‌గా ఉందో లేదో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్న తర్వాతే.. సేవ్ బటన్ నొక్కండి. అలాగే మీరు పాత యూజర్‌నేమ్ మార్చిన వెంటనే, ఒకవేళ వేరే వాళ్ళు ఆ పేరు తీసుకోక పోతే 14 రోజుల లోపు మళ్లీ పాత పేరుకే వెనక్కి వెళ్లే అవకాశం కూడా ఉంటుంది.