E-Paper
Advertisement

విజయదశమి శుభాకాంక్షలు..మీ ప్రియమైన వారికి పంపే బెస్ట్ విషెస్!

విజయదశమి శుభాకాంక్షలు..మీ ప్రియమైన వారికి పంపే బెస్ట్ విషెస్!
Advertisement

Dasara wishes quotes: పండగలు అనగానే మనకు గుర్తొచ్చేది ఆనందం, ఉత్సాహం, మన ఆత్మీయులకు ప్రేమతో శుభాకాంక్షలు తెలపడం. అందులోనూ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అయిన దసరా పండగ రోజున మన ప్రియమైన వారికి విషెస్ చెప్పడం మన సంప్రదాయం. నేటి డిజిటల్ యుగంలో వాట్సాప్, ఫేస్‌బుక్ ద్వారా అందరికీ త్వరగా చేరుకునేలా అద్భుతమైన కొటేషన్లతో శుభాకాంక్షలు చెప్పడం ట్రెండ్‌గా మారింది. మీ బంధుమిత్రుల జీవితంలో విజయాలు నింపేలా పంపడానికి కొన్ని అద్భుతమైన దసరా శుభాకాంక్షల కొటేషన్లు ఇప్పుడు చూద్దాం.

దసరా శుభాకాంక్షలు తెలిపే కొటేషన్లు:

1.చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అయిన ఈ దసరా పండగ మీ జీవితంలో ఎప్పటికీ విజయాలను నింపాలని కోరుకుంటూ.. అందరికీ దసరా శుభాకాంక్షలు!

Advertisement

2.దుర్గామాత ఆశీస్సులతో మీ ఇంట నిత్యం సంతోషాలు, సిరిసంపదలు వర్షంలా కురవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ దసరా!

3. శమీ పూజ మీ జీవితంలో సరి కొత్త కాంతులు తెచ్చి, మీరు తలపెట్టిన ప్రతి పనిలో విజయం చేకూర్చాలి. అందరికీ దసరా శుభాకాంక్షలు!

Advertisement

4. ఈ విజయదశమి మీ కష్టాలన్నీ తొలగించి, మీ జీవితంలో ఆనందాల విజయాన్ని అందించాలని ఆశిస్తున్నాను.హ్యాపీ దసరా !

5. నవరాత్రుల కొలువు తీరిన అమ్మవారి కృప మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ.. విజయాదశమి శుభాకాంక్షలు!

6. మీలోని భయాలను, అహంకారాన్ని జయించి, మంచి ఆలోచనలతో ముందుకు సాగే అద్భుతమైన రోజు ఈ దసరా. అందరికీ దసరా శుభాకాంక్షలు!

7. బతుకమ్మ ఆటపాటల సడితో, అమ్మవారి దీవెనలతో మీ ఇల్లు కళకళలాడాలని కోరుకుంటూ.. హ్యాపీ దసరా!

8. జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాలును జయించే ధైర్యాన్ని దుర్గాదేవి మీకు ప్రసాదించాలి. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు!

9. ఈ పవిత్ర పర్వదినాన మీ కోరికలన్నీ నెరవేరి, మీ జీవితం బంగారంలా మెరిసిపోవాలని ఆకాంక్షిస్తున్నాను.

10. ప్రతికూలతలను ధైర్యంగా ఎదుర్కొని విజయ కేతనం ఎగరవేయాలని కోరుకుంటూ.. దసరా శుభాకాంక్షలు!

11. చెడు ఆలోచనలను దహనం చేసి, మంచి సంస్కృతిని కాపాడుకుంటూ ముందుకు సాగదాం. హ్యాపీ దసరా!

12. అమ్మవారి దివ్య దీవెనలతో మీ కుటుంబంలో.. ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు వెల్లివిరియాలి. దసరా శుభాకాంక్షలు!

13. ఈ విజయాదశమి మీ వ్యాపారంలో, ఉద్యోగంలో నూతన శిఖరాలను అధిరోహించే శక్తి నివ్వాలని కోరుకుంటున్నాను.

14.సమాజంలో శాంతి, సద్భావన , ప్రేమ నిండాలని ఆశిస్తూ.. అందరికీ హృదయపూర్వక దసరా శుభాకాంక్షలు!

15. రావణ దహనం లాగే మీలోని బాధలన్నీ బూడిదైపోయి, కొత్త ఆశలు చిగురించాలి. దసరా శుభాకాంక్షలు!

16. విజయానికి మారుపేరైన ఈ పర్వదినాన మీ ప్రతి ప్రయత్నం విజయవంతం కావాలని కోరుకుంటూ హ్యాపీ దసరా!

17. బంధుమిత్రులందరితో కలిసి సంతోషంగా జరుపుకునే ఈ దసరా మీ జీవితంలో మరువలేని జ్ఞాపకం కావాలి. అందరికీ దసరా శుభాకాంక్షలు!

18. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ ఆ జగన్మాత ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ.. విజయదశమి శుభాకాంక్షలు!

Related News

విచిత్ర వేడుక.. జీవితాంతం పెళ్లి వద్దంటూ ప్రేమికుల గ్రాండ్ సెలబ్రేషన్

టేస్టీ అండ్ స్పైసీ క్యాప్సికమ్ రైస్..నిమిషాల్లో తయారయ్యే రెసిపీ!

బంగాళాదుంపలతో కాదు.. అవకాడోతో ఇలా ఫ్రైస్ చేసేయండి, టేస్ట్ అదిరిపోతుంది!

ఎప్పుడూ పకోడీలేనా? ఈసారి పచ్చి అరటికాయతో ఇలా షామీ కబాబ్ చేసి చూడండి!

దిష్టి ఎలా తీయాలో తెలుసా? వేటితో తీస్తే వెంటనే ఫలితం ఉంటుంది?

కొత్తగా పెళ్లయిన యువతికి ఇంటర్వ్యూలో అలాంటి ప్రశ్న.. మీరైతే ఏం చేస్తారు?

ముఖంపై నల్లటి మచ్చలతో ఇబ్బంది పడుతున్నారా? క్లియర్ స్కిన్ కోసం డాక్టర్ ఏం చెప్పారంటే

Big Stories

Advertisement
×