E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode October 20th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరికి అదిరిపోయే షాక్‌ ఇచ్చిన మిస్సమ్మ  

Nindu Noorella Saavasam Serial Today Episode October 20th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరికి అదిరిపోయే షాక్‌ ఇచ్చిన మిస్సమ్మ  
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:  పార్థు మర్డర్ కేసులో వైజయంతి, అమర్‌తో రాథోడ్‌ చేసిన ఫోన్‌ కాల్‌ గురించి చెప్తుంది. ఆ కాల్‌ చేయించింది భాగీయే అంటుంది. అందుకు అమర్‌ షాక్‌ అవుతాడు. ఈ హత్యలో భాగీ ప్రమేయం ఉందని మీరు నమ్ముతున్నారా..? అని వైజయంతిని అడిగితే.. అసలు నమ్మను కానీ ఈ హత్య ఎవరు చేయాలనుకున్నారో భాగీకి ముందే తెలిసి ఉండాలని డౌటుగా ఉంది అంటుంది వైజయంతి. ఎందుకలా అంటున్నారని అమర్‌ అడిగితే.. ఇక్కడ ఉన్నప్పుడు పార్థు మీద రెండు సార్లు మర్డర్‌ అటెంప్ట్‌ జరిగింది. సో ఢిల్లీలో కూడా పార్థు మీద మర్డర్‌ అటెంప్ట్‌ జరగొచ్చన్న భయంతో మీరు వెంటనే ఢిల్లీ వెళ్లి పార్థును కాపాడాలన్న తాపత్రయంతో భాగీ నీకు బెదిరింపు కాల్‌ చేయించి ఉండొచ్చని నేను అనుకుంటున్నాను అంటుంది వైజయంతి.

మనోహరిని ఆశ్రమానికి అంటూ తీసుకెళ్లిన నన్స్‌ చివరికి మనోహరి పెరిగిన అమ్మ అనాథ ఆశ్రమానికే తీసుకెళ్తారు. అది చూసిన మనోహరి షాకింగ్‌గా ఎక్కడికో తీసుకెళ్తారు అనుకుంటే ఇక్కడికి తీసుకొచ్చారేంటి వీళ్లు అని మనసులో అనుకుంటుంటే నన్స్‌ మనోహరిని కారు దిగమంటారు. మనోహరి కారు దిగగానే రాజు చూసి భయంతో లోపలికి పరుగెడుతాడు. అదేంటి ఇక్కడికి తీసుకొచ్చారు అని మనోహరి అడిగితే.. మన మథర్‌ థెరిస్సా ఫౌండేషన్‌లో ఇది ఒక భాగం అయినా నువ్వు చిన్నప్పటి నుంచి పెరిగిన ఆశ్రమమే కదా ఇక్కడ ఉంటే నీకు పుట్టినింట్లో ఉన్నట్టు ఉంటుందని ఇక్కడికి తీసుకొచ్చాము నువ్వు కొన్ని రోజులు ఇక్కడే ఉండాలి తర్వాత మనం కోల్ కతా వెళ్లిపోదాం అని నన్స్‌ చెప్తుంటారు.

Advertisement

లోపలికి వెళ్లిన రాజు, వార్డెన్‌ సరస్వతితో మనోహరి వచ్చిందని చెప్తాడు. నన్స్‌ తీసుకొచ్చారని చెప్పగానే.. సరస్వతి షాక్‌ అవుతుంది. భాగీ ఎవరినో పంపిస్తుంది అని చెప్పింది కానీ మనోహరిని పంపిందా..? అనగానే.. అయితే వెంటనే మీరు భాగీ మేడంకు ఫోన్‌ చేయండి మేడం అంటాడు రాజు. సరస్వతి భాగీకి ఫోన్‌ చేస్తుంది. ఏంటి భాగీ ఎవరినో పంపిస్తానని మనోహరిని పంపించావు అంటూ అడగ్గానే.. మనోహరి అక్కడి నుంచే వచ్చింది కదా మేడం అందుకే అక్కడికే పంపించాను అంటూ మిస్సమ్మ చెప్తుంది.

మనోహరి ఇక్కడకు వచ్చి ఏం చేస్తుంది అని సరస్వతి అడిగితే.. ఏదైనా చేస్తుంది మేడం.. మీరు అదీ ఇదీ అనకుండా మొహమాట పడకుండా మనోహరి మెడలు వంచి అన్ని పనులు చేయించండి.. మీకు ఇన్నాళ్లు మనోహరిని సరిగ్గా పెంచలేదనే గిల్టీ ఫీలింగ్‌ ఉండేది కదా ఇప్పుడు ఆ ఫీలింగ్‌ మొత్తం పోయేలా మనోహరిని మార్చేయండి.. మొత్తంగా చెప్పాలంటే మనోహరి చేత గొడ్డు చాకిరీ చేయించండి.. తన ఒంట్లోని కొవ్వు మొత్తం కరిగిపోయేలా పని చేయించండి మేడం  అని మిస్సమ్మ చెప్తుంది.

Advertisement

మిస్సమ్మ చెప్పింది మొత్తం విన్న సరస్వతి మాత్రం గొడ్డు చాకిరి చేయిస్తే ఒంట్లో కొవ్వు పోతుందేమో కానీ మనసులో ఉన్న నీచపు బుద్ది ఎలా పోతుంది..? మనుషులను చంపే క్రూరత్వం ఎలా పోతుంది..? తను మనిషిగా ఎలా మారుతుంది అంటూ సరస్వతి అడిగితే మీరే మారేలా చేయాలి. మనోహరికి ఇప్పుడు వేరే ఆప్షన్‌ లేదు. మీరేం చెప్పినా చేస్తుంది అంటూ మిస్సమ్మ చెప్పగానే.. సరే అయితే బయటకు వెళ్లి మనోహరిని రిసీవ్‌ చేసుకుంటాను అంటుంది సరస్వతి.

రాథోడ్‌ అనుమానంగా ఎంత చేసినా మనోహరి మారుతుందా మిస్సమ్మ అని అడుగుతాడు. ఎందుకు మారదు రాథోడ్.. చెరుకు కూడా చక్కెర, బెల్లం ఇవ్వు అంటే ఇస్తుందా..? గానుగలో వేసి తిప్పి పిప్పి చేస్తే చచ్చినట్టు చక్కెర, బెల్లం ఇస్తుంది. మనోహరి కూడా అంతే బాగా నలగాలి అప్పడే మనోహరిలో మార్పు చచ్చినట్టు వస్తుంది అంటూ మిస్సమ్మ చెప్తుంది. బయటకు వెళ్లిన సరస్వతి వెటకారంగా వెల్‌కం బాక్‌ మనోహరి అంటుంది. ఎక్కడి నుంచి వెళ్లారో తిరిగి తిరిగి అక్కడికే వచ్చారన్నమాట అంటాడు రాజు. నన్స్‌ కూడా మనోహరిని వదిలేసి వెళ్లిపోతారు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Podarillu Today Episode : కన్నా తల్లి కోసం కన్నీళ్లు.. నారాయణ మాటతో షాక్.. చక్రికీ నిజం చెప్పిన మహా..

Karthika Deepam 2 Serial Today Episode October 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మరోసారి జ్యోత్స్నను తీసుకెళ్లి అప్పగించిన సూరజ్‌           

Intinti Ramayanam Today Episode: చక్రధర్ టెన్షన్.. కమల్ ఫుల్ హ్యాపీ.. పల్లవికి చక్రధర్ వార్నింగ్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి దిమ్మతిరిగే షాక్.. ఇంట్లోంచి గేంటేసిన భాగ్యం.. చందు మాటతో షాక్..

Brahmamudi Serial Today Episode October 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజు వేసిన ప్లాన్ తనకే బెడిసి కొడుతుందా..? 

Tuesday Tv Movies : మంగళవారం టీవీ సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్..

కావ్య శ్రీతో ఏడు అడుగులు వెయ్యబోతున్న సుధీర్..ఇదెక్కడి ట్విస్ట్ మావా?

Big Stories

Advertisement
×