E-Paper
Advertisement

డెంగీ భయానికి ఎండ్ కార్డ్ పడింది.. భారత్‌లోకి వచ్చేసిన ఫస్ట్ వ్యాక్సిన్!

డెంగీ భయానికి ఎండ్ కార్డ్ పడింది.. భారత్‌లోకి వచ్చేసిన ఫస్ట్ వ్యాక్సిన్!
Advertisement

Dengue Vaccine: ప్రతి ఏటా వర్షాకాలం మొదలైందంటే చాలు.. దేశవ్యాప్తంగా  డెంగీ భయం అలుముకుంటుంది. వేలాది మంది ఈ జ్వరం బారిన పడి ఆస్పత్రుల పాలవుతుంటారు. ఇప్పటివరకు దీనికి ఎలాంటి నిర్దిష్టమైన వ్యాక్సిన్ అందుబాటులో లేదు. కానీ, ఆ నిరీక్షణకు ఇప్పుడు తెరపడింది. డెంగీ నివారణకు జపాన్‌కు చెందిన తకేడా ఫార్మాస్యూటికల్స్ తయారు చేసిన ‘క్యూడెంగా’ (QDENGA) వ్యాక్సిన్‌కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ముందస్తు పరీక్షలు అక్కర్లేదు:

ఈ వ్యాక్సిన్ ప్రత్యేకత ఏమిటంటే.. గతంలో ఎవరికైనా డెంగీ వచ్చినా, రాకపోయినా నిర్భయంగా వేసుకోవచ్చు. సాధారణంగా కొన్ని వ్యాక్సిన్లు తీసుకునే ముందు రక్తం పరీక్షించి పాత ఇన్ఫెక్షన్లను చూడాల్సి వస్తుంది. కానీ క్యూడెంగాకు అలాంటి ముందస్తు టీకా పరీక్షలు (Pre-vaccination testing) ఏమీ అవసరం లేదని కంపెనీ స్పష్టం చేసింది. 4 సంవత్సరాల పిల్లల నుంచి 60 ఏళ్ల వయస్సు ఉన్న పెద్దల వరకు అందరూ దీనిని తీసుకోవచ్చు.

4 రకాల వైరస్‌లకు చెక్:

Advertisement

డెంగీలో నాలుగు రకాల వైరస్ సీరోటైప్‌లు ఉంటాయి. ఈ నాలుగు రకాల వల్ల కూడా వ్యాధి వ్యాపించే అవకాశం ఉంది. అయితే.. క్యూడెంగా లైవ్-అటెన్యుయేటెడ్ వ్యాక్సిన్ కావడం వల్ల ఇది నాలుగు రకాల వైరస్‌ల నుంచి రక్షణ కల్పిస్తుంది. సీజన్‌తో సంబంధం లేకుండా వేధించే డెంగీ నివారణలో ఇది కీలక పాత్ర పోషించనుంది.

Also Read: రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

వ్యాక్సిన్ డోసేజ్ వివరాలు:

Advertisement

ఈ టీకాను రెండు డోసులుగా తీసుకోవాల్సి ఉంటుంది. చర్మం కింద (Subcutaneously) 0.5ml చొప్పున ఈ డోస్‌ ఇస్తారు. మొదటి డోస్ తీసుకున్న మూడు నెలల తర్వాత రెండో డోస్ వేసుకోవాల్సి ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా ఈ వ్యాక్సిన్‌ను ఆమోదించడంతో పాటు.. డెంగీ తీవ్రత ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ప్రీ-స్క్రీనింగ్ లేకుండా వాడవచ్చని సిఫార్సు చేసింది.

సుదీర్ఘ క్లినికల్ ట్రయల్స్:

ఈ వ్యాక్సిన్ సురక్షితమైనదని నిరూపించడానికి తకేడా కంపెనీ గ్లోబల్ స్థాయిలో దాదాపు 28,000 మందిపై ప్రయోగాలు చేసింది. అందులో భాగంగా భారత్ తరపున పాల్గొన్న వారిపై చేసిన ప్రత్యేక ప్రయోగాల్లో కూడా ఇది చాలా సురక్షితమైనదని, శరీరంలో రోగనిరోధక శక్తిని సమర్థవంతంగా పెంచుతుందని తేలింది. ఏడేళ్ల పరిశోధనల డేటా ప్రకారం.. ఇది తీవ్రమైన డెంగీ బారిన పడకుండా, ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం రాకుండా కాపాడుతుందని స్పష్టమైంది.

డెంగీ రహిత భారత్ వైపు అడుగులు:

మన దేశంలో ప్రతీ ఏటా నమోదయ్యే డెంగీ కేసులు ఆరోగ్యంపైనే కాకుండా కుటుంబాల ఆర్థిక పరిస్థితిపై కూడా తీవ్ర ప్రభావం చూపుతాయి. దోమల నివారణ, పారిశుధ్యం లాంటి జాగ్రత్తలతో పాటు ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం వల్ల భవిష్యత్తులో డెంగీ కేసుల సంఖ్య, మరణాల రేటు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.

Also Read: ఆలుగడ్డలు 5 నెలల పాటు తాజాగా ఉండాలా? అయితే ఆ ప్రదేశంలో పెట్టండి!

Related News

వయసు మీరుతున్నా ప్రేమలో మాత్రం ఫ్రెష్‌ ఫీలింగ్.. ఈ తేదీల్లో పుట్టినవారు గ్యారంటీ లవర్స్

రోజూ పకోడీలు తిని బోర్ కొడుతోందా? పచ్చి బొప్పాయితో క్రిస్పీ కట్లెట్స్ ట్రై చేయండి

కృష్ణాష్టమికి మీ పాపను రాధమ్మగా ముస్తాబు చేయాలా? ఫొటోషూట్ అందంగా చేయడానికి టిప్స్

మహిళల్లో ఎముకల బలహీనత సమస్య.. మెనోపాజ్‌కు ముందే బలమైన ఎముకల కోసం ఏం చేయాలి?

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

Big Stories

Advertisement
×