E-Paper
Advertisement

Tan Removal tips: వేసవిలో ముఖానికి నల్లటి ట్యాన్ పట్టేసిందా? సింపుల్ గా ఇలా వదిలించేసుకోండి

Tan Removal tips: వేసవిలో ముఖానికి నల్లటి ట్యాన్ పట్టేసిందా? సింపుల్ గా ఇలా వదిలించేసుకోండి
Advertisement

వేసవి కాలంలో ఎక్కువసేపు ఎండలో తిరిగితే చర్మంపై టాన్ పట్టడం సహజం. ఎండలోని అల్ట్రావయొలెట్ కిరణాలు చర్మాన్ని ప్రభావితం చేసి మెలనిన్ ఉత్పత్తిని పెంచుతాయి. దీంతో చర్మం ముదురు రంగులోకి మారుతుంది. ముఖం, చేతులు, మెడ, కాళ్లపై ఈ టాన్ ఎక్కువగా కనిపిస్తుంది. కొంతమందిలో ఇది కొన్ని రోజుల్లో తగ్గిపోతుంది. కానీ మరికొంతమందికి మాత్రం టాన్ చాలా రోజుల పాటు అలాగే ఉండిపోయి మచ్చల్లా ఏర్పడతాయి. అప్పుడు చర్మం మళ్లీ సహజ రంగులోకి రావడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. టాన్ తగ్గించుకోవడానికి గట్టిగా స్క్రబ్ చేయడం లేదా హానికరమైన కెమికల్స్ వాడడం మంచిది కాదు. చర్మానికి మృదువైన, సహజమైన పద్ధతులు పాటిస్తే టాన్ క్రమంగా తగ్గుతుందని చెబుతున్నారు.

పెరుగు, తేనె మిశ్రమంతో
టాన్ తగ్గించడంలో పెరుగు, తేనె అద్భుతంగా పనిచేస్తుంది. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మంపై ఉన్న మృత కణాలను తొలగించడంలో సహాయపడుతుంది. తేనె చర్మాన్ని తేమగా ఉంచి మెత్తగా మారుస్తుంది. రెండు చెంచాల పెరుగులో ఒక చెంచా తేనె కలిపి ముఖానికి లేదా టాన్ ఉన్న చోట రాయాలి. సుమారు 15 నుండి 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చర్మం క్రమంగా కాంతివంతంగా కనిపిస్తుంది. అలాగే బొప్పాయి కూడా టాన్ తగ్గించడంలో సహాయపడుతుంది. పండిన బొప్పాయిని ముద్దగా చేసి ముఖానికి రాసి కొంతసేపు ఉంచితే చర్మంపై ఉన్న మృత కణాలు తొలగి చర్మం తాజాగా కనిపిస్తుంది.

Advertisement

Also read: Summer Hair oils: వేసవిలో జుట్టు వేగంగా పెరగాలా? ఈ 5 హెయిర్ ఆయిల్స్ వాడండి

శెనగపిండి, పసుపు కలిపి
మన ఇంట్లో చాలా కాలంగా వాడుతున్న చిట్కా ఇది. శెనగపిండి, పసుపు కలిపి చర్మానికి పట్టిస్తే చర్మాన్ని శుభ్రపరచి మలినాలను తొలగిస్తుంది. పసుపులో ఉండే కర్కుమిన్ అనే పదార్థం చర్మానికి సహజ కాంతిని ఇస్తుంది. రెండు చెంచాల శెనగపిండిలో కొద్దిగా పసుపు వేసి పాలు లేదా పెరుగు కలిపి పేస్ట్‌లా తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి ఎండిన తర్వాత మెల్లగా కడిగితే చర్మం మృదువుగా మారుతుంది. అలాగే టమాటా రసం కూడా ట్యాన్ తగ్గించడంలో సహాయపడుతుంది. టమాటాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తాయి. టమాటా రసంలో కొద్దిగా అలొవెరా జెల్ కలిపి రాస్తే చర్మానికి చల్లదనం కలుగుతుంది.

Advertisement

అలోవెరా జెల్ తో
అలొవెరా జెల్ వేసవి కాలంలో చర్మ సంరక్షణకు చాలా ఉపయోగపడుతుంది. ఎండ వల్ల చర్మం ఎర్రబడటం లేదా కాలినట్టుగా అనిపించడం వంటి సమస్యలను ఇది తగ్గిస్తుంది. అలొవెరా చర్మాన్ని చల్లగా ఉంచి తేమను నిలుపుతుంది. రాత్రి పడుకునే ముందు కొద్దిగా అలొవెరా జెల్ రాసి ఉంచితే ఉదయం చర్మం మెత్తగా ఉంటుంది. అయితే టాన్ త్వరగా పోవాలని చాలా గట్టిగా స్క్రబ్ చేయడం మంచిది కాదు. అలా చేస్తే చర్మానికి నష్టం కలిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నిమ్మరసం నేరుగా చర్మంపై రాయడం కొందరికి ఇరిటేషన్ కలిగించవచ్చు. అందుకే కొత్తగా ఏదైనా పద్ధతి ఉపయోగించే ముందు చిన్న భాగంలో పరీక్షించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

ట్యాన్ తగ్గించుకోవాలంటే ముందుగా ఎండ నుంచి చర్మాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. బయటకు వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్ తప్పనిసరిగా వాడాలి. అలాగే టోపీ, గాగుల్స్ లేదా స్కార్ఫ్ ఉపయోగిస్తే చర్మంపై ఎండ ప్రభావం తగ్గుతుంది. రోజూ తగినంత నీరు తాగడం కూడా చర్మ ఆరోగ్యానికి మంచిది. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకుంటే చర్మానికి అవసరమైన పోషకాలు అందుతాయి. టాన్ ఒక్కరోజులో పోదు కానీ సరైన సంరక్షణతో కొన్ని రోజుల తర్వాత చర్మం మళ్లీ సహజ కాంతిని పొందుతుంది.

Related News

వయసు మీరుతున్నా ప్రేమలో మాత్రం ఫ్రెష్‌ ఫీలింగ్.. ఈ తేదీల్లో పుట్టినవారు గ్యారంటీ లవర్స్

రోజూ పకోడీలు తిని బోర్ కొడుతోందా? పచ్చి బొప్పాయితో క్రిస్పీ కట్లెట్స్ ట్రై చేయండి

కృష్ణాష్టమికి మీ పాపను రాధమ్మగా ముస్తాబు చేయాలా? ఫొటోషూట్ అందంగా చేయడానికి టిప్స్

మహిళల్లో ఎముకల బలహీనత సమస్య.. మెనోపాజ్‌కు ముందే బలమైన ఎముకల కోసం ఏం చేయాలి?

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

Big Stories

Advertisement
×