E-Paper
Advertisement

Spicy Paniyaram: స్పైసీ గుంతపొంగనాలు ఇలా చేస్తే కొబ్బరి చట్నీతో రుచి అదిరిపోతుంది

Spicy Paniyaram: స్పైసీ గుంతపొంగనాలు ఇలా చేస్తే కొబ్బరి చట్నీతో రుచి అదిరిపోతుంది
Advertisement

ఉదయం బ్రేక్ ఫాస్ట్ ఏం చేయాలా? అని ఆలోచిస్తున్నారా? స్పైసీ గుంత పొంగనాలు చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి. దీన్ని ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గానే కాదు, సాయంత్రం స్నాక్‌గా కూడా చేసుకుని తినవచ్చు. సాధారణంగా ఇడ్లీ లేదా దోశ పిండితో చేసే ఈ వంటకం చేసేందుకు ఎక్కువ సమయం కూడా పట్టదు. కొంచెం మసాలా, ఉల్లిపాయలు కలిపి తయారు చేసే ఈ గుంతపొంగనాలు అందరికీ నచ్చుతాయి.

స్పైసీ గుంతపొంగనాలు రెసిపీకి కావాల్సిన పదార్థాలు
బియ్యం – రెండు కప్పులు
మినపప్పు – అర కప్పు
మెంతులు – అర స్పూన్
ఉల్లిపాయలు – రెండు
పచ్చిమిర్చి – 3 లేదా 4
అల్లం – చిన్న ముక్క
కరివేపాకులు – గుప్పెడు
ఆవాలు – ఒక స్పూన్
జీలకర్ర – అర స్పూన్
ఇంగువ – ఒక చిటికెడు
ఉప్పు – తగినంత
నూనె – అవసరమైనంత

Advertisement

Also read: Tan Removal tips: వేసవిలో ముఖానికి నల్లటి ట్యాన్ పట్టేసిందా? సింపుల్ గా ఇలా వదిలించేసుకోండి

స్పైసీ గుంతపొంగనాలు రెసిపీ
1. మొదట బియ్యం, మినపప్పు, మెంతులు మూడింటినీ బాగా కడిగి ఒక గిన్నెలో వేసి సుమారు 4 గంటల పాటు నీటిలో నానబెట్టాలి.
2. తరువాత నీరు వంపి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలి. ఈ పిండిలో కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ పిండిని కనీసం 7 నుంచి 8 గంటలు లేదా రాత్రంతా మూతపెట్టి ఉంచాలి.
3. ఒక కళాయి స్టవ్ మీద పెట్టి తీసుకుని అందులో ఒక స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడిగా అయ్యాక ఆవాలు, జీలకర్ర వేయాలి.
4. అవి చిటపటలాడిన తర్వాత పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు వేయాలి. తరువాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి బాగా వేయించాలి.
5. ఉల్లిపాయలు కొద్దిగా బంగారు రంగులోకి మారే వరకు వేయిస్తే మంచి రుచి వస్తుంది. చివరగా ఒక చిటికెడు ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ మసాలా మిశ్రమాన్ని పులిసిన పిండిలో వేసి బాగా కలపాలి.
6. ఇప్పుడు గుంత పొంగనాలు వేసే పాన్ తీసుకుని స్టవ్ మీద పెట్టాలి. చిన్న చిన్న గుంతల్లో కొద్దిగా నూనె వేయాలి.
7. తరువాత చెంచాతో పిండిని ప్రతి గుంతలో పోయాలి. కళాయిపై మూత పెట్టి మధ్యస్థ మంటపై 3 నుంచి 4 నిమిషాలు ఉంచాలి.
8. రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. ఇలా రెండు వైపులా బాగా వేగిన తర్వాత గుంతపొంగనాలు తీసి ప్లేట్‌లో పెట్టుకోవాలి. అంతే స్పైసీ గుంత పొంగనాలు సిద్ధమైనట్టే.

Advertisement

వేడివేడిగా ఈ గుంత పొంగనాలు కొబ్బరి చట్నీ, టమాటా చట్నీ లేదా సాంబార్‌తో తింటే చాలా బాగుంటాయి. సాయంత్రం టీ టైమ్‌లో కూడా ఇది మంచి స్నాక్‌గా ఉపయోగపడుతుంది.

Related News

కొబ్బరి మసాలాతో కోస్తా స్టైల్ ఎండుచేపల పులుసు.. ఒక్కసారి తింటే లైఫ్‌లో టేస్ట్ మర్చిపోరు!

పిల్లలు ఇష్టంగా తినే ఈజీ బ్రేక్‌ఫాస్ట్.. బియ్యం లేకుండానే కరకరలాడే సాఫ్ట్ దోశ!

టేస్ట్ అట్లాస్ టాప్ లిస్ట్‌లో ఇండియన్ ఐస్‌క్రీమ్స్.. వీటిని హైదరాబాద్‌లోనే తినేయొచ్చని మీకు తెలుసా?

సమ్మర్ స్పెషల్.. శరీరానికి చలువ చేసే బెస్ట్ రైస్ డిషెస్ ఇవే!

తక్కువ వంట గ్యాస్‌తో రుచికరమైన భోజనం.. ఈ 7 వంటకాలను ట్రై చేయండి!

క్విక్ అండ్ ఈజీ.. 10 నిమిషాల్లో సిద్ధమయ్యే 7 సమ్మర్ నో-కుక్ మీల్స్

బెంగాల్ స్పెషల్.. జాల్ముడిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, జస్ట్ ఇవి ఉంటే చాలు!

ఒక్కసారి ఇలా సాంబార్ ట్రై చేసి చూడండి.. మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు!

Big Stories

Advertisement
×