E-Paper
Advertisement

Egg Colours: గుడ్డు పెంకు రంగు వెనుక ఉన్న సైన్స్.. పోషక విలువల్లో తేడా ఉంటుందా ?

Egg Colours: గుడ్డు పెంకు రంగు వెనుక ఉన్న సైన్స్.. పోషక విలువల్లో తేడా ఉంటుందా ?
Advertisement

Egg Colours: సాధారణంగా మనం మార్కెట్‌లో గోధుమ రంగు, తెలుపు రంగులో ఉండే గుడ్లను చూస్తుంటాం. చాలా మంది వీటి మధ్య పోషక విలువల్లో లేదా రుచిలో తేడా ఉంటుందని భావిస్తుంటారు. అయితే.. వాస్తవానికి ఈ రెండు రకాల గుడ్ల మధ్య చెప్పుకోదగ్గ తేడాలు ఏవీ లేవు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

గుడ్డు రంగుకు కారణం ఏంటి ?
గుడ్డు పెంకు రంగులో తేడా ఉండటానికి ప్రధాన కారణం వాటిని పెట్టే కోడి జాతి .

Advertisement

తెల్ల గుడ్లు: సాధారణంగా ‘వైట్ లెగోర్న్’ వంటి తెల్లటి ఈకలున్న కోళ్లు తెల్లటి గుడ్లను పెడతాయి. ఈ కోళ్లు చిన్నవిగా ఉండి, తక్కువ మేతతో ఎక్కువ గుడ్లు పెట్టగలవు. అందుకే ఇవి వాణిజ్యపరంగా పెద్ద ఎత్తున గుడ్ల ఉత్పత్తికి అనుకూలం.

గోధుమ రంగు గుడ్లు: ‘రోడ్ ఐలాండ్ రెడ్స్’ లేదా ‘ప్లైమౌత్ రాక్స్’ వంటి ముదురు రంగు లేదా ఎరుపు-గోధుమ రంగు ఈకలున్న కోళ్లు గోధుమ రంగు గుడ్లను పెడతాయి. ఈ కోళ్లు సాధారణంగా తెల్ల కోళ్ల కంటే పరిమాణంలో పెద్దవిగా ఉండి, ఎక్కువ మేత అవసరమవుతాయి.

Advertisement

కోడి గుడ్డు పెంకు యొక్క రంగు అనేది కోడి శరీరంలో ఉత్పత్తి అయ్యే వర్ణద్రవ్యాలపై ఆధారపడి ఉంటుంది. గోధుమ రంగు గుడ్లలో ప్రోటోపోర్ఫైరిన్ IX అనే వర్ణద్రవ్యం ఉంటుంది.

పోషక విలువల్లో తేడా ఉందా ?
గుడ్ల రంగు ఏదనా వాటి పోషక విలువల్లో పెద్దగా తేడా ఉండదు.

తెలుపు, గోధుమ రంగు గుడ్లలోని ప్రోటీన్, విటమిన్లు , మినరల్స్, కొవ్వుల పరిమాణం దాదాపు ఒకే విధంగా ఉంటుంది.

ఒక గుడ్డులో ఉండే పోషక విలువలు దాని రంగుపై కాకుండా.. కోడి తినే ఆహారం , పెంపకం వాతావరణం, ఆరోగ్య పరిస్థితిపై ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే ఆహారం తిని పెరిగే కోళ్లు పెట్టే గుడ్లలో ఆ పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అది తెలుపు గుడ్డు అయినా, గోధుమ రంగు గుడ్డు అయినా .

సేంద్రీయంగా పెరిగిన లేదా బయట తిరిగే కోళ్లు పెట్టే గుడ్లలో కొన్ని పోషకాలు కొద్దిగా ఎక్కువగా ఉండవచ్చు. కానీ దానికి గుడ్డు రంగుతో సంబంధం లేదు.

రుచి, ధరలో తేడా:
రుచి: గుడ్ల రుచి వాటి రంగుపై ఆధారపడి ఉండదు. చాలా మంది గోధుమ రంగు గుడ్లు రుచిగా ఉంటాయని భావిస్తారు. కానీ అది కేవలం అపోహ మాత్రమే. గుడ్డు రుచి, కోడి యొక్క ఆహారం, గుడ్డు తాజాదనంపై ఆధారపడి ఉంటుంది.

ధర: చాలా సందర్భాలలో.. గోధుమ రంగు గుడ్లు తెలుపు గుడ్ల కంటే కొంచెం ఎక్కువ ధర పలుకుతాయి. దీనికి కారణం, గోధుమ రంగు గుడ్లు పెట్టే కోళ్లు ఎక్కువ మేత తినడం, వాటిని పెంచడానికి అదనపు ఖర్చు కావడం. అంతేకాకుండా.. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు గోధుమ రంగు గుడ్లు ‘దేశీ గుడ్లు’ లేదా ‘మంచివి’ అనే అపోహతో వాటిని ఎక్కువగా కొనుగోలు చేస్తారు.

ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏటంటే.. గోధుమ రంగు గుడ్లు, తెలుపు రంగు గుడ్ల మధ్య ఉన్న ఏకైక అసలు తేడా గుడ్డు పెంకు రంగు మాత్రమే. ఈ రంగు కేవలం కోడి జాతిని బట్టి మారుతుంది. పోషక విలువలు, నాణ్యత లేదా రుచి విషయంలో రెండూ సమానంగానే ఉంటాయి.

Related News

LED ఫేస్ మాస్క్ ముఖంపై ముడతలు తగ్గిస్తుందని ప్రచారం.. నిజంగా పనిచేస్తుందా?

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

Big Stories

Advertisement
×